Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 3

    నేల  రోజుల తరువాత తిరిగి త్రిపుర అత్తవారింటికి వచ్చింది.

    రెండో సమర్త  పుట్టింట్లో కావడంతో లాంచనాలన్నీ సక్రమంగా జరిగాయి. పసుపు నూనె రాసుకొని పచ్చగా తేలింది త్రిపుర.  సంధ్యా సమయంలో అరవిచ్చుకొన్న బొండు మల్లెలా ఉంది.

    తిపురని చూస్తుంటే పెళ్ళి రోజు సుందర్ అన్నమాట జ్ఞాపకం వస్తుంది. పెళ్లిరోజు,త్రిపురని ముత్తదువులు వేళాకోళం పట్టివ్వడం జ్ఞాపకం వస్తుంది.సన్నని పిల్ల తెమ్మెర సోకినట్టుగా.

    "బొత్తిగా ఈడూజోడూ కాదు!  పిల్ల వాడి పిడికిటికి చాలదు పిల్ల"  అని ఒకరంటే,

    "పెద్దమనిషి అయ్యి, పిల్ల వాడి చెయ్యి పడితే ఇట్టే ఇళ్ళ వచ్చే స్తుంది. ఇద్దరు పిల్లలు పుడితే డ్రాముల్లా   ఊరిపోయే వాళ్ళను ఎంత మందిని చూడలేదు? అప్పుడు పిల్ల క్రిందకే పిల్లవాడు చాలనట్టుగా  అవుతాడు"  అని ఒకరు.

    'ఏయ్,  పిల్లా.  మీ ఆయన రాత్రిపూట చుక్కల్ని లెఖ్ఖబెట్టె అవస్ధ ఎప్పుడు తప్పిస్తావో.  కొబ్బరి నువ్వులు బాగా దంచుకుతిను' అని ఒకరు. 

     వాళ్ళ వేళాకోళలకు సిగ్గుపడే వయసు లేదు త్రిపురకప్పడు. పెళ్ళంటే లడ్డు భక్ష్యాలు,  భజంత్రీలు,  పట్టుచిరెలు,  హడావిడి-  పెళ్ళి వేడుకలకి సంతోషంతో వెలిగిపోయింది త్రిపుర ముఖం.

     నాలుగేళ్ళ తరువాత ఇప్పుడూ,  వయసు వికసిస్తున్నదే గాని మనసు వికసిస్తున్నట్టుగా లేదు ఆమెకు. ఆ కళ్ళలో ఆ పసితనం ఆ అమాయకం అలాగే ఉన్నాయి.

    టీచరు చెప్పినా పాఠాలు చక్కగా నేర్చుకొంటోంది.  పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంగీతం మరిచిపోకుండా రోజూ శ్రద్ధగా సాధన చేసుకొంటోంది.   అత్తగారికి పనిలో చేదోడువాదోడుగా ఉంటోంది.  భర్త అంటే మటుకు ఆశక్తి ఏర్పడలేదు. 

    కానీ త్రిపుర నివురు కప్పిన నిప్ప లాంటిదని బోధపదసాగింది మల్లిక్ కు.


                                                                             3

    "త్రిపురా ఇవాళ మా స్నేహితుడి పెళ్ళి ఫంక్షను ఉంది సాయంత్రం ఆరు గంటలకు మనం అక్కడా ఉండాలి.  ఈ చిర  కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో.  బొత్తిగా అమ్మమ్మలా తయరవకు.  పాషన్ గా ఉండాలి. కుంకుమబొట్టు మరి అంత పెద్దదిగా దిద్దుకోకు.  నీ ముఖస్నికి చిన్న బోట్టే అందంగా ఉంటుందని నా ఉద్దేశం  ఆ జూకాలు పూర్తిగా పాతకాలం అలంకరణ. నేనుతేచ్చిన రింగులు వేసుకో అవి తీసేసి.  ఈ చేతికి ఒక బంగారు గాజు. ఆ చేతికి వాచీ చాలు.  జడ మరి అంత బిగుతుగా వద్దు. జుట్టు చెవుల మీదికి వచ్చేట్టు వదులుగా వేసుకో"  త్రిపుర ఎలాతయర్తే ఉండాలో చెప్పివెళ్ళాడు మల్లిక్.

