బాత్ రూమ్ లోకి పరిగెత్తి, షవర్ తిప్పి తలారా స్నానం చేస్తూ చాలాసేపు నిలబడిపోయాను. కన్నీళ్ళు కూడా నీళ్ళతో కలిసి చెంపలమీద నుండి జారుతూ నా శరీరాన్ని ప్రక్షాళనం చేశాయి!
నేను బయటికి వచ్చేసరికి అతను మంచంమీద మఠం వేసుకుని కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. నన్ను చూసి పెద్దగా నవ్వి-" చూడూ! ఎక్కడో ఏదో ఊళ్ళో నువ్వు సరిగ్గా చూడను కూడా చూడని పెద్దనాన్న పోతే, ఏదో వచ్చినీ ఇంటిమీద వాలిందన్న భ్రమ వదలిపెట్టు! ఇలా వుంటే నీకు కొన్నాళ్ళకి పిచ్చేక్కడం ఖాయం" అన్నాడు.
నాకు నిజంగానే పిచ్చేక్కుంతుంది, 'ఈ మనిషితో వాదిస్తే' అనిపించి మౌనంగా ఊరుకున్నాను.
ఆ మరునాడు కూడా నేను వంట చెయ్యలేదు. అతను టేబుల్ మీద చూసుకుని హోటల్ నుండి క్యారియర్ తెప్పించాడు.
"అనూ... వచ్చి భోంచెయ్యి" అన్నాడు.
నేను మాట్లాడలేదు, జరిగింది చిన్నవిషయం కాదు! నా నమ్మకాలకి, ఆలోచనలకి, ఆచరించాలనుకున్న పనులకి దేనికి అతని దృష్టిలో అసలు విలువన్నదే లేదు. ఆడు అంటే ఆడాలీ.... పాడు అంటే పాడాలీ...ఛీ... వెధవజన్మ!
మా పనిమనిషి కూడా ప్రతిరోజూ మొగుడితో తగవుపడ్తుంది. 'రాత్రయ్యేటాలికి సచ్చినట్లు లొంగు తాడమ్మాపాడు గర్వంగా చెప్పుకుంటుంది. కానీ ఈ మనిషి అక్కడా లొంగడు ప్రతిపనిలో తన ఇష్టమే సాగాలంటాడు. నాది దాంపత్యం కాదు దాస్యం!
"ఇలా కడుపు మాడ్చుకుంటే మంట బయల్దేరి ఎసిడిటీ ఫార్మ్ అవుతుంది. తరువాత అల్సర్ గా మారుతుంది... మూర్ఖంగా ప్రవర్తించకు" అన్నాడు.
బలవంతంగా ఏ పనైనా చేయిస్తాడు కానీ అన్నం తినిపించలేడుకదా! ఇంకో రెండుసార్లు చెప్పి వెళ్ళి పోయాడు. కానీ చాలా చిరాకుపడ్డాడు. తను అనుకున్నది జరగకపోతే అతను భరించలేడు. దారిలో కనిపించినావన్నీ తీసి విసిరేశాడు.
"ఐ హేట్...ఐ హేట్ దిస్ స్టుపిడిటీ!" అని గొణుక్కున్నాడు.
నాకు అతన్ని సాధించగలిగినందుకు చాలా సంతోషం వేసింది. ఇంకో రెండురోజులు అలాగే ఉపవాసాలు చేశాను. కేవలం పాలూ, రెండు అరటి పండ్లూ మాత్రమే తీసుకున్నాను.
ఆ రాత్రి ఒకటే కంచం పెడ్తూవుంటే-" నువ్వు తినవా?" అని తీవ్రంగా అడిగాడు.
"ఉపవాసం....గురువారంకదా" అన్నాను.
"నేను మొండివాడ్ని! వెంటనే ఇవన్నీ మానేయ్యకపోతే, ఏంచేస్తావో నాకే తెలీదు" అన్నాడు.
"ఏంచేస్తారు?" సవాల్ చేస్తున్నట్లుగా అడిగాను.
"చూస్తావా ?" అన్నాడు.
"నా శరీరంమీద మీకున్న హక్కులన్నే చూపిస్తారు. మనసుమీద కాదుగా!" ఉక్రోషంగా అన్నాను.
వివేక్ లేచి వంటింట్లోకి వెళ్ళాడు.
నేనుకూడా వెళ్ళి అతను చేస్తున్న పని చూసి- "వద్దు...వద్దు..." అని అరిచాను.
అప్పటికే అతను దేవుడి పటాలన్నీ కట్టగా కట్టి గుమ్మంవైపు వచ్చాడు.
నేను దారికి అడ్డంగా నిలబడి-
"వద్దు అంటున్నాను నా మాట వినండి... అని మర్యాదగా అక్కడ పెట్టండి" అన్నాను.
అతను నిర్లక్ష్యంగా నన్ను పక్కకి తోసి బయటికి నడిచాడు. నేను ఎంత అరిచినా ప్రయోజనం లేకపోయింది. దేవుళ్ళు లేని పూజామందిరం నా మనసు లాగే బావురుమంటూ శూన్యంగా మిగిలింది.
అతను కాసేపటికి ఖాళీ చేతుల్తో ఇంటికి వచ్చాడు.
నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాలర్ పట్టుకుని-" నా దేవుళ్ళని ఏంచేశావు? రాక్షసుడా? చెప్పు" అని అరిచాను.
"బావిలో పారేశాను" అన్నాడు.
వాకిలి తలుపు తీసేవుంది. నా అరుపులకి మామీ ఇంట్లోవాళ్ళు బయటికి వచ్చి చూడసాగారు.
"లోపలికి నడు" అన్నాడు వివేక్.
"నా దేవుళ్ళని తెచ్చియ్యి" ఏడుస్తూ అరిచాను.
ఇంకో వాటా తలుపు తీసుకుని వాళ్ళుకూడా వచ్చారు. అందరూ తమాషాగా చూస్తున్నారు. అయినా నా కోపం కంట్రోల్ అవలేదు.
"ఎంత పని చేశావు? ఏం చెయ్యలేననేగా ! నీ ప్రాణం తీస్తాను" ఏడుస్తూ అతని మెడ పట్టుకున్నాను.
వివేక్ ఓ చేత్తో విడిపించుకుంటూనే ఇంకో చేత్తో ఈడ్చికొట్టాడు నా చెంపమీద.
"అయ్యో... అదేం పనయ్యా?" బొంగరం మావయ్య మధ్యలోకి రాబోయాడు.
వివేక్ నన్ను బలంగా లోపలికి లాగి చటుక్కున "విద్యా... ఈ గ్రీన్ షాల్ తీసుకెళ్దామా? అసలే చలి ప్రదేశం ఎన్నున్నాసరిపోవేమో!" శ్రీవారు హడావుడిపడ్తూ సామాన్లు సర్దుతుంటే నాకు ముచ్చటేస్తోంది.
స్టేట్స్ లో వున్న పిల్లలు చూసిపోవడానికి రమ్మనమని బలవంతపెట్టడంతో ఈ విదేశీపర్యటన తప్పడంలేదు. మా ఆయన ముఖంలో రైలెక్కేముందు చిన్నపిల్లలు పడే ఉత్సాహం కనిపిస్తోంది.
నాకూ ఒకప్పుడు ప్రయాణాలు చేయటమంటే చాలా సరదాగా వుండేది. ఈ మధ్యన ఓపిక వుండటం లేదు. ఈ మాటే అంటే 'కాస్త తల నెరవగానే ముసలి కబుర్ల చెప్పడం ప్రాక్టీసు చేస్తారు మీ ఆడాళ్ళు' అని ఆయన కస్సుమంటారు.
"విద్యా...విద్యా..." మళ్ళీ బెడ్ రూం లో నుండి హడావుడిగా కేకలు పెట్టారు.
వంటింట్లో బిజీగా కారప్పూస చేస్తున్నాను నేను. అవంటే పాపకి చాలా ఇష్టం! వాళ్ళు అనుభవించే భోగాలు ఇక్కడ లేవు... అలాగే అమ్మ చేతివంట అక్కడ వాళ్ళకి లేదు!
"విద్యా... ఓ సారిలా వస్తావా?" అంటూ మళ్ళీ కేకలు వినిపించాయి.
"రాను! ఇక్కడ పూస మాడిపోతుంది. ఎర్రగా అయిపోతే పాపకిష్టంవుండదు" ఖచ్చితంగా చెప్పాను.
ఆ మాటకి వెంటనే "సరే...సరే... నేనే వస్తా..." అంటూ ఆయన వంటింట్లోకి వచ్చేశారు.
ఆయన్నీ , ఆయన చేతిలోని వస్తువునీ చూడగానే నేను అమంతరం "ఆఁ...!" అంటూ చేతిలోని గరిటె వదిలేసి ముందుకెళ్ళి... ఆయన చేతిలోని గ్రీన్ ఫోల్డర్ తీసేసుకున్నాను.
"ఏముంది అందులో..." ఆయన అడిగారు.
ఆ ప్రశ్న కోటి గొంతులతో నా చెవుల్లో మార్ర్మోగింది. "ఏవుంది... ఏవుంది... ఏవుంది?"
"ఏవుంది?" చాదస్తంగా మళ్ళీ అడిగారు.
ఏవో పాత..." అని నసిగాను.
పారేసుకున్న జ్ఞాపకం
"అబ్బా! అంతా చెత్త జేరుస్తావు... ఛీ! అమ్మి పారెయ్యమంటే వినవు..." ఆయన విసుక్కుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయారు.
"చెత్తా!!" దాన్ని హృదయానికి హత్తుకుంటూ అనుకున్నాను. 'పారేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఎందుకో పారేసుకోలేకపోతున్నాను' స్టోర్ రూం తలుపు తెరిచి ఆటక మీదకి విసిరేశాను.
* * *
ఆ రాత్రి....
ఆయన నిద్రపోతున్నారు.
నాకు ఎందుకో నిద్రపట్టడంలేదు! దూరప్రయాణమని బెంగపడ్తున్నానని ఆయన అనుకున్నారు. కాదు! నేను లేచి తలుపు తీసుకుని బాల్కనీలోకి వచ్చాను వెన్నెల పుప్పొడి జల్లుకున్న పువ్వులు, అందంగా కనిపిస్తున్నాయి.
'ఎక్కడమ్మా చంద్రుడూ... పెరుగునాడూ, తరుగునాడూ ప్రేమ మారని సామి నీవూ... అన్న పాట లీలగా మదిలో మెదుల్తోంది.
విదేశాల్లో ఆరునెలలుంటాను. మళ్ళీ ప్రాణాలతో ఇక్కడకు వచ్చి ఈ పువ్వుల్నీ ... వాకిట్లో ముగ్గుల్నీ చూస్తావా? అనిపించింది ప్రొద్దుట ఆటకమీదకి విసిరేసిన 'జ్ఞాపకం' గుర్తొచ్చింది.
అప్రయత్నంగా స్టోర్ రూంలోకి నడిచి దాన్ని అందుకున్నాను. ఆటకమీద పారేయడం వలన దుమ్మూ, బూజూ అంటుకున్నాయి. శుభ్రంగానా చీర చెరగుతో దాన్ని తుడిచాను.
తెరుస్తుంటే నా హృదయస్పందన వేగం పెరిగి న చెవిదగ్గర ఎవరో టైం బాంబు పెట్టినట్లుగా తోస్తోంది!
తెరిచాను... నీళ్ళల్లో చీర కుచ్చిళ్ళు కాస్త పైకి పట్టుకుని భయంగా నేను... నా నడుం చుట్టూ తన చేతిని వేసి అతనూ! ఫోటో పాతబడటంతో కాస్త ఎర్రబారింది.
వెనక్కి తిప్పి చూస్తే అతని అడ్రెస్... గబుక్కున మళ్ళీ ముందుకి తెప్పేశాను. అలాగే హృదయానికి హత్తుకుని ఆజ్ఞాపకాన్ని మళ్ళీ ఓసారి అనుభవించే ప్రయత్నం చేస్తూ కూర్చున్నాను.
అప్పుడు నాకు ఇరవై మూడేళ్ళు. మా పెద్ద బాబుకి మూడేళ్ళు! స్కూల్లో టీచర్ గా ఉద్యోగం చేస్తుండేదాన్ని. నాతోపాటు పనిచేసే కనక నాకు ప్రాణంగా వుండేది.
వేసవి సెలవుల్లో ఓసారి తనతో బాటు వాళ్ళమ్మ గారి ఊరు విజయవాడ రమ్మనీ, మంగళగిరీ, అమరావతే చూడొచ్చనీ తెగ పోరింది.
బాబుని వదిలి రాలేననీ, తీసుకొస్తే ఆ ఎండల్లో కష్టమనీ నచ్చచెప్పాజూసిన వినలేదు. "అన్నయ గారూ...మూడురోజులు మావదినకి సెలవుమంజూరు చెయ్యరా?" అంటూ మా వారినే అడిగేసింది.
మా ఆయన నవ్వి-
"వెళ్ళిరా విద్యా... బాబుని నేను సెలవుపెట్టి చూస్కుంటాలే" అని వరం ఇచ్చేశారు.
నేను సగం దిగులూ, సగం ఆనందంగా ప్రయాణం అయ్యాను. కనక అల్లరితో ప్రయాణం చాలా సరదాగా జరిగింది, అక్కడ వాళ్ళ పుట్టింటివాళ్ళు కూడా నన్ను చూసి చాలా ఆనందించారు. కనక నా గురించి ప్రతి విషయం వాళ్ళకి తెలియజేసేసిందని నాకు అర్ధం అయిపోయింది.