మహతి మనసుబాధతో విలవిలలాడింది. అనాలోచితంగా మాట్లాడి అతని సున్నితమైనా మనసును చిన్నబుచ్చినందుకు బాధపడింది. "రవీ? ప్లీజ్ ఆగు! ఎక్కడికిపోతున్నవ్?" అతను వెనక్కు తిరిగి చూడలేదు. డోర్ దగ్గర ఆగి నిలబడ్డాడు. "వీణకు తీగ బిగించి పెట్టవా మరి?" అతడు మంత్రించినట్టు వెనక్కు తిరిగాడు. "రవీ! నువు తీగ బిగించేసరికి నేను జడల్లుకొస్తాను. సరేనా?" తెచ్చిపెట్టుకొన్న ఉత్సాహంతో అంది. అతను మౌనంగా వీణ దగ్గరకు నడిచాడు. మహతి తలదువ్వుకొని వచ్చేసరికి, వీణకు తీగ అమర్చి ఎదురుగా కూర్చుని ఉన్నాడు. మహతి వచ్చి అతని పక్కన కూర్చొంది. "సారీ! రవీ! ఈ రోజు వీణ వాయించలేను" "కారణం తెలుసుకోవచ్చా?" "వంట్లో బాగా లేదు" "రాత్రి పొద్దుపోయి పడుకున్నావా?" మహతి కనురెప్పలు టపటపలాడాయి. ఆశ్చర్యంగా చూసింది "నీకెలా తెలుసు?" "నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి" మహతి నిట్టూర్చింది. "అంతేనా?" "పోనీలే! కాసేపు నువ్వా వీణ పక్కన కూర్చో" "వీణ వాయించకుండా వీణ పక్కన కూర్చుంటే నీకొచ్చే లాభం ఏమిటి?" కళ్ళు గుండ్రంగా తిప్పింది    
    "నిన్ను అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది" "నిన్నంతా ఎక్కడికెళ్ళావ్?" ఆమె సంభాషణ మరోవైపు తిప్పడానికి ప్రయత్నించింది. "ఎక్కడికీ వెళ్ళలేదు" "రోజంతా ఇంట్లో ఏంచేశావ్?" అతని ముఖంలోకి సూటిగా చూసింది మహతి. "నిద్రపోయాను" "రోజంతా నిద్రపోయావా?" "ఏం చెయ్యనుమరి? నిన్న మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంటు షాపు తెరవలేదు. ఆ షాపు యజమాని అకస్మాత్తుగా గుండె ఆగి పోయాడట". ఆమె విస్మయంగా చూసింది. "నిన్న ఉదయం తీగదొరకలేదని రావడంమానేశావన్నమాట!" "అవును!" "నువొస్తున్నది నాకోసం కాదన్న మాట. వీణ వినడానికే అయితే నాకంటే బాగా వాయించే విద్వాంసు లెందరో ఉన్నారు. వాళ్ళ దగ్గరకెళ్ళి వినొచ్చుగా?" విసురుగా అంది మహతి. "అక్కడ మహతి ఉండదుగా?" నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో చల్లదానం, హాయి ఉన్నట్టుగా అనుభూతి కలిగింది మహతికి. "అయితే ఈ వీణ విరగ్గొట్టి ముక్కలు చేసి అవతల పారేస్తాను అప్పుడేం చేస్తావ్?" "వీణ లేకపోతేనేం, మహతి ఉంటుందిగా?" మందహాసం చేశాడు. "మహతీ! మహతీ! ఎప్పుడూ వచ్చి ఎదురగా కూర్చుంటావ్? నీ ధోరణినాకు పిచ్చెత్తిపోయేట్టుంది. వీణ - వాయిద్యం - మరొకమాటలేదు, మంచి లేదు" చిరచిర లాడిపోయింది మహతి. అయినా అతడు రెచ్చిపోలేదు. పైగా ఆనందంగా నవ్వుకున్నాడు.    
    "నువ్వంటే నాకు ఇష్టమో కాదో కూడా తెలుసుకోకుండానే చుట్టుకొని చుట్టుకొని తిరుగుతున్నావ్!" "ఎందుకు తెలుసుకోవాలి?" "నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా...." "నాకనవసరం!" ఆమె మాటపూర్తికాకుండానే సమాధానం చెప్పాడు. "నేను నిన్ను ప్రేమించడం లేదని తెలిసినా కూడా ఇంకా ఇలాగే నా కోసం వస్తూనే ఉంటావా?" పట్టి పట్టి తూచి తూచి అడిగింది. "వస్తాను. నువు రావద్దన్న దాకా వస్తాను" "అలా మాట్లాడటానికి నీకు సిగ్గనిపించడం లేదా?" కసిగా అంది మహతి. "దేవి వరం ఇవ్వలేదని భక్తుడు పూజలు మానేస్తాడా?" ఆమె గుండె ఝల్లుమంది. మనసు పాలసముద్రపు వెల్లువైంది. ఏం మనిషి? ఏమి తత్వం? ఇలాంటి మనుషులు ఎందరుంటారు? "ఆ దేవి నిన్నుకాదనిమరొకరికి వరం ప్రసాదిస్తే?" "అతడి అదృష్టానికి అసూయపడను. నా దురదృష్టానికి బాధ పడతాను". "నువేం మనిషివో నాకు అర్ధం కావడంలేదు" "మామూలు మనిషినే. రాగదేషాలకు అతీతుడనని చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది. నేను ఆరాధించే దేవిని ఇదిచెయ్ అదిచెయ్ అని కోరడం ఆ దేవతను అవమానించడంగా భావిస్తాను". ఆమెకు ఎంతో గర్వంగా వుంది. కాని--- సాహసి. ధైర్యశాలి. వెంటనే కిరణ్ వ్యక్తిత్వం కళ్ళముందు నిలిచింది.    