    అతడు వెళ్ళాక,  అతడు తనకోసం తిసి ఉంచిన చిరవిప్పి చూసింది త్రిపుర.  దేవతావస్త్రం.  అది కట్టుకుంటే ఒళ్లంతా బయటే ఉంటుంధన డంలో సందేహంలేదు. త్రిపుర కి జుగుప్సతో ఒళ్ళు జలధరించినట్టుగా అయింది.  చీరని పట్టుకువెళ్ళి  కుప్పగా అత్తగారి ముందు పడవేసింది.

    "అత్తయ్య!  ఈ చిరకట్టుకొని తన స్నేహితుడి పెళ్ళి ఫంక్షనుకి వెళ్ళాల టతను"  చెప్పింది ఫిర్యాదుగా.

    ఆవిడ నోరు నొక్కుకుంది.  "ఏ  భోగంవాళ్ళో  కట్టుకొని కులుకులు వేల్లబోసే చిర ఇది!  వీడికి మతిగాని పోయిందేమిటి? ఫాషన్స్ పేరిట ఒళ్ళు విధుల్లో పడేసుకోంటారా ఎవర్తేనా?  వాటి మాట ప్రకారం నడుచుకోంతే బొత్తిగా నీకేమి విలువ  మిగులదు!  చక్కగా పట్టుచీర కట్టుకో! పట్టుచీర అందం పాము కుబుసాలకి వస్తుందా?  దువ్వెన తీసుకురా,  జడ వేస్తాను"

    త్రిపుర  దువ్వెన తీసుకువచ్చి అత్తగారి చేతికిచ్చి బుద్దిమంతురాల్తేన పిల్లలా ఆవిడ ముందు కూర్చుంది.  నిడుపాటి వెంట్రుకలు! పిడికిట పట్టవు. అంత లీవు పడుతుంది.  జాడ త్రిపురకి ఇంత వయసొచ్చినా జడ వేసుకోవటం రాది! ఆసలు చిక్కులు తీసుకోవడమే చేతగాదు!ఎవరూ వేయడానికి లేకపోతే చిక్కులన్నీ అలాగే పెట్టేసుకొని అస్తవ్యస్తంగా వేసుకొంటుంది! పుట్టింట్లో తల్లి వేస్తే ఇక్కడ అత్త వేస్తుంది జడ.

    యశోదమ్మ కోడలికి చిక్కులు తిసి జడవేసి,  చివరివరకూ అలలక పోతే వెంట్రుకల చివరలు విరిగిపోతాయని,  జడగంటలు కూడా వేసింది "పూలు కోసిచ్చి స్నానానికి వెళ్ళు నువ్వోచ్చేసరికి మాలకట్టి ఉంచుతాను!"

    పెరట్లో మల్లెలు,  కనకాంబరాలు,  మరువం కోసి తెచ్చి అత్తగారి కిచ్చి స్నానానికి వెళ్ళింది  త్రిపుర.

    గంట తరువాత మల్లిక్ వచ్చాడు.

    నుదుట నయాపైసంత బొట్టు,  జడలో తట్టెడు పూలు,  పట్టుచీర- అచ్చం అమ్మవారిలా  కనిపించిందిత్రిపుర.

    త్రిపుర  చెయ్యిపట్టుకొని బరాబరా ప్రక్క గదిలోకి లాక్కు వెళ్ళాడు.  "నేను నీకు చెప్పిందేమిటి?  నువ్వు చేసిందేమిటి?" కోపంగా అడిగాడు.

    త్రిపుర కళ్ళు క్రిందికి వాల్చుకోందే గాని జవాబు చెప్పలేదు. 

    "భక్తుల మధ్యకు పూజలందుకోడానికి బయల్దేరుతున్న అమ్మవారిలా వున్నావు!  ఒక డాక్టరు గారి భార్యాలా లేవు!  అక్కడికి  వచ్చేవాళ్ళంతా  ఎలాంటి వాళ్ళో తెలుసా?  డాక్టర్లు ,లాయర్లు,  మాస్టార డిగ్రిలున్న వాళ్ళు!   వాళ్ళమధ్యకు నిన్నిలా తిసుకువేడితే నిన్నో జంతువుని చూసినట్టుగా చూడడం ఖాయం!  నేను సిగ్గుతో తలేత్తుకోలేను!"

