Previous Page Next Page 
చిలకలు పేజి 12


    "ఈ రాస్కెల్స్ రామకృష్ణను హత్యచేశారు." విజయ్ దాదాపు అరిచినట్టే కోపంగా అన్నాడు,
    నరేంద్ర ఆలోచనం దారం పటుక్కున తెగింది. చివ్వున  తల తిప్పి విజయ్  కేసి చూశాడు.
    "వాళ్ళే ఈ హత్య చేశారనేందుకు రుజువు?" అడిగాడు  నరేంద్ర పూర్తిగా తన ఆలోచనల మంచి బయట పడకుండానే.
    "అంతకంటే రామకృష్ణకు హత్య చెయ్యాల్సిన అవసరం ఇంకె పరికుంది? రాస్కెల్సు హహ్త్య చేసి డిటెక్టివ్ దగ్గరకే వచ్చారు. ఎలిబీ కోసం వచ్చాదు,"
    "కావచ్చు. కాకపోనూవచ్చు."
    "చేజిక్కిన హంతకల్నివదిలేశావ్. వెంటనే అద్వయితానికి కేసు అప్పగించాల్సింది.
    "రుజువు లేకుండా అనుమానంతో అరెస్టు చెయ్యడంవల్ల లాభంలేదు హంతకుడిని వదిలేసి అనుమానం లేనట్టునటించడం మనకే లాభం."
    "ఎలా?"
    "హంతకుడు తను చేసిన పనికి భయపడ్తూనే ఉంటాడు ఆ హత్య తనమీదకు రాకుండా ఉండేందుకు ఏవేవో  ప్రయత్నాలు  చేయకుండా ఉండడు. వాడ్ని ఒక కంటకనిపెడ్తూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు అరెస్టు చెయ్యాలి" అన్నాడు నరేంద్ర.
    ఫోన్ గణగణ మోగసాగింది.
    విజయ్ వెళ్లరిసీవర్ ఎత్తాడు.
    "హల్లో విజయ్! నరేంద్ర  నిద్రపోతున్నాడా?" లేదు."
    "అర్జెంటుగా మాట్లాడాలి పిలువు."
    "ఎవరు! ఇన్ స్పెక్టరేనా!"
    "అవును." అంటూ రిసీవర్ అందించాడు నరేంద్రకు విజయ్.
    "హల్లో!"
    "నరేంద్రా ! నువ్వు త్వరగా రావాలి."
    "ఎక్కడకు?"
    "జూబ్లీహిల్స్ కు."
    "మరో స్త్రీ హత్యా?"
    "కాదు- జూబ్లీహిల్స్ ప్యాలెస్ హొటల్లో హత్య జరిగింది. అతడి పేరు హొటలు రికార్డులో రామానందస్వామిగా నమోదు అయి ఉంది. ఆ రాస్కెల్ నాకు ఫోన్ చ్శాడు."
    "ఎవరూ?"
    "హంతకుడే! ఫలానా చోట హత్య జరిగింది వెళ్ళు! శవం తెచ్చుకోమన్నాడు,"
    నరేంద్ర పకపకనవ్వాడు.
    "ఎందుకు నవ్వుతావ్?"
    "ఆ ఫోన్ చేసింది హంతుకుడేనని ఎలా చెప్తావ్?"
    "మరొకడైతే పేరెందుకు చెప్పడు? పేరు అడగ్గానే ఫోన్ పెట్టేశాడు.
    "పేరు చెప్తే  మీ పోలసోళ్ళు వాడ్ని ఒకపట్టాన వదుల్తారా? అందుకే ప్రజలు చూసిన అపరాధాలను కూడా పోలీసులకు చెప్పడానికి భయపడ్తారు."
    "నువ్వు ఎప్పుడూ మమ్మల్నే అంటావు. అది సరే వెంటనేరా."
    "ఇప్పుడు నేను వచ్చి ఏం చెయ్యాలి? నువ్వే చూసుకో శవాన్ని పోస్టుమార్టంకు పంపించు. రేపు  మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను  రాలేను. గుడ్ నైట్ !" అని ఫోన్ పెట్టేశాడు నరేంద్ర.
    "ఎవరూ! హంతకుడు  ఫోన్ చేశాడటా? ఆ రాస్కెల్  ఇక్కడ్నుంచి వెళ్ళగానే ఫోన్ చేసి ఉంటాడు."
