Previous Page Next Page 
అనుహ్య పేజి 12

    "ఏదీ... ఓ పాట  పాడుతల్లీ... బాగా పాడ్తావని కనక  చెప్పింది" అన్న  వాళ్ళమ్మ  గారి కోరిక కదనలేక 'వినిపించని రాగాలే...' అంటూ  మొదలు  పెట్టాను.
    పాట పూర్తయ్యేసరికి ఆవిడా, కనకతోపాటు ఇంకెవరో కూడా చప్పట్లు కొట్టడం  వినిపించి ఆశ్చర్యంగా చూశాను అతను ... చాలా  హేండ్సమ్ గా  వున్నాడు. జీన్స్  ప్యాంట్  మీద  గీతలు టీ షర్ట్ వేసుకుని, కళ్ళద్దాల చాలా విలక్షణంగా   కనిపించాడు.
    "మనసే విహంగముగా...' అని మీరు  తన్మయులై పాడుతుంటే నాకూ  అలాగే ఎగిరిపోతున్నట్లు  అనిపించింది మార్వలెస్! చాలా బాగా  పాడారు!" అంటూ  కంప్లిమెంట్స్ కురిపించాడు.
    ఈ కొత్త శాల్తీ ఎవరూ? అన్నట్లున్న  నా చూపులకి జవాబిస్తూ, "వీడు  దిలీప్  మా పెద్దమ్మా  కొడుకు పాటలంటే చెవి  కోసుకుంటాడు" అంది కనక.
    "నో...నో... అలాంటి పిచ్చి పనులేం చెయ్యను... పక్కవాళ్ళ చెవి కొనుకొని  అతికించుకోవాలనుకుంటాను... ఇంతకీ  మేడమ్ పేరూ..." అన్నాడు.
    "విద్య..." అన్నాను.
    "మా కోతిలాగే  మీరు కూడా టీచరా?" కనక చెవి పట్టుకుంటూ అడిగాడు.
    "ఏయ్...నువ్వేకోతీ!" కనక అతన్ని కొట్టబోయింది.
    నేను  నవ్వుతూ తల వూపాను.
    డోర్ వేసేశాడు. నన్నుఅలాగే  ఈడ్చుకుంటూ వెళ్ళి విసురుగా సోఫాలోకి తోసి- "నేను  మంచిగా  చెప్పినప్పుడే వినడం  నేర్చుకో ... రాక్షసుడిలా మార్చకు కొట్టినందుకు క్షమించు" అన్నాడు.
    నేను నా చెంప పట్టుకుని అలాగే అపనమ్మకంగా అతన్ని  చూస్తుండిపోయాను.
    అనసూయమ్మగారి  మనవరాలంటే చిన్నప్పటి నుండీ అందరికీ  ఎంత  అపురూపం! ఎంత గారాబం! అందరిముందూ నన్ను చెంప పగలగొడ్తాడా? పుట్టి బుద్దెరిగాక ఇంత అవమానం ఎప్పుడూ  అనుభవించలేదు! ఎప్పుడూ  ఓ మాట  కూడా పడని  నేను  ఇతని చేత మూడుముళ్ళూ వేయించుకున్న  పాపానికి... ఇలా దెబ్బలూ  తింటూ  అభిమానం  చంపుకుని మిగతా జీవితం అంతా  గడపాలా? ఎలా? నేను వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే  పడుకునిపోయాను.
    ఓ రాత్రివేళ ఎందుకో మెలకువ వచ్చి చూస్తే  అతను  నన్ను  రెండు చేతులమధ్యా ఎత్తుకుని తీసుకెళ్తూ కనిపించాడు "చీ! నన్ను ముట్టుకోవద్దు" అని విదిలించుకొబోయాను. అతను నన్ను మంచంమీద  వదిలిపెట్టి, వెనక్కితిరగి  వెళ్ళిపోయాడు.