    త్రిపురకి కళ్ళలో నీళ్ళు తిరుగుతూంటే,  "అంత బాదేందుకు మీకు?  నన్ను తిసికెళ్ళడం మానేస్తే సరిపోతుంది కదా?"  అంది.

    "ఎందుకు?  నిన్ను  నాలుగు గోడల మధ్యన బంధించి ఉంచానని, బురబావేశానని బయటి వాళ్ళు  అనుకోడానికా?  నా భార్యని నలుగురిలో త్రిప్పగల సంస్కారం నాకుందని అందరికి తెలియాలి!  నా స్నేహితులందరు ఎలాంటి వాళ్ళో తెలుసా?  భార్యని౮ తమకు సమంగా చూస్తారు.  ఎక్కడికి వెళ్ళినా వెంటతీసుకు వెడతారు!  పరాయి మగవాళ్ళతో  ఫ్రీగా మసలేట్టు చేస్తారు.  నిన్ను నా భార్యగా సగర్వంగా  పరిచయం చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మవారిలా తయారయ్యావు"

    "నిజంగా మీరు సంస్కారవంతు  ల్తెతే  మీ భార్యను బయటివారికి ఉన్నదున్నట్టుగా పరిచయం చేయండి. ఇలా వేషం వేసి తిసికెళ్ళడం సంస్కారం అనరు!"

    త్రిపుర మాటలు చెళ్ళున చరిచినట్టుగా అయింది మల్లిక్ కు.

    "వాయినం అందుకోడానికి తయార్తెన ముత్తయిదువులా ఉన్న నిన్ను ఇలాగే వెంట బెట్టుకు వెళ్ళనా? వాళ్ళంతా నిన్నో జంతువులా చూస్తారు తెలుసా?  నేనేం అంత కాలి కోరిక కోరాను? డాక్టరునికదా?  నా భార్య కాస్త ఫాషన్ గా తాయారు కావాలని కోరుకొంటున్నాను!"

    "మీ కిది చిన్నకోరికే కావచ్చు!  నా మనసుకు నచ్చానపుడు మిది చిన్న కోరిక్తేనా ఒక్కటే! పెద్ధకోరిక్తేనా ఒక్కటే!ఒళ్ళు సగం సగం కప్పకోడం నాకు చాతకాదు!"

    "ఆ  జడగంటలకి బదులు గుడిగంటలు కట్టుకో! ఇంకా బాగుంటావు!...."  కసిగా అన్నాడు మల్లిక్.

    "మీరేమ్తెనా అనండి!  నేనుండేది ఇలాగే! ఇష్టమ్తెతే  తిసికెళ్ళండి .  లేకుంటే లేదు!"  ఖచ్చింతంగా చెప్పింది త్రిపుర.

    త్రిపురని తీసుకువస్తానని  ఫ్రెండ్సు కి  మాటిచ్చాడు.  ఇప్పుడు ఒక్కడే వెడితే వాళ్ళంతా పిక్కుతింటారు.  అక్కడేద్తేనా  జరిగితే ఆ అవమానాని  క్తేనా  కళ్ళు తెరుస్తుందేమో ఈ దెయ్యం.

    త్రిపురని తిసుకునిబయల్దేరాడు మల్లిక్.

    పెళ్ళికొడుకు రమేష్ కోటిశ్వరుడి కొడుకు.  మనుషులేంత ఆధునికంగా కనిపిస్తారో అక్కడా పద్ధతులూ,  పనులూ అంత ఆధునికంగా ఉంటాయి! ఫంక్షన్ కి  అందరూ హ్తె సోస్తేటికి  చెందినవాళ్ళే ఆహ్వానింప బడ్డారు! అక్కడికి వచ్చిఅనా వాళ్ళందరూ మల్లిక్ చెప్పినట్టుగా సీతాకోక చిలుక్స్ల్ల అత్యంత ఆధునికంగా అలంకరించుకొన్న వాళ్ళే ఉన్నారు. పెదవులకి రంగులు గోళ్ళకు రంగులు,  చెంపలకు రంగులు, చేతుల్లేని రవికీలు,  బోడ్డుకింద చిరలూ,  బాబ్డ్ హెయిర్స్,  కొత్తిమిరకట్టలా కట్టిన జుట్టు.

 Previous Page Next Page