    ఒక స్త్రీ శీలాన్నీ, ప్రాణాన్నీ కాపాడగలిగాడు. ఏ ఆడదయినా కోరదగిన పురుషుడు. "ఒక ఆడదాని శీలం ఒక మగాడి ప్రాణం కంటే విలువైనది" అతను అన్నమాట ఆమె చెవులకుయింకా విన్పిస్తూనే వుంది. ఇదే పరిస్థితుల్లో రవి అయితే ఏం చేసేవాడు? రవికీ కిరణ్ కూ పోలికే లేదు. కిరణ్ ధీరుడు, ఉదాత్తుడు. అలాంటి కిరణ్ ను తను ఎలా వదులుకోగలదు? అసంభవం. మహతి అతడ్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో పడింది. "ప్రేమ ఒన్ వే ట్రాఫిక్ కాదు" మహతి కళ్ళు పెద్దవిచేసి అతని కళ్ళల్లోకి చూసింది. "ఇచ్చి పుచ్చుకునే వస్తువు అంతకన్నా కాదు. ఈ సఫ్ ఫేబుల్స్ లో ఒక కథ ఉంది. ఎప్పుడయినా విన్నావా?" "ఏమిటా కధ?" కుతూహలంగా అడిగింది మహతి. రవి సోఫాలో ఉత్సాహంగా సర్దుకున్నాడు. పక్కన కూర్చున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు. "ఊ( చెప్పు! ఏమిటా కథ? మొదలు పెట్టు--వింటున్నా" "అలాకాదు. ఎదురుగా కూర్చో" "ఏం ఎదురుగా కూర్చోబెట్టుకొని నన్ను చూస్తుంటే గాని కధ గుర్తురాదా?" పకాలున నవ్వింది. వెన్నెల్లో మల్లెలు ఆరబోసినట్లుందా మెరుపు. మహతి లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. "మొదలు పెట్టనా?" ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. "ఏమిటా చూపు? మంత్రం వేయబోతున్నావా? లేక నన్ను హిప్నటైజ్ చేసి నా చేతనాకిష్టం లేనివి ఏమన్నా...." "ఆగు మహతీ! పొరపాటు పడుతున్నావ్. ఇష్టంలేనివాళ్ళు అసలు హిప్నటైజ్ అవడం జరగదు. హిప్నటైజ్ అయిన వాళ్ళచేత వాళ్ళకు ఇష్టం లేనిపని చేయించడం జరగని పని. హిప్నటిజం పేరుతో వ్యాపారం చేసే వాళ్ళుచెప్పే మాయమాటల్ని నమ్మకూడదు. రోడ్ల మీద గారడీ చేసేవాళ్ళు వీళ్ళకంటే నిజాయితీపరులు.    
    సైకాలజీ, అబ్ నార్మల్ సైకాలజీ, పారా సైకాలజీఅంటూ సరిగా అర్ధం తెలియనిపదాలను వల్లిస్తూ, ఈరోజు ఎంతోమంది హిప్నాటిస్ట్ లుగానూ, సైకియాట్రిస్టులుగా చలామణి అవుతున్నారు". "అందర్నీ ఒకే గాట కట్టలేం. ప్రొఫెసర్ పరశురాం" మధ్యలో అందుకొని మహతి చెప్పబోతుండగా "నేను ఆయనగారి గురించి మాట్లాడటం లేదు" అన్నాడు రవి." "ఆయన నీకు తెలుసా?" "విన్నాను" "ఏమని విన్నావ్?" "ఫేమస్ సైకియాట్రిస్టని విన్నాను" "ఆయన మా ఫామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్" "ఓహో! అలాగా?" "పరిచయం చేస్తాను. ఓసారి వెళ్దామా?" "నాకంత ఇంటరెస్టు లేదు" "నాకు నిన్ను పరిచయం చెయ్యాలని ఉంది. చెప్పానుగా, మా ఫామిలీ ఫ్రెండని?" సమాధానంకోసం రెప్పవాల్చకుండా రవి ముఖంలోకి చూసింది మహతి. అతను కొద్ది నిముషాలు మౌనం వహించాడు. "సరే! నీ ఇష్టం" అన్నాడు. "మనోవిజ్ఞాన శాస్త్రంలో నీకింత పరిజ్ఞానం ఉందని నాకు తెలియదు. నిన్ను చూస్తే ఆయనకిసంతోషం కలుగుతుందని నాకు తెలుసు. అందుకే పరిచయం చేద్దామనుకొంటున్నాను" "ఆయన సంగతెలా ఉన్నా నేను ఆయనను కలవడం నీకు సంతోషంకదా?" "థాంక్యూ! ఫోన్ చేసేదా? ఇప్పుడు ఖాళీగానే ఉంటారు" ఉత్సాహంగా అంది మహతి. "ఇప్పుడా? వద్దు. నీకంత ఓపిగ్గా ఉంటే ఓ అర్ధగంట" దివాన్ మీదున్న వీణ కేసి చూశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra