అమల్ : హల్లో శాస్త్రీ ! ఓల్డ్ బాయ్! ఇవ్వాళ క్లబ్బుకు వెళుతున్నావా?
విమల్ : లేదు. ఇంటికెళ్ళాలి. ఇవ్వాళ మా ఆవిడ తన ఫ్రెండ్స్ కు పార్టీ యిస్తోంది.
కమల్ : హల్లో చౌదరి! ఓల్డ్ బాయ్ ! కారు గరాజ్ నుండి బయటకు తీశావా?
ఇం : ఎందుకడుగుతావు ? క్లచ్ ప్లేట్ కాలిపోయింది. టాక్సీల సంగతి యిక అడగనే అక్కర్లేదు. ప్రొద్దుట మా పనివాడు నలభై అయిదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు.
(రచయిత లోపల పెద్ద ఆఫీసరు దగ్గరవుంటాడు. ఫోన్ వస్తుంది.)
రచ : హల్లో - హల్లో - యస్ - Board of Directors - Conference - Budget - Annual budget - yes - yes - బాయ్ ! మిస్ మల్ హొత్ర....
(మానసి చేతిలో షార్ట్ హ్యండ్ పుస్తకం తీసుకొని వస్తుంది.)
మా : yes sir !
రచ : (పచారు చేస్తూ)
With refence to a bove lettler in connection with the above matter. I would request you - I shall be obliged if - forward us at your earliest convenience - let this office know immediately 15th ultimo - 25th instance - thanking you, assuring you of our best Co- operation - yours sincerely - yours sincerely-
(టెలిఫోన్)
హల్లో - yes -yes - Board of Directors - con - ference -Budget annual report - yes -yes -boy !- that is all Miss Malhotra ! -
(మానసి ప్రస్ధానం - రచయిత బైటకు వస్తాడు.)
దట్ - యీజ్ ఆల్ మిస్ మల్ హొత్రా -దట్ యీజ్ ఆల్ లేడీస్ అండ్ జెంటిల్ మన్. దట్ యీజ్ ఆల్ !
అమల్ : That is all !
విమల్ : That is all !
కమల్ : That is all !
(అందరూ కోరస్ లో దట్ యీజ్ ఆల్ అంటారు. ఇంద్ర మౌనంగా వుంటాడు. ముగ్గురూ ఇంద్రను ఒక్క క్షణం చూసి ఫక్కున నవ్వుతారు.)
అమల్ : బక్ అప్ ఓల్డ్ బాయ్!
విమల్ : చీరియో ఓల్డ్ బాయ్!
కమల్ : ఆల్ ద వెస్ట్ ఓల్డ్ బాయ్!
(ఒక్కొక్కరే ఇంద్ర వీపు తడుతూ ముగ్గురూ వెళ్ళి పోతారు. ఇంద్ర కూర్చునే వుంటారు. రచయిత వెనక్కు వెళ్ళిచీపురు తీసుకొని ఊడవడం మొదలెడతాడు. ఇంద్ర అన్యమనస్కంగా ఫైల్స్ చూస్తాడు.)
రచ : ఏమిటి సర్ !వెతుకుతున్నారు!
ఇం : ఆఁ! అవును వెతుకుతున్నాను.
రచ : ఏమిటి?
ఇం : ఏదో !
రచ : ఏదో ఏమిటి?
ఇం : ఆఁ కాదు....ఏమీలేదు....ఏమిలేదు....ఇంతకంటే ఏమిలేదు.
రచ : మీరు వెదుకుతున్న దేంటో నాకర్ధంకాలేదు. సార్!
ఇం : ఏదీ దొరకడంలేదు హరీష్ ! సరే పోనియ్ ! రేపు ఉదయం ఈఫైల్ అమల్ బాబు టేబుల్ మీద పెట్టు. ఇది విమల్ బాబుకు, అది కమల్ బాబుకు యివ్వాలి. ఈ ఫైల్లో పెద్దయ్యగారి సంతకం తీసుకో. నేను రేపు రాలేకపోవచ్చును.
రచ : మీ ఆరోగ్యం బాగాలేదాసర్ !
ఇం : ఆరోగ్యమా ? రేపు బాగుండకుండా పోవచ్చు. సరే నేను వెళ్తున్నా !
(ఇంద్ర వెళ్ళిపోతాడు.)
రచ : అమల్ వెళ్ళాడు. విమల్ వెళ్ళాడు. కమల్ కూడా వెళ్ళిపోయాడు. ఇంద్రజిత్ మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అతనూ వెళ్ళిపోయాడు.
నేను కూర్చొని ఆలోచిస్తున్నాను....నేను....
నేను ఆలోచిస్తున్నాను.
కేవలం ఆలోచిస్తున్నాను.
నేను పిట్టకథలోని భాగాన్ని.
నా జీవితం అనంత శూన్యం
లో విలీనం అవుతుంది.
(అంతలోనే అర్ధచైతన్యంలో మధుర ప్రతిధ్వనితో తిరిగివస్తోంది.)
పృధ్వీకణాలు చూర్ణమై
మట్టిలో కలుస్తున్నాయ్.
కాలం అనే చేత
దాన్ని నిరంతరం చెరుగుతోంది.
గట్టి పదార్ధాన్ని వెతుకుతోంది.
ఈ ధూళి కణాల్లో
జీవితబీజం నిక్షిప్తమైవుందా?
ఇదంతా వ్యర్ధ ప్రేలాపన
భవిష్యత్తులోని బీజాలను
పేర్చి నవ సృష్టి సాగించాలని
పెరుగుతోంది కోర్కెనాలో
(ఈ మట్టి చాలా పురాతనం శూన్యం ఆకాశం - కల్పనవ్యర్ధం నవసృష్టి స్వప్నం - వ్యర్ధం)
నేను కూర్చొని ఆలోచిస్తున్నాను.
ఆలోచిస్తూనే వున్నాను.
మానవుడు అపూర్ణుడు.
అయినా ఎందుకో మనస్సు
వెతుకుతూనే వుంటుంది.
సంపూర్ణ మానవుడికోసం.
(పిన్ని ప్రవేశిస్తుంది)
పిన్ని : నువ్విక్కడ కూర్చున్నావా? నీకోసం వెతికి వెతికి ప్రాణం విసిగిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నావ్?
రచ : ఆలోచిస్తున్నాను.
పిన్ని : అంత పెద్ద ఆలోచనేమిటో చెప్పు, నాకూ వినాలని వుంది.
రచ : మేము ఎవరం అని ఆలోచిస్తున్నాను.
పిన్ని : మీరు మీరే ! ఇందులో ఆలోచించడానికికేముంది?
రచ : నిజమే! ఇంతవరకు ఆ విషయం నాకు తట్టనే లేదు. కానీ మేము ఏమిటి?
పిన్ని : ఏం ప్రశ్నరా నాయనా ! మేము ఏమిటి ? మీరు రత్నపు తునకల్లాంటి కుర్రాళ్లు. బాగా చదువు కున్నారు. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
రచ : సరిగ్గా చెప్పావు పిన్నీ! రత్నపుతునక : తునకలం అనేది నేనూ ఒప్పుకుంటాను. కానీ రత్నపు తునకలం అనేది నా బుర్రకు ఎక్కడం లేదు.
పిన్ని : ఏమిటిరా నీ ఆలోచనలూ నువ్వూను.
రచ : ఆలోచనలు !నిజం ! కాని నువ్వు టకటకా నా రెండు ప్రశ్నలకు జవాబులిచ్చావు. మరో ప్రశ్నకుకూడా...
పిన్ని : ఏమిటాప్రశ్న ?
రచ : మేం ఎందుకున్నాం ?