అతడు తృళ్ళిపడి కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. కళ్ళు నులుపుకొని నరేంద్రకేసి ప్రశ్నార్థకంగా చూశాడు.
"ఏం కావాలి? రూమ్స్ ఖాళీలేవు." అన్నాడు విసుగ్గా.
"రూంనంబర్ 13లో ఎవరున్నారు?"
"స్వామి..... రామానందస్వామి. ఫస్ట్ ప్టోర్" అన్నాడు.
నరేంద్ర లిప్ట్ కేసి నడిచాడు.
లిప్ట్ బాయ్ నిద్ర ముఖంతోనే లిప్ట్ డోర్స్ తెరిచాడు.
నరేంద్ర లిప్ట్ లో నిల్చుని "ఫస్ట్ ప్లోర్" అన్నాడు.
ఫస్ట్ ప్లోర్ లో లిప్టు ఆగింది.
తలుపులు తెరుచుకొన్నాయి. నరేంద్ర బయటికి వచ్చాడు. లిప్ట్ కిందకు పాయింది.
తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు నంబర్లు చూస్తూ పద మూడవ నంబరు గది ముందు ఆగాడు నరేంద్ర.
గది తలుపు చిన్నగా తట్టాడు. లోపలనుంచి ఎలాంటి అలికిడి విన్పించలేదు.
కొద్ది క్షణాలు ఆగి గట్టిగా తలుపు తట్టాడు. రెండు మూడు సార్లు తట్టినా ఎవరూ వచ్చి తలుపు తెరవలేదు.
బెల్ మోగించాడు.
అయినా రెస్సాన్స్ లేదు.
నరేంద్రకు ఏదో అనుమానం కలిగింది.
కర్చీపుతో డోర్ నాబ్ పట్టుకొని తలుపు నెట్టాడు.కిర్రున శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది.
గదంతా చీకటి అలుముకొని ఉంది.
కొద్దిసేపు ఏమీ కన్పించలేదు. వాకిట్లోనే నిలబడి పోయాడు.
క్రమంగా అతడి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. చిన్నగా గదిలో ప్రవేశించాడు.
అప్రయత్నంగానే అతడి చెయ్యి ముక్కు మీదకు పోయింది. అలాంటి వానన నరేంద్రకు కొత్తకాదు.
తలుపు దగ్గరగా వేసి స్విచ్ ఆం చేశాడు. ఒక్కసారిగా వెలుగు గదిలో పరచుకొంది నరేంద్ర ఆతృతగా మంచం కేసి చూశాడు.
ఒకవ్యక్తి మంచం మీద చలన రహితంగా పడి ఉన్నాడు. అతడి కళ్ళూ నితులూ ఎడం ఎడంగా బిగిసిపోయి కట్టేల్లా పడిఉన్నాయి.
కుడి వైపు పక్క బట్టలన్నీ రక్తంతో తడిసి ఎర్రగా ఉన్నాయి. అతడి కుడివైపు డొక్కలో కత్తిపిడి నల్లగా కన్పిస్తోంది.
నరేంద్ర మంచం దగ్గరకెళ్ళి శవాన్ని పరీక్షగా చూశాడు. తర్వాత గదంతా పరిశీలించి చూశాడు.
గదిలోని వస్తువులన్నీ చెల్లా చ్దరుగా పడి ఉన్నాయి.
సూట్ కేసు, హాండ్ బ్యాగూ, హొల్దాలు గది మధ్యలో అడ్డదిడ్డంగా పడి వున్నాయి. వాటిలో వస్తువులన్నీ చల్లా చెదురుగా ఉన్నాయి. హంతకుడు దేనికోసమో గాలించినట్టు అర్థం అయింది. ఈ హత్య కూడా ఆ వస్తువుకోసమే జరిగిందని నరేంద్ర భావించాడు. ఈ హత్య వక్తి మీద పగతో జరిగింది కాదనిపించింది.
నరేంద్ర గది నలుమూలలా వెదకసాగాడు.
శవం తలవైపుకు ఉన్న గోడ పక్కగా ఒక పుస్తకం పడిఉంది. కర్చీపు దానిమీదవేసి తీసి చూశాడు. భగవద్ గీత. హంతకుడి దృష్టి దాని మీద పడినట్టు లేదు. అది పదిలంగా ఉంది. అంతవరకూ వెళ్ళి చూడాల్సిన అవసరం హంతుకుడికి లేకపోయి ఉండొచ్చు. అతడికి కావాల్సింది సూట్ కేసులోనో, బ్యాగ్ లోనో, హొల్దార్ లోనో దొరికి ఉండొచ్చు.
ఆలోచిస్తూ నరేంద్ర పుస్తకం తెరిచి పేజీలు తిప్పి చూశాడు.పేజీల మధ్య ఒక ఉత్తరం బయటపడింది జాగ్రత్తగా ఉత్తరం చేతిలోకి తీసుకొని పుస్తకం యథాస్ధానంలో పెట్టాడు ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. శవం కేసి చూశాడు.
స్వామి అంటే కాషాయి వస్త్రాలలో ఉంటాడని భావించాడు నరేంద్ర.
కాని తెల్లటి షర్టు గళ్ళ లుంగీలో ఉన్నాడు. రామానందస్వామి ఉరఫ్ రామకృష్ణ.
జేబులో పెట్టుకున్న ఉత్తరం తీసి అడ్రసు చూశాడు.
"సి అనసూయ. అనసూయా ఆటోమొబయల్స్, హైదరాబాద్ 16" అని ఉంది.
రామకృష్ణ ఉత్తరం రాసి తెల్లవారి పోస్టు చెయ్యవచ్చునని పుస్తకంలో పెట్టుకొని ఉంటాడు.
నరేంద్ర ఉత్తరం జేబులో పెట్టుకొని మరోసారి గదంతా కలయజూశాడు, హంతకుడు చాలాతెలివైనవాడు. ఎక్కడా క్లూ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు.
నరేంద్ర డోర్ నాబ్ కర్చీప్ తో పట్టుకొని చప్పుడు కాకుండా డోర్ వేసి వరండాలోకి వచ్చాడు. లిప్ట్ కేసి రెండడుగులు వేసి ఆగాడు. గిర్రున వెనక్కి తిరిగి మెట్లమీద నుంచి కిందకు దిగాడు.
లిప్టుబాయికి, కౌంటర్లోని యువకుడికీ కన్పించకుండా పక్క దారిన బయటికి వచ్చాడు.
నరేంద్ర మారుతి స్టార్ట్ చేశాడు.
శరవేగంతో కారు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ దాటి వంజాగుట్టకు వచ్చింది. లేక్ వ్యూ గెస్టు హొస్, గ్రీన్ లాండ్స్ దాటి కారు బేగంపేట బ్రిడ్జి ఎక్కింది. మరో ఐదు నిముషాల్లో కారు "పంచవటి" చేరింది. కారు శబ్దం విని విజయ్ గబగబా బయటికి వచ్చాడు. గేటు తెరుచాడు. కారు పోర్టికోలో ఆపి ఆలసటగా నరేంద్ర దిగి లోపల వెళ్ళాడు.
నరేంద్ర హాలులోప్రవేశించగానే అనసూయా, సూర్యనారాయణా ఆతృతగా లేచి నిలబడారు. కూర్చోమని వాళ్ళకు సైగ చేసి నరేంద్ర గదిలోకి వెళ్ళీ తలుపులు చేసుకొని ఫోన్ డయల్ చేశాడు.
మౌత్ పీస్ మీద కర్చీపు వేసి, గొంతు మార్చి "హల్లో" అన్నాడు
అవతలనుంచి "యస్ క్రైం బ్రాంచ్" ఇన్ స్పెక్టర్ అద్వయితం కంఠం బొంగురుగా అరిచింది.
"జూబ్లీహిల్స్ ప్యాలెస్ హొటల్లో హత్య జరిగింది."
"హత్యా?" అవతల కంఠం కరుగ్గా విన్పించింది.
"అవును! హత్యే! హత్య కాకపోతే ఈ రాత్రిపూట నీకెందుకు ఫోన్ చేస్తానూ?"
"ఏయ్! ఎవరు నువ్వు?"
"న్నెఉ ఎవరయితే నీకేం. త్వరగా వెళ్ళి శవం తెచ్చుకో?"
"ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావ్?" ఇన్ స్పెక్టర్ గొంతు గరగరలాడింది.
నరేంద్ర ఫోన్ టక్కున పెట్టేశాడు. ఇన్ స్పెక్టర్ అద్వయితం పరిస్థితిని తల్చుకొని ముసిముసిగా నవ్వుకొన్నాడు.
నరేంద్ర హాల్లోకి వచ్చాడు. విజయ్ కూడా గ్యారేజీలో కారు పెట్టి లోపలకు వచ్చాడు.
"ఏమన్నారండీ?" అనసూయ ఆదుర్దగా అడిగింది.
నరేంద్ర అనసూయ ముఖంలోకి కొద్దిక్షణాలు సూటిగాచూశాడు.
"ఏమన్నాడండీ?" సూర్యనారాయణ ప్రశ్నించాడు.
"ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చును" అన్నాడు నరేంద్ర.
"అంటే?" సూర్యనారాయణ ఆతృతగా అడిగాడు.
"అంటే! అదే! ఇకమీరు రామకృష్ణ భయపడనక్కర్లేదు.
"మీరు చెప్పిందానికి అంగీకరించారా?" అనసూయ ఉత్సాహంగా అడిగింది.
"లేదు. నాకు ఆ అవకాశం దొరకలేదు"
అనసూయ నీరు కారిపోయింది. సూర్యనారాయణ నరేంద్ర ముఖంలోకి చూస్తు ఉండిపోయాడు.
"నేను అనుకొన్నటే ఆలస్యం జరిగిపోయింది.
"అంటే అతడు వెళ్ళిపోయాడా?" అనసూయ అడిగింది.
"ఆ! వెళ్ళిపోయాడు"
"మళ్ళీ రాడని నమ్మకం ఏమిటి? బహుశా హొటల్ మార్చాడేమో?" అన్నాడు సూర్యనారాయణ.
నరేంద్ర సూర్యనారాయణకళ్ళల్లోకి తీవ్రంగా చూశాడు. ఆ చూపులకు తట్టుకోలేనట్టుగా సూర్యనారాయణ చూపులు వాలిపోయాయి.
"మళ్ళీరాడు. రాలేడు అన్నాడు నరేంద్ర.
"అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు?" విసుగ్గా అడిగింది అనసూయ.
"అతడు గది ఖాళీ చేసి వెళ్ళలేదు. శవంగా మంచం మీద పడి ఉన్నాడు. అతడ్ని ఎవరో హత్య చేశారు."
ఆ వింటూనే అనసూయ కెవ్వున కేక వేసింది.
సూర్యం అనసూయను పట్టుకొన్నాడు.
భోరుభోరున ఏడుస్తున్న అనసూయను ఓదార్చు ప్రయత్నిస్తున్నాడు సూర్యం.
"ఎందుకండీ ఏడుస్తారు? మీకు కావాల్సింది అదేగా?" అన్నాడు విజయ్ తీవ్రకంఠంతో.
అనసూయ దుఃఖం గొంతులోణే ఆగిపోయింది. చివ్వున తలెత్తి" విజయ్ ను చూసింది.
"ఏమిటి మీరంటున్నది? ఆయన చనిపోవాలని నేను కోరుకోలేదే?" వెక్కిళ్ళ మధ్య అన్నది అనసూయా.
"అసలు మీరే ఆ హత్య చేశారేమో?"
"డిటెక్టివ్ గారూ?" ఇద్దరూ ఒకేసారి అరిచారు.
"విజయ్ తొందరపడకు" మందలించాడు నరేంద్ర.
"ఇక మీరు వెళ్లొచ్చు. మీ ప్రమాదం తప్పిపోయింది. మీ ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదు" అన్నాడు నరేంద్ర.
"థ్యాంక్స్!" సూర్యం అనసూయ భుజం పట్టుకుని నడిపించసాగాడు.
"సూర్యనారాయణగారూ! మా పీజు గురించి మర్చిపోయినట్టున్నారు?" అన్నాడు విజయ్ వెనక నుంచి.
వెళ్తున్న వాళ్ళు ఆగారు.
"లేదు. త్వరలోనే ఇచ్చుకుంటాం." అన్నది అనసూయ.
"ఓ.కే గుడ్ నైట్!" అన్నాడు నరేంద్ర ఆమె కళ్లలోకి చూస్తు.
"గుడ్ నైట్ సార్!" అని అనసూయ భర్త వెనకే వెళ్ళింది.
నరేంద్ర సిగరెట్ వెలుగించుకొని, సీరియస్ గా ఆలోచనల్లోకి జారిపోయాడు.
విజయ్ చేజిక్కిన హంతుకుల్ని వదిలిచేసినందుకు నరేంద్ర మీద చిరగ్గా ఉంది-
ఇరవై నాలుగ్గంటల్లో హిల్స్ లో గుట్టల మధ్య రాధారాణిహత్య.
ఈ రాత్రి ఆమె ప్రియుడు రామనందస్వామి హత్య!
ఈ రెండు హత్యలకూ వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి?
ఈ ఇద్దరికీ రామకృష్ణ హత్యతో సంబంధం ఉంటే ఉండవచ్చు. కాని రాధారాణి హత్యతో వీళ్ళకు సంబంధం ఎందుకుంటుంది?