Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 13


    పిన్ని : ఎందుకుండటమేమిటి?
    రచ :  అంటే....అదే మేం ఎందుకు ఉండాలి అని?
    పిన్ని : ఆహ ! ఏం ప్రశ్న ? ఎందుకు ఉండకూడదు ? మీ రున్నందువల్ల ఎవరికీ ఏం బాధ వచ్చింది? కాస్త వివరంగా చెప్పు వింటాను.
    రచ : ఊఁహు ! ఈ  జవాబు లాజికల్  గా లేదు.
    పిన్ని : లాజిక్ మాట్లట్టానికి ఎవరూ యిక్కడలేరు. నీ మాటలన్నీ  చిత్రంగానే వుంటున్నాయి. అందుకే పెళ్ళి చేసుకోమంటున్నాను.
    రచ : మధ్య పెళ్ళివిషయం ఎందుకు?
    పిన్ని : పెళ్ళివిషయం అక్కర్లేదు. ఏమిటీ, ఎవరూ, ఎందుకూ అనేవి కావాలి. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోనంటున్నావో ముందు చెప్పు.
    రచ : చాలా కఠినమైనప్రశ్న వేశావు పిన్నీ ! పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ? ఆలోచించి నాకు  మతిపోతోంది.
    పిన్ని : పెళ్ళెందుకేమిటి ? అందరూ ఎందుకు చేసుకుంటున్నారు- అందుకే!
    రచ : దొరికింది! ప్రశ్నకు సమాధానం దొరికింది.
    ఎందుకు తుమ్ముతావ్ ?ఎందుకు దగ్గుతావ్?
    తియ్యతియ్యగా ఎందుకు మందహాసం చేస్తావ్?
    ఎదుటివాడు ఆవలిస్తే ఎందుకు చిటిక వేస్తావ్?
    అందరూ చేస్తారు కనుక నువ్వూ చేస్తావ్?
    పిన్ని : కవిత్వం ప్రారంభించావ్ ? నేను వెళ్తున్నా!
    [రచయిత ఆమె దారికి అడ్డం వస్తాడు.]
    రచ : కవిత్వం పేరువిని పారిపోతున్నావ్ ఎందుకూ?
    పెద్దగా రేడియో పెట్టి వదివేస్తావ్ ఎందుకూ?
    పప్పులో వేస్తావెందుకు గుప్పెడు కారం?
    అందరూ చేస్తున్నారు కనుక నువ్వూ చేస్తున్నావ్!
    పిన్ని : పప్పులో గుప్పెడుకారం  నేనెప్పుడు వేశాను?
    రచ : టైం చూసి పరుగెత్తుతావెందుకు కత్తితో?
    రాట్నంలో నూనె వేస్తావెందుకు?
    అందరూ చేస్తారు, అందుకే నువ్వూ చేస్తావ్!
    పిన్ని : ఏమిట్రా పిచ్చిమాటలూ నువ్వూ ? ఆ  మూడు ముళ్ళు పడితే పిచ్చి కాస్తా  రెండు రోజుల్లో ఎగిరిపోతుంది.
    (పిన్ని వెళ్ళిపోతుంది)
    రచ : వివాహం, జన్మ-వివాహం మృత్యువు - జన్మ-తర్వాత వివాహం- ఆ తర్వాత మృత్యువు. చాలాకాలం క్రితం నేను ఒక మంచి కథ చదివాను. మీలో ఎంతమంది ఆ కథ చదివారో నాకుతెలియదు. చాలావరకు, కథ మర్చిపోయాను. అయినా ... ఒక రాజకుమారుడు. ఒక రాజకుమారై, ఎన్నో కష్టాల తర్వాత ....ఆ తర్వాతే  అసలుకథ ప్రారంభం....ఇద్దరూ సుఖంగా సంసారం చేశారు...రాజ్యం చేశారు సుఖంగా వున్నారు కనుక ఆ పైన కథ రాయటానికి అవకాశం లేకుండా పోయింది....
    (నేపధ్యంలో శంఖా రావం. మానసి  పెళ్ళికూతురు వేషంలో స్టేజీ మధ్యకువచ్చి నిలబడుతుంది.)
    రచ : వివాహం. ఒక  పురుషుడు ... ఒక స్త్రీ ... దంపతి- జంపతి - జయాపతి....తిన్నగా చెప్పాలంటే పెళ్ళి కూతురు - పెళ్ళికొడుకు.
    (అమల్ ప్రవేశిస్తాడు. కొత్తపెళ్ళికొడుక్కు ఉండాల్సిన సంతోషం కన్పిస్తుంది.)