                                                                 *        *        *
    అమ్మమ్మ నన్ను కాపురానికి పంపిస్తూ చెప్పిన మాటలు  పదేపదే  గుర్తొస్తున్నాయి. అతనికి బాగా అహంకారం  పొగరు. నన్ను  అవసరాలు తీర్చే ఓ  సాధనంలా మాత్రమే  చూస్తున్నాడు. 'నీ  ఇష్టాలు నీవి. నన్ను చెయ్యమని అడగకపోతే అంతే చాలు!' అన్నాడు. కానీ  ప్రతీదీ సెక్స్ తో ముడిపెట్టి 'ఇది ఇద్దరికీ సంబంధించిన విషయంకదా!' అంటాడు. నేనూ  మొండిగా తయరయ్యను.
    "పార్టీకి వెళ్ళాలి. నేను  వచ్చేసరికి  తయారవ్వు" అని అతను ఫోన్  చేస్తే, నేను  పెద్ద పట్టుచీర కట్టుకుని సిగ చుట్టుకుని తయరయ్యేదాన్ని.
    అతను ' ఎంత  బావున్నానో!'  అంటే  మరునాడు చాలా  సింపుల్  తయారయ్యేదాన్ని.
    ఆ రోజు  మా అత్తగారు ఫోన్ చేసి-" అనూహ్యా, రేపు బాబు బర్త్ డే! వాడికి సేమ్యా పాయసం అంటే చాలా ఇష్టం" అని చెప్పేదాకా అతని  బర్త్ డే  ఎప్పుడో నాకు  తేలియనే లేదు. ఒకవేళ అడిగితే- "అది గాంధీ జయంతీ, అంబెద్కర్ జయంతీ లా  జరుపుకో వలసినంత సంగతి కాదు!" అని కొట్టిపారేస్తాడు.
    నేను  మధ్యాహ్నం షాపింగ్ కి వెళ్ళి అతనికోసం సిల్క్ లాల్చీ, పై జామా కొన్నాను. వాటిల్లో అతను  బెంగాలీలా వుంటాడనిపించింది.
    ప్రొద్దుటే నిద్ర లేపి-
    "పదండి... తలంటు పోస్తాను" అన్నాను.
    "ఏం... అంత చండాలమైన వాసన వస్తోందా?" కనుబొమలు పైకి చేసి  అడిగాడు.
    నాకు నవ్వొచ్చింది. " అదేం  కాదు! పుట్టినరోజు బాబుకదా... అందుకూ" అన్నాను.
    "ఓ... అయితే  ఎత్తుకు తీసుకువెళ్ళు" అతను చేతులు జాపాడు.
    నేను అతని  చేతులు పట్టి లేవదీస్తూ- "ముందు  స్నానం కానివ్వండి" అన్నాను.
    అతను షర్టు విప్పగానే వీపుమీద ఎర్రగా  కందిపోయి వుండడం చూసి-" అయ్యో! ఏం  కుట్టిందండి... ఇంత ఎర్రగా కందిపోయిందీ?" అన్నాను.
    అతను నవ్వుతూ- "ఏం చెయ్యను చెప్పు? నా గర్ల్ ఫ్రెండ్  వయొలెంట్ సెక్స్  ఇష్టపడ్తుంది" అన్నాడు.
    నేను కొపంగా  కుంకుడుకాయ పులుసు  అతని  కళ్ళల్లో  పడేట్లు పోసి బరబరా రుద్దాను.
    "ఏయ్... అంత మోటుదనం పనికిరాదు" అన్నాడు కళ్ళు నులుపుకుంటూ.
    నేను తల రుద్ది, చేతిలోని స్టీలు గిన్నె కింద ఎత్తి పడేస్తూ "ఈ ఇంట్లో స్టీలు చెంచా దగ్గర్నుండి, మీదాకా  నా స్వంతం పరాయివాళ్ళు వాడితే ఒప్పుకోను" అని బయటికి వచ్చేశాను.
    వివేక్ బాత్ రూమ్ లోంచి వస్తూ
    "వస్తువులు వుండగానే సరికాదు! వాడుకోవడం కూడా తెలియాలి. అసలు నువ్వు నా సెక్రెటరీ దగ్గర కొన్నాళ్లు కోచింగ్  తీసుకో!" అన్నాడు.
