Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 17

బండి కదిలింది. సైనికులంతా సెల్యూట్ చేశారు. మిష్టర్ హారే వాళ్ళ సెల్యూట్ ను స్వీకరించాడు. బండి ప్లాట్ ఫారం దాటింది. మిష్టర్ హారే సీతకేసి చూశాడు.
సీత అతనినే కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తోంది. అతను మృదువుగా చిరునవ్వు నవ్వాడు.
"బాబాయ్! నిన్ను ఇండియాలో ఎంత గొప్పగా చూస్తారో మనవాళ్ళకు తెలియాలి" అన్నది.
మిష్టర్ హారే నవ్వాడు. ఈసారి అతని నవ్వులో బోలుతనం వుంది.
"మనవాళ్ళు నమ్మరు. హైదరాబాద్ లో కూడా ఇక్కడ లభించిన గౌరవ సత్కారాలే లభిస్తాయని ఆశిస్తున్నాను."
తప్పకుండా లభిస్తాయి. మనం ఇంగ్లాండు నుంచి ఇండియాకు వచ్చినట్టుగా నాకు అన్పించడం లేదు.
"ఏమనిపిస్తుంది?"
మరో ప్లానెట్ కు వెళ్ళినట్టుగా వుంది. ధైర్యంగా ఎప్పుడూ మాట్లాడలేదు. తనకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. దానికి కారణం బాబాయి ప్రవర్తనే.
ఈ సమయంలో తనొక యువరాణి. కాని యువరాజు లేడు. ఆమె ఆలోచనలు ఆ అజ్ఞాతవ్యక్తి వైపుకు మళ్ళాయి. అతని కన్పిస్తాడా మళ్ళీ? కనిపిస్తే అతన్ని ఇండియా గురించి ఎన్నో అడగాలి.
ఆమె కళ్ళముందు కలకత్తా వీధుల్లో, రోడ్డుపక్కన కన్పించిన బీదజనం అంతా కదిలారు. ఎక్కడ వైస్ రాయ్ బంగళా? ఆ బంగళాలో నివసించేవాళ్ళూ? ఎందుకింత భేదం?
అంతమంది బీదవాళ్ళుగా ఎందుకున్నారు?
అతను చెప్పిన ప్రకారం ఇదికాక ఇండియాకు మరోరూపం వున్నది.
అక్కడ పునర్జన్మల గురించి నమ్మకం, కర్మ సిద్ధాంతం వుంది.
ఇండియన్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడం సులభం కాదట. ఒక వ్యక్తి జీవితం తను కోరినట్టు కాక, విధి నిర్ణయం మీద నడుస్తుందట. మానవుడు నిమిత్తమాత్రుడేనట.
ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని సీటుకు చేరగిలబడింది.
ఆమె ఆలోచనలన్నీ మళ్ళీ అతని చుట్టూరా తిరుగుతున్నాయి.
అతను కన్పిస్తాడా?
తనకు అతని అవసరం