    అమల్ : వక్కపొడి యివ్వు!
    మా : గూట్లోవుంది తీసుకోండి!
    అమల్ : ఎక్కడుందో నాకు తెలియదు.
    మా : తెలియదూ? ఇంతకాలంగా ఎవరు యిచ్చారో?
    అమల్ : ఇంతకాలం 'నా' అనేవాళ్ళు నాకెవరున్నారు గనుక?
    మా : ఊరుకుందురూ, ఎవరైనా వింటారు.
    అమల్ : వింటారా? అయితే చెవులో రహస్యంగా చెప్పనా?
    మా : అబ్బ ఊరుకోండీ! ఎవరైనా వస్తారు. మీరు బయటకు వెళ్ళిపోదురూ!
    (అమల్ నిష్ర్కమణ)
    రచ : దంపతి - జంపతి - జయాపతి అంటే  భార్యా, భర్త.
    (మానసి తలమీద ముసుగు జారిపోతుంది. పెళ్ళి కూతురిలా కన్పించదు. గృహిణిలా కన్పిస్తుంది. విమల్ చేత్తో పత్రిక పట్టుకొని ప్రవేశిస్తాడు. కుర్చీలో కూర్చొని చదవడం ప్రారంభిస్తాడు. మానసి దగ్గరకు వస్తుంది.)
    మా : ముఖ్యమైన వార్తలు వున్నాయా?
    విమల్ : ఏం లేవు. మామూలే !
    మా : అహాఁ ! నేను  ప్రపంచం మునిగిపోయే  వార్త ఏదో వుందనుకున్నానులే!
    విమల్ : ఎందుకలా అనుకున్నావ్ ?
    మా : తలన్నా ఎత్తకుండా ఆ చదివేతీరు చూసి  అనుకున్నాను.
    విమల్ : అబ్బే ! అదేం లేదు. (పత్రికపడేసి) ఆఁ ఏమిటి అంటున్నావ్ ?
    మా : సాయంకాలం మీకేదైనా పనుందా ?
    విమల్ : ఎందుకు?
    మా : ఏంలేదు. సాయంకాలం కులాసాగా అలా బైటకు వెళ్దామని.
    విమల్ : ఇవ్వాళ మా ఆఫీసులో ఒకాయన తిటైర్ అవుతున్నాడు. ఆయనకు పార్టీ యిస్తున్నాం- నువ్వెక్కడి కెళ్ళాలని.
    మా : ఎక్కడికీ లేదు....గడ్డంగీచుకోరూ? ... అప్పుడే తోమ్మిదయింది. 
    విమల్ : తొమ్మిదా ? ఓ మైగాడ్!
    (విమల్ వెళ్ళిపోతాడు.)
    రచ : దంపతి - జంపతి- జయాపతి-అంటే మొగుడూ - పెళ్ళాం.
    (కమల్ ప్రవేశిస్తాడు)
    మా : మీకు అసలు మతివుందా అంట? పిల్లవాడి జ్వరం సంగతి తెలిసీ రాత్రి పదిగంటలకు కోపంకు చేరతారా?
    కమల్ : బార్లీ తెచ్చాను. ఇంద!
    మా : తెచ్చారు బార్లీ ! రాత్రి పదిగంటలకు, ఇంట్లో బార్లీ అయిపోందని తెలుసు. బిడ్డకు ఏం యిస్తాననుకున్నారు?
    కమల్ : పూర్తిగా అయిపోయిందా?
    మా : అడుగూ బోడుగూవుంటే జావా కాశాను.
    కమల్ : బాబు  ఎలా వున్నాడు?
    మా : జ్వరం తొంభైతొమ్మిదివుంది. బత్తాయ్ కాయలు తెచ్చారా?
    కమల్ : రోజూ తెచ్చే చోట రూపాయికి నాలుగు చెప్పారు. రేపు పెద్ద మార్కెట్ కు వెళ్ళి తెస్తాలే!
    మా : కాళ్ళూ, చేతులూ కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను.
    (ఇద్దరూ చెరోవైపూ నిష్ర్కమిస్తారు.)
    రచ : దంపతి - జంపతి - జయాపతి. భార్యాభర్త - మొగుడూ పెళ్ళాం -అమల్ , విమల్ , కమల్, ఏవం ఇంద్రజిత్ .
    (ఇంద్రజిత్ ప్రవేశం)
    రచ : ఇంద్రజిత్తా?      

 Previous Page Next Page