     "సె...క్రె...ట...రీ...నా!" అన్నాను ఆశ్చర్యంగా.
    "అరె! నువ్వు  చూడలేదుకదూ, బిల్ కుల్ అనార్కలి...దానిమ్మ మొగ్గ" అన్నాడు నా బుగ్గమీద చిటికె వేసి. నేను  పరపరా బుగ్గని కొంగుతో తుడిచేసుకుని- "అయితే జేబులో పెట్టుకుని ఊరేగండి" అన్నాను.
    "పర్మిషన్  గ్రాంటేడా?" కవ్విస్తున్నట్లుగా నా ముక్కు పట్టుకుని అడిగాడు.
    "ఛస్తేఒప్పుకోను!" గుప్పెటబిగించి అతని గుండెల మీద కొడ్తూ అన్నాను.
    "అయితే మరి నువ్వు  నేర్చుకుంటావా?" అడిగాడు.
    "ఏవిటి?"
    "వయొలెంట్ సెక్స్!"
    గోళ్ళు చూపించి-" బరుకుతాను. కోరుకుతాను... చాలా?" అన్నాను.
    అతను కన్నుకొట్టి-  "కోపంలో అందంగా  వున్నావు"  అన్నాడు.
    "రాత్రికి ఏంచెయ్యనూ?" కొత్త లాల్చీ అందిస్తూ అడిగాను.
    "చెవిలో చెప్తాను" అన్నాడు.
    "ఆ  విషయం  కాదు! నేను  అడిగేది భోజనంలోకి" సిగ్గుగా అన్నాను.
    "ఏంవద్దు... డిన్నర్ కి బయటికి వెళ్దాం కానీ  నాదో కోరిక!" అన్నాడు.
    "ఏవిటదీ?"
    వివేక్  మంచంమీదున్న  ప్యాకెట్ తీసి- "నువ్వు  ఈ డ్రెస్ వేసుకోవాలి" అన్నాడు.
    అది పింక్  కలర్  చూడీదార్!
    "నే...నా!" మిన్నువిరిగి మీద పడ్డట్లుగా అరిచాను.
    "ఏం? ఒంటినిండుగానే వుంటుంది. ఈ డ్రెస్ లో నువ్వు అందంగా  వుంటావు తెలుసా?" అన్నాడు.
    నేను మూతి తిప్పి "అయితే మీరు  లాల్చీకింద గోచీ పోసి  పంచె కట్టుకుంటారా? చాలా అందంగా  వుంటారు" అన్నాను.
    "మొండిగా మాట్లాడుతున్నావు"
    "నేను  చెప్పిన మాట మీరూ  వినాలిగా మరి!"
    నేనేదో నిన్ను బట్టలు విప్పుకొమన్నట్లు చేస్తావేం?" అన్నాడు వివేక్.
    "నేనూ మిమ్మల్ని బట్టలు విప్పుకోమనలేదే"
    వివేక్  నా వైపు చిరాగ్గా  చూసి , బెదిరిస్తున్నట్లుగా- "తెగేదాకా  లాగుతున్నావు... తర్వాత విచారించవలసి వస్తుంది జాగ్రత్త!" అన్నాడు.
    "ఎవరి అలవాట్లూ పద్ధతులూ వాళ్ళని! బలవంతంగా మార్చుకోవడం ఎందుకులెండి" అన్నాను.
    "నువ్వు మారకపోతే  నేను  నా భార్యనే  మార్చాల్సి వస్తుంది జాగ్రత్త" అతను కటువుగా  అనేశాడు.
    నేను బిత్తరపోయి  చూస్తుండి పోయాను.
    "నా భార్య ప్లేస్ లో  నాకు కావల్సింది అందమైన, ఏక్టివ్ గా వుండే అమ్మాయి! అమ్మమ్మకాదు..." అని  హాల్లోకి వెళ్లి- "హాయ్... అనార్కలీ! ఎంతసేపైంది వచ్చి?" అని అడిగాడు.
    నేనూ గబగబా వెళ్ళి చూశాను. తెల్లగా, సన్నగా , జుట్టు విరబోసుకుని పింక్ చుడిదార్ లో  మెరిసిపోతూ నిలబడుంది ఓ అమ్మాయి.
    "తన్మయి... నా సెక్రెటరీ!" పరిచయంచేశాడు నాకు  నేను  మర్యాదకి నమస్కరించాను.
    ఆ అమ్మాయి నా వైపు ఆశ్చర్యంగా చూడడం  నా దృష్టిని దాటిపోలేదు. బహుశా  నా వైఫ్ కదలలేని అనారోగ్యపరురాలు అనో అనాకారానో బొంకి వుంటాడా? అనిపించింది.
    "తన్మయి ఫాస్ట్ గర్ల్ పనులన్నీ పర్ ఫెక్ట్ గా చేస్తుంది" అంటూ  నవ్వాడు
    ఆ అమ్మాయి కూడా నవ్వింది.
    నాకు మెల్లగా గుండెల్లో మంట మొదలైంది. అతను  ఇందాకా  బాత్  రూమ్ లో  అన్నమాటలు 'హాస్యానికి అన్నవి కాదనమాట. నిజమేనన్న మాట' అనుకోగానే సడెన్ గా  ఏడుపోచ్చేసింది. సేమ్యా పాయసం వగరుగా తోంచింది. నేను  వంటింట్లో గిన్నెలు ఎత్తెత్తి పడేశాను.
    తన్మయీ, వివేక్ ముందుగదిలో పాయసం తింటూ కబుర్లు చెప్పు కుంటున్నారు. నా శబ్దాలు పట్టించుకో లేదు. ఏం చెప్పుకుంటున్నారో విందామని కాసేపు నిలబడ్డాను.
    "ప్చ్...ప్చ్..."
    నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. ఒక్క అంగలో వాళ్ళున్న  చోటుకి వెళ్ళాను.
    వివేక్ ఫోన్ లో  మాట్లాడుతున్నాడు.
    తన్మయి టీ.వీ చూస్తోంది స్టార్ మూవీస్ లో తెరమీద ఘాటైన  ముద్దుదృశ్యం సాగుతోంది.
    వాళ్ళిద్దరూ తలలు తిప్పి ఆత్రంగా పరిగెడ్తూ వచ్చిన నావైపు ఆశ్చర్యంగా చూశారు.
    నేను అనుకున్నది జరగనందుకు నాకు చాలా  సంతోంషంగా అనిపించింది. "కాఫి తాగుతారా?" అని  ఓ  దిక్కుమాలిన ప్రశ్న వేశాను.
    "నాకు  అలవాటు లేదు" అంది తన్మయి.
    'నీకేం అలవాటే? పరాయివాళ్ళ మొగుళ్ళకి గ్రీటింగ్స్ చెప్పడానికి ప్రొద్దుటే సింగారించుకుని రావడమా? లేక  వాళ్ళ భార్యల చేత సేవలు చేయించుకోవడమా?' అని అడగాలనిపించినా ఊరుకున్నాను.
    వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని మెట్లు దిగి వెళ్లిపోతూవుంటే, నా గుండెలమీద నుంచే నడిచి వెళ్ళిపోతున్నట్లుగా తోచింది." ఎవరా పిల్ల?" అన్న  ప్రశ్న వినిపించి తలతిప్పి చూశాను పై నుంచి బొంగరం మావయ్య అదోలా నవ్వుతూ అడుగుతున్నాడు.
    "వాళ్ళ హాస్పిటల్ లో  రిసెప్షనిస్ట్!" అని లోపలికి  వచ్చేస్తుంటే-" వివేక్ ఎంత్తెనా అదృష్టవంతుడు గుడ్ సెలెక్షన్" వ్యంగ్యంగా అన్నాడు.
    నేను గిరుక్కున తిరగి  లోపలికి వచ్చి  తలుపు గడియ పెట్టుకున్నాము.                    

 Previous Page Next Page