Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 11


                                             ద్వితీయాంకం

    (ఒక ప్రక్కగా ఒక టేబుల్, నాలుగు కుర్చీలు ఉంటాయ్. ఒక ఖాళీబల్ల. దానివెనక పెద్దటేబుల్ - కుర్చీ - టెలిఫోన్ -రచయిత టేబుల్, కుర్చీలు తుడుస్తూ వుంటాడు. అతని ముఖంలోగాని, వస్త్రధారణలోగాని ఎలాంటి మార్పులేదు.)
    రచ : ఇంటినుండి స్కూలుకు, స్కూలునుండి కాలేజీకి- కాలేజీనుండి ప్రపంచంలోకి - ప్రపంచం ఒక ఆఫీసు - ఇలాంటిదే అదీ ఒక ఆపీసు. ఇక్కడ చాలామంది పనులు చేస్తారు. పెద్దపెద్దపనులు - ముఖ్యమైన పనులు. ఇక్కడ చాలామంది పని చేస్తున్నారు.
    అమల్, విమల్, కమల్, ఇంద్రజిత్.
    (అమల్, విమల్ ప్రవేశిస్తారు.)
    అమల్ : ఎనిమిదీ యాభైకు రావాల్సిన రైలు పదినిమిషాలు ఆలస్యంగా వచ్చింది యీరోజు.
    విమల్ :  చార్ మినార్ దగ్గర బస్ ఆగిపోవటం వల్ల ట్రాఫిక్  జామ్ అయింది.
    (కమల్, ఇంద్రజిత్ ప్రవేశం. అమల్, విమల్ కూర్చుంటారు)
    కమల్ : తోమ్మిదింబావు బండి ఇవ్వాళకూడా అందలేదు.
    ఇం : రెండు బస్సులు వెళ్ళిపోయాయి. కాలుపెట్టడానికి కూడా స్ధలం దొరకలేదు.
    (కమల్ - ఇంద్ర కూర్చుంటారు.)
    అమల్ : (విమల్ తో) పిల్లవాడు ఎలావున్నాడు?
    విమల్ : బాగానే వున్నాడు. (కమల్ తో) మీ అమ్మాయికి సీటు దొరికిందా?
    కమల్ : ఇంకాలేదు. (ఇంద్రతో) నీకు దొరికిందా ?
    ఇం : లేదు. ఎవరో కొట్టేశారు.
    అమల్ : హరీష్ !
    విమల్ : హరీష్ !
    ఇం : హరీష్  !
    అమల్ : (పెద్దగా ) హరీష్  !
    రచ : అయ్యా ! చెప్పండి.
    అమల్ : మంచినీళ్ళు.
    విమల్ : (పెద్దగా) హరీష్ !
    రచ అయ్యా!
    విమల్ : బీడా తీసుకురా -కొంచెం జర్దా కూడా.
    కమల్ : (గట్టిగా)  హరీష్ !
    రచ : అయ్యా!
    కమల్ : రెండు సిగరెట్లు - కత్తెర మార్కు.
    ఇం : (గట్టిగా) హరీష్ !
    రచ : అయ్యా !
    ఇం : ఈ ఉత్తరం పోస్ట్ చెయ్!
    [రచయిత తన స్ధానంనుండి కదలడు. వాళ్ళలో ఎవరూ అతనికి డబ్బులు కానీ, ఉత్తరంకానీ యివ్వరు.]
    అమల్ : ఈ పిక్ పాకెట్ గాళ్ళ పీడ మరీ ఎక్కువైపోయింది. ఆ రోజు యూనివర్శిటీ బస్ కోఠీ స్టాప్ దాటిందో లేదో ....
    విమల్ : హొమియోపతి మందు తినాలంటే వెంకటాచారి దగ్గరకే వెళ్ళు. మా బావమరిదికి క్రానిక్ డీసెంట్రీ వచ్చింది....
    కమల్ :  మూడోక్లాసు సీటుకు పెద్ద టెస్టు ఒకటి. ఇంగ్లీషు, తెలుగు, లెఖ్కలు -పైగా బర్త్ సర్టిఫికెట్ లేకుండా... ...
    [ఒక్కసారి రచయిత గంభీరంగా పెద్ద టేబుల్ దగ్గర కెళతాడు. అమల్ , విమల్ , కమల్ , ఇంద్ర  కొంచెం లేచి తల గోక్కుంటూ కూర్చుంటారు రచయిత కుర్చీమీద కూర్చోగానే గంట మ్రోగుతుంది.]
    రచ : హల్లో ! హల్లో....యస్ ... యస్... ఆర్డర్ ... చలాన్ ... డెలివరీ ... ఫిఫ్టీన్ పర్సెంట్...యస్ ...బాయ్ ...(ఇక్కడనుంచి ఫైల్స్ తీసుకెళుతుంటారు. పైల్సు తెచ్చి పెడుతుంటారు. అమల్  వచ్చి ఒక పైలు మీద ఆర్డర్స్ వేయించుకొని వెళతాడు. కమల్ , విమల్, ఇంద్ర ఒకరి తర్వాత ఒకరు  పైల్స్  తీసుకెడుతుంటారు.)
    రచ : హల్లో.... హల్లో... యస్ ... యస్ ... ఆర్డర్ ... చలాన్ ...డెలివరీ... ఫీప్టీన్ పర్సంట్ ...యస్ ... యస్ ... బాయ్...
    (మళ్ళీ పైల్స్ అటూ యిటూ)
    అమల్ : హరీష్ !
    విమల్ : హరీష్ !
    కమల్ : హరీష్ !
    ఇం : హరీష్ !
    (రచయిత లోపలనుంచి చేతిలో పంఖాతో వచ్చి స్టూలుమీద కూర్చుంటాడు.)
    అమల్ : హరీష్ !
    విమల్ : హరీష్ !
    కమల్ : హరీష్ !
    ఇం : హరీష్ !
    (రచయిత లేచి  ఒక్కొక్కరి దగ్గరకు వెళతాడు.)
    రచ : అయ్యా ! అయ్యా ! అయ్యా ! అయ్యా!
    అమల్ : విమల్ బాబు!
    (రచయిత అమల్ పైలు విమలకు యిస్తాడు. విమల్ దాన్ని అందుకొని మరొక పైలు అందిస్తాడు.)
    విమల్ : కమల్ బాబు!
    (రచయిత  విమల్  పైల్ కమల్ కు  యిస్తాడు.)
    కమల్ : నిర్మల్ బాబు !
    రచ : నిర్మల్ బాబు రిటైర్ అయిపోయారు సర్ !
    కమల్ : ఓ ... ఇంద్రజిత్ బాబు!
    (రచయిత కమల్  పైల్ ఇంద్రజిత్ కు  యిస్తాడు.)
    ఇం : అమల్ బాబూ !
    అమల్ : విమల్ బాబూ !
    విమల్ : కమల్ బాబూ !
    కమల్ : ఇంద్రజిత్ బాబూ !
    [ఈ విధంగా మూడుసార్లు పిలుస్తారు. ప్రతిసారి కంఠాళ స్ధాయి పెరుగుతుంది. రచయిత ఆసులో గొట్టంళా అటూ ఇటూ తిరుగుతాడు. గంట మ్రోగుతుంది. రచయిత లోపలకు వెళ్ళి ఆఫీసరు ఆదేశాన్ని అందుకొని వస్తాడు.]
    అమల్ : హరీష్ !
    విమల్ : హరీష్ !
    కమల్ : హరీష్ !
    ఇం : హరీష్ !
    రచ : పెద్దయ్యగారికి టీ తేవడానికి వెళుతున్నా సర్ !
    అమల్ : ఆఁ
    విమల్ : ఆఁ.
    కమల్ : ఆఁ.
    ఇం : ఆఁ.
    [రచయిత టీకి వెళ్ళటానికి బదులు తిరిగొచ్చి ఎదురుగా నిల్చుంటాడు.]
    రచ : పైల్ ... టీ ... మళ్ళీ పైల్ ... టిఫిన్ ... మళ్ళీ పైల్ ... మళ్ళీ టీ ... మళ్ళీ పైల్ ... ఆ తర్వాత  ట్రాం, బస్, ట్రైన్... ఇంతకంటేపెద్ద  ఆఫీసుల్లో కూడా యిదే ...పైల్ , టీ, టిఫిన్ ...ఆ తర్వాత  హిందూస్దాన్... ఫియట్ ....స్టాండర్డ్....  

 Previous Page Next Page