మీ చేతిలో కర్చీపు ఆయన కివ్వండి. చెమట్లుతుడుచుకుంటాడు" అన్నాడు విజయ్ వ్యంగ్యంగా.
"విజయ్ అసలే భయపడ్తున్నారు. నవ్వు మరీ అంతగా హడల గొట్టకు" అని సూర్యనారాయణని చూస్తూ "మిమ్మల్ని రామకృష్ణ హత్య చేస్తాడనే భయంతో ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవాలని వచ్చారా?" ప్రశ్నించాడు నరేంద్ర అదోలా చూస్తూ.
"ఈ ఒక్క రాత్రి దాక్కుంటే గండం గడిచినట్టేనని ఎలా భావిస్తున్నారు?" అన్నాడు విజయ్ అనుమానంగా చూస్తూ.
సమాధానం తోచనట్టు మౌనంగా ఉండిపోయాడుసూర్యనారాయణ. నరేంద్ర ఏదో ఆలోచనలో పడ్డాడు.
"నరేంద్రగారూ! మీరు ఆయనను కలుసుకోవాలి?" అన్నది అనసూయ.
"ఎందుకూ?"
"మా గురించి ఆయనకు నచ్చజెప్పాలి ఆటోమొబైల్ లో నాకున్న వాటా ఆయనకు రాసేస్తాను. అది ఆయనదే. ఆయనఆస్తిలో చిల్లిగవ్వ కూడా నాకు అక్కర్లేదు" అన్నది అనసూయ.
"మరి! మీ సంగతి!" అన్నాడు విజయ్ సూర్యనారాయణను పరిశీలనగా చూస్తూ.
"నాకూ అక్కర్లేదు" కపెంనీలో నాకున్న హక్కును వదిలేసుకుంటాను. మానేజ్ మెంటు అతడికి అప్పగించి నా దారిన నేను వెళ్ళిపోతాను."
"అంటే ఈమెను కూడా అతడికి వదిలేసి వెళ్ళిపోతారా?" అన్నాడు నరేంద్ర.
"అదేమిటి సార్ అలా అంటారు? వేనంత వెధవనుకాను.ఈమె నా ప్రాణం. అతడు మా ప్రాణాలు తియ్యకుండా వదిలేస్తే చాలు. ఈ హైదరాబాదే వదిలేసి వెళ్ళిపోతాం. మా బ్రతుకు మేము బతుకుతాబ.
"మీ నిర్ణయం భాగానే ఉంది. అందుకు నేను చెయ్యవలసిందేమిటి?" అన్నాడు నరేంద్ర.
"నేను ఎలాంటి పరిస్థితుల్లో అనసూయను పెళ్ళిచేసుకొన్నావో మీరు అతనికి నచ్చ జెప్పాలి మా జిలికి రాకుండా చూడాలి. ఆ పని మీరు చెయ్యగలరనే కొండంత ఆశతో మీ దగ్గరకొచ్చాను. కేసు గెలవడం ఓడటం తరువాత సంగతి. తెల్లవారితే అతడు మా మీద కోర్టులో కేసు వేసే ఉంది" అన్నాడు సూర్యనారాయణ.
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారూ?" నరేంద్ర సాలోచనగా అడిగాడు.
"ఈరోజు సాయంకాలం అతడు లాయర్ను కలుసుకొన్నాడు."
"ఓ ఐ సీ" ఆలోచనలో పడ్డాడు నరేంద్ర.
"అయితే మీరు అతడ్ని వాచ్ చేస్తున్నారన్నమాట?" ఓ క్షణం ఆగి అన్నాడు నరేంద్ర.
"అంతేకాదు. అతడు మరో అమ్మాయిని కలుసున్నాడని కూడా మీకు తెలిసి ఉండాలే" విజయ్ అన్నాడు.
"అమ్మాయా? నాకు త్లియాడు సార్?" గాభరాగా సూర్యనారాయణ అన్నాడు.
"నిజం చెప్పండి!" గద్దించాడు నరేంద్ర.
"నిజం సార్! నాకదేమీ తెలియదు."
"ఆ అమ్మాయిని అతడు ఇక్కడకు వచ్చిన రాత్రే ఎవరో హత్య చేశారు."
"హత్యా! "కీచ్ "మని ఆరిచింది అనసూయ.
ఆ హత్యా మీరే చేశారని నేనంటే?" విజయ్ అన్నాడు.
"సార్! సార్! ఏమిటి మీ అసిస్టెంట్ అలా మాట్లాడుతున్నారు నేనా? హత్యా చెయ్యడమా?" గాభరా పడిపోతూ అన్నాడు సూర్యనారాయణ.
"మా ప్రాణాలు రక్షించుకోవడానికి మీ ఆశ్రయం కోరివస్తే మా మీదే హత్యానేరం మోపుతారేంటిసార్?" అనసూయ కంఠం తీవ్రంగా పలికింది.
"ఇంతకూ అతడు మంచి అమ్మాయిని ప్రేమిస్తున్నట్టూఆ అమ్మాయికోసమే మూడేళ్ళ తర్వాత తిరిగి వచ్చినట్టూ మీకు తెలియదంటారు?" విజయ్ రెట్టించాడు.
"నిజంగా ఇవన్నీ మాకేమీ తెలియదుసార్!"
"మరి రామకృష్ణ నిన్న రాత్రి ఈ ఊరు వచ్చినట్లు మీకెలా తెలిసింది?" నరేంద్ర ప్రశ్నించాడు సూర్యనారాయణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
"నిన్నరాత్రే వచ్చినట్టుగా కూడా నాకు తెలియదు సార్.ఇవ్వాళ సాయంకాలం మూడు గంటలకు రావూస్ టెక్స్ స్టయిల్స్ ఆఫీసుకు ఒక స్నేహితుడిని కలవాలని వెళ్ళాను. లోపలనుంచి బయటికి వస్తున్న రామకృష్ణ కనిపించాడు. అతను ఆ కంపెనీ మానేజర్ సోమసుందరంతో మాట్లాడుతూ బయటికి వస్తున్నాడు అతను నన్ను చూడలేదు నేను పక్కకు తప్పుకొన్నాను."
"ఆ తర్వాత అతడ్ని వెంబడించారు" వాక్యంపూర్తి చేశాడు నరేంద్ర.
"ఆ....అవున్ సార్!"
"ఎక్కడెక్కడికి వెంబడించారు."
"అతడు తిన్నగా హొటల్ వెళ్ళాడు సార్."
"ఆ సమయంలో అతడు ఎలా ఉన్నాడు?"
"చాలా విచారంగా ఉన్నాడు సార్!"
"ఊ తర్వాత?"
"అతడు చూడకుండా అంటే అతడు గదిలోకి వెళ్ళేక కౌంటర్ బాయ్ ని అడిగి తెలుసుకొన్నాను సార్!"
"ఏమని?"
"అతను రామానందస్వామి అనే పేరుతో హొటల్ గది బుక్ చేశాడనీ, అంతకు ముందు రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో వచ్చాడనీ చెప్పాడు సార్."
"తర్వాత?"
"తర్వాత అనసూయకు ఈ విషయం చెప్పాను సార్. అనసూయ చాలా భయపడిపోయింది. మీ గురించి నేను చాలా విన్నాను. మీ దగ్గరికి వచ్చాం ఒక గ్లాసు మంచి నీళ్ళు...."
"షూర్!" నరేంద్ర విజయ్ కేసి చూశాడు. విజయ్ రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ గటగటతాగేసి ఖాళీ గ్లాసు కింద పెట్టారు.
"మీరు మా గురించి నచ్చజెప్పాలి సార్.మా మానాన మమ్మల్ని వదిలెయ్యమని చెప్పండి" అన్నాడు సూర్యనారాయాణ.
"మీరు ఈ సహాయం చేస్తే మీకు ఐదు వేలు ఫీజుగా ఇచ్చుకుంటాం" అన్నది అనసూయ.
"వెరీగుడ్! ఒక గంట పనికి ఐదు వేల రూపాయలు...." ఉషారుగా అన్నాడు విజయ్.
నరేంద్ర చినాల్న లేచి నిలబడ్డాడు. వాచీ చూసుకొన్నాడు.
"మైగాడ్! ఇప్పటికే ఆలస్యం చెయ్యలేదు గదా!" తనకు తానేచెప్పుకొంటున్నట్టుగా అన్నాడు.
విజయ్ నరేంద్రను విస్మయంగా చూశాడు.
"మీరు నాకు ఫీజు ఇవ్వాల్సింది అతడ్ని ఒప్పించి.....నందుకు కాదు. అతడివల్ల మీకు ఎలాంటి హనీ జరగకుండా ఉంటేచాలు. అదేగా మీకు కావాల్సింది."
"అవును సార్!"
"అతడివల్ల మీకు అపకారం జరగదని నేను చెబితే మీరు నాకు ఫీజు ఇవ్వాలి ఓ.కే?"
అనసూయ సూర్యనారాయణ ముఖంలోకి చూసింది.
"అలాగే ఇస్తాం!" అన్నాడు సూర్యనారాయణ.
నరేంద్ర తన గదిలోకి వెళ్ళి డ్రెస్ చేసుకొన్నాడు. చేతివాచీ చూసుకొన్నాడు. ఒంటిగంటా పదినిముషాలు అయింది.
"కొంచెం పనుంది! గంటలో వస్తాను."
"వంటరిగా వెళ్తావా? నేనూ వస్తాను."
"వద్దు. నువ్వు వీళ్ళిద్దర్నీ ఒక కంట కనిపెట్టి ఉండు. నేను వెంటనే వచ్చేస్తాను. వాళ్లను మాత్రం బయటికి వెళ్ళనివ్వకు.
"ఒంటరిగా వెళ్ళొద్దు.అద్వాయితానికి ఫోన్ చేస్తాను." అన్నాడు విజయ్.
"అక్కర్లేదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నాకు ముందే ఈ ఆలోచన వచ్చి ఉండాల్సింది." అని నరేంద్ర బయటికి నడిచాడు.
గ్యారేజీలో నుంచి రెడ్ మారుతీ ఎ.ఐ.ఎ 2000 బయటికి తీశాడు నరేంద్ర.
విజయ్ గేటు తెరిచాడు.
కారు శరవేగంలో దూసుకుపోయింది.
విజయ్ తిరిగి వచ్చేసరికి అనసూయా సూర్యనారాయణ ఏదో సన్నగా మాట్లాడుకొంటూ ఠక్కున ఆపేశారు.
"నిజం చెప్పండి రాధారాణి గురించి మీకేమీ తెలియదా?"
"రాధారాణీయా? మొన్న రాత్రి హత్య చెయ్యబడిన అమ్మాయా? మాకు తెలియదు సార్. ఇవ్వాళ ఉదయం పేపర్లో వార్త చదివాను. ఆ అమ్మాయి కోసమేనా రామకృష్ణ తిరిగి వచ్చింది?" అడిగాడు సూర్యనారాయణ.
విజయ్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడికి సూర్యనారాయణే రాధారాణిని చంపాడనే అనుమానం దృఢంగా కలిగింది.
నరేంద్ర ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళినట్టు? ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నాడేం? వీళ్ళే అతడ్ని కూడా చంపి ఎలిబి కోసం తిన్నగా డిటెక్టివ్ ఇంటికే వచ్చారా? విజయ్ ఆలోచనలు తెగడం లేదు.
5
రెడ్ మారుతీ జూబ్లీ హిల్స్ లోని హొటల్ ప్యాలెస్ ముందు ఆగింది. అప్పుడు సరిగ్గా ఒంటిగంటా ఇరవైఐదు నిమిషాలు అయింది.
నరేంద్ర దిగి గబగబా మెట్లేక్కాడు.
కౌంటర్ దగ్గర కొచ్చాడు. కౌంటర్లో ఉన్న యువకుడు కుర్చీలో వెనక్కు వాలి నిద్రపోతున్నాడు.
నరేంద్ర చేతివేళ్ళతో కౌంటర్ మీదకొడ్తూ "హల్లో ! మిస్టర్ !" అన్నాడు.