    "వాళ్ళు వెళ్ళి పదినిముషాలైనా కాలేదు. ఈలోగా ఫోన్  ఎలా చేస్తాడు? ఒక వేళ  చేసినా ఇన్ స్పెక్టర్ ఇంత త్వరగా ఎలా హొటల్ కు చేరి ఉంటాడు? పోన్ వచ్చాక హొటల్ చేరుకొని రికార్ధులు తిరగవేసి  హంతుకుడిపేరు వగైరా తెలుసుకోవడానికి అర్ధగంటైనా పట్టదా? గుడ్  నైట్!" అని మరో  ప్రశ్నకు  అవకాశం ఇవ్వకుండా తన గదిలో వెళ్ళిపోయాడు నరేంద్ర.
                                          6
    ఉదయం తొమ్మిది గంటలైంది.
    డిటెక్టివ్ నరేంద్ర తన ఆఫీసు గదిలో కూర్చుని పేపరు చూస్తున్నాడు. హొటల్ ప్యాలెస్ లో జరిగిన  హత్య  గురించి వార్తఅప్పుడే పేపర్లలో వచ్చింది.
    ఇన్ స్పెక్టర్ భుజంగం, ఇనుపనాడాల బూట్లు టకటకలాడించుకొంటూ  గదిలోకి హడావిడిగా వచ్చాడు.
    "గుడ్ మార్నింగ్."
    "గుడ్ మార్నింగ్ ఇన్ స్పెక్టర్!"
    "రాత్రి హత్య గురించేనా చదువుతున్నావ్?" అడిగాడు ఇన్ స్పెక్టర్ .
    "ఆ! అదే చూస్తున్నానురాత్రికి రాత్రే చాలా ఇన్  ఫర్ మేషన్  సంపాదించినట్టున్నావ్? గుడ్ వర్క్!" పత్రిక మీద నుంచి దృష్టి మరల్చకుండానే అన్నాడు.
    "ఆ! ఆ పత్రికల వాళ్ళ గురించి వేరే చెప్పాలా? ఇంత చెప్తే డానికి చిలువలు పలవలు కల్పించి అంతగా చేసి వేస్తారు. హంతకుడి గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకోవలసిందేమీ లేదు,"
    "అదేం? అతడి గురించి నీకు ముందే అంతా  తెలుసా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నరేంద్ర.
    "అతడు ఒకసారి రైలు ప్రమాదంలో చనిపోయినట్టు మా రికార్డులోకి కూడా ఎక్కింది."
    "అతడే ఇతడని అంత తేలిగ్గా ఎలా తెలుసుకోగలిగావ్?"
    "అతడు నాకు బాగా తెలుసు. పేరు రామకృష్ణ. అతడి బావలోగడ మా ఆఫీసులోనే పనిచేశాడు."
    "ఇప్పుడు చెయ్యడంలేదా?"
    "లేదు. అతడు చనిపోయాడు. చనిపోయి కూడా చాలా ఏళ్ళు అయింది. ఐదారేళ్ళకు పైగానే."
    "బావా అంటే ఎలా బావ?"
    "రామకృష్ణ అక్క భర్త. ఆమె పేరు కమలాంబ, హొటల్లో శవాన్ని నేనూ, మా హెడ్డూ కూడా గుర్తు పట్టాం. కాని ఒక చిన్న చిక్కు వచ్చి పడింది."
    "ఏమిటది?"
    "రామకృష్ణ హొటల్  రిజిష్టర్ లో తన పేరు రామానందస్వామిగా రాయించారు. అదే పెద్ద మిస్టరీగా ఉంది."
    "మరి వాళ్ళ అక్క గుర్తు పట్టిందా?"
    "ఆ! కమలాంబ. ఆమె కూతురు లావణ్య కూడా శవాన్ని గుర్తు పట్టారు శంక్రరావు కూడా గుర్తించాడు."
    "శంకర్రావు ఎవరు?"
    "లాయరు శంకర్రావు. వాళ్ళఫామిలీ ఫ్రెండ్."
    "పోస్టు మార్టం అయిపోయిందా?" అడిగాడు నరేంద్ర.
    "మర్డర్ జరిగిన టైం గురించి రిపోర్టులో ఏమిచ్చారు?" విజయ్ అడిగాడు.
    "11-30 నుంచి 1 గంటలోపల జరిగి వుంటుందన్నారు" అన్నాడు  ఇన్ స్పెక్టర్.
    విజయ్ నరేంద్ర ముఖంలోకి అర్థయుక్తంగా చూశాడు. కాని నరేంద్ర ఎదో ఆలోచిస్తూ విజయ్ చూపుల్లో అర్థాన్ని అందుకోలేక పోయాడు.
    అనసూయ, సూర్యనారాయణ ఇక్కడకు దాదాపు పన్నెండు  అవుతుండగ వచ్చారు, అంటే ఆక్కడ ఆపని ముగించుకొని ఇక్కడకు వచ్చారు. రాత్రికి రాత్రి తన సలహా ప్రకారం వాళ్ళిద్దర్నీ పోలీసులకు అప్పగిస్తే ఎంత పేరువచ్చేది? నరేంద్రతోపాటు తనకూ పేరు వచ్చేది. ఒకోసారి నరేంద్ర చాలా త్లివి తక్కువగా ప్రవర్తిస్తాడు.
    "ఏమిటి విజయ్  అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావ్?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
    "నీ తెలివితేటల గలగల నవ్వాడు.
    "అవునోయ్! విజయ్! మొన్నరాత్రి హత్య చెయ్యబడిన రాధారాణి కేసులో తలేదో తోకేదో తెలియ పోయినా ఈ కేసు మాత్రం ఒక దారిన పడినట్టుగానే ఉంది." అంటూ నరేంద్ర ముఖంలోకి చూశాడు ఇన్ స్పెక్టర్.
    "మిస్టర్ అద్వయితం! నీ ధోరణి చూస్తుంటే అప్పుడే  అనుమానితుల లిస్టాకటి తయారు చేసినట్టుగా అన్పిస్తోంది. అన్నాడు విజయ్."
    "లిస్టా?" అద్వయితం పెద్దగా నవ్వాడు పొట్ట ఎగిరెగిరిపడేలా.
    అంతలో ముఖం తీవ్రంగా మారింది.
    "రాస్కెల్ వాడికెంత గుండెదైర్యం? హత్య చేసి. నాకు శవాన్ని తెచ్చుకోమని ఫోన్ చేస్తాడా?" పళ్ళు పటపట కొరికాడు అద్వయితం.
    "ఏమిటి ఇన్ స్పెక్టర్? ఆ హంతుకుడేవడో సాక్షాత్తు నీ అర చేతిలో ఉన్నట్టే మాట్లాడుతున్నావే?" ముసి ముసిగా  నవ్వుతూ అన్నాడు డిటెక్టివ్ నరేంద్ర.
    "ఆ! చెయ్యి చాపితే అందేంత దూరంలోనే ఉన్నాడు."
    "వండర్ పుల్" చప్పట్లు కొట్టాడు విజయ్.
    "రామకృష్ణను హత్య చేసిన వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలిశాయి."
    "ఏమిటవి? విజయ్  ప్రశ్నించాడు. నరేంద్ర ఆలోచనలో పడ్డాడు.
    "ఒకటి తర్వాత చెప్తాను. రెండోది...." అంటూ ప్యాంటు జేబులో నుంచి చిన్న పార్సిల్ ఒకటి బయటకి తీశాడు అద్వయితం.
    "ఏమిటది?" కుతూహలంగా అడిగాడు అసిస్టెంట్ డిటెక్టివ్ విజయ్.
    "ఇందులో ఒక సిగరెట్ కేసు ఉంది. దాని మీద వేలు ముద్రలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని పోటోతియ్యడం జరిగింది ఇక పోతే నేను అనుమానిస్తున్న వ్యక్తి వేలుముద్రలతో వాటిని పోల్చి చూడడమే, అందుకే అంటారు...."
    "ఏమని? మధ్యలోనే అందుకొని ప్రశ్నించాడు నరేంద్ర.
    "ఎంత తెలివైన హంతకుడు కూడా హత్యా ప్రదేశంలో ఏదో ఒకటి వదిలేసి పోతాడు. రామకృష్ణ హత్య చేసిన వాడు  ఈ సిగరెట్ కేసు  వదిలేశారు "మూడోది...." అని ఆగి నరేంద్ర కేసి అదోలా చూశాడు.
    నరేంద్ర ఇన్ స్పెక్టర్ ఎందుకు తనను అలా చూశాడా అనే  ఆలోచనలో పడ్డాడు.
    "ఊ! చెప్పు! మూడోది.....ఏమిటి?" ఉత్సాహంగా అడిగాడు విజయ్.
    "ఆ హొటల్లో హంతకుడ్ని కళ్ళారా చూసిన సాక్షులు ఇద్దరు ఉన్నారు."
    హంతకుడ్ని చూశారా? ఎవరు వాళ్ళు? నరేంద్ర విస్మియంగా  అడిగాడు.
    "ప్యాలెస్ హొటల్లోకి రాత్రి దాదాపు ఒకటిన్నర అవుతుండగా  ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతడ్ని కౌంటర్లో ఉన్న గుమస్తా, లిప్ట్  బాయ్  ఇద్దరూ చూశారు. అంతకంటే హంతకుడ్ని పట్టడానికి ఏంకావాలి వాళ్ళ సాక్ష్యాలు బలమైనవి. వాళ్ళు ఆ వ్యక్తిని చూపిస్తే గుర్తించగలరు కేసంతా అల్లుకొస్తున్నాను. అన్నీ సవ్యంగా ఉంటే 24గంటల్లో హంతకుడ్ని పట్టుకుతీరుతాను," గంభీరంగా ముఖంపెట్టి అన్నాడు అద్వయితం.
    అద్వయితం ముఖంలోకి అయోమయంగా చూశాడు విజయ్. ఏదో ప్రమాదం ముంచుకు రాబోతున్నట్టు అన్పించింది. నరేంద్రకేసి అర్థయుక్తంగా చూశాడు. విజయ్ చూపుల్లో ఏదో  అజ్ఞాతభయం.
    "సెభాష్ ఇన్ స్పెక్టర్- విష్ యూ గుడ్ లక్. గో ఎ హెడ్! అన్నాడు అద్వయితానికి ఉషారు ఎక్కిస్తూ నరేంద్ర.
    విజయ్ కు నరేంద్ర మీద చిర్రెత్తు కొచ్చింది.
    "ఇన్ స్పెక్టర్! పోస్టుమార్టం రిపోర్టులో మర్డర్టైం ఎంతన్నారు?"
    అడిగాడు విజయ్.
    "11-30 నుంచి1-00 గంట లోపల ఎప్పుడైనా జరిగివుండవచ్చువని రిపోర్టు చెప్తోంది."
    మరి హొటల్ కుర్రాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు  చూసిన వ్యక్తి  ఎన్ని గంటలకు హొటల్లో ప్రవేశించాడన్నారూ?"
    "ఒకటిన్న...."వాక్యం పూర్తి చెయ్యకుండానే విజయ్ ముఖంలోకి చూశాడు ఇన్ స్పెక్టర్.
    విజయ్  చిరునవ్వు నవ్వాడు.
    "ఒక అర్థగంట అటూ ఇటూ కావచ్చు. అలా  ఎన్నో కేసుల్లో జరిగింది కూడా అవునా నరేంద్ర?"
    సిగరెట్ పొగ ఊదుతూ తల ఊపాడు నరేంద్ర "అవును!" అన్నట్టుగా.
    "ఈ నరేంద్ర చిక్కుల్లో పడేలా ఉన్నాడు" అనుకున్నాడు విజయ్.
    "అయితే నన్నొక అనుమానం తొలుస్తూ ఉంది." నీళ్ళు నములుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్ అద్వయితం.
    "ఏమిటదీ?" నరేంద్ర ప్రశ్నించాడు వలయాలు చూసుకొంటూ పైకి వెళ్తున్న సిగరెట్ పొగను చూస్తూ.
    "ఆ రాధారాణి హత్యకు ఈ రామకృష్ణ హత్యకూ ఏదైన సంబంధం ఉందా అని...."నీళ్ళునములుతూ అన్నాడు.
    "ఉండొచ్చు, లేదని నువ్వెలా చెప్పగలవ్!" కాలిపోయిన సిగరెట్ కు మరో సిగరెట్  ముట్టించుకున్నాడు డిటెక్టివ్.
    "ఆ ఉత్తరం ఒకసారి...."
    "ఏ ఉత్తరం" ఓ క్షణం తత్తరపోయి అంతలోనే సర్దుకొని నింపాదిగా ఏ ఉత్తరం? అని అడిగాడు నరేంద్ర.
    "అదే! రాధారాణి వ్యోనిటీ బ్యాగ్ లో  దొరికిన ఉత్తరం. అందులో ఈ రెండు హత్యలకూ ఏదైనా సంబంధం ఉందని నిరూపించే"క్లూ" ఏదైనా దొరుకుతుందని నా ఆశ."    

 Previous Page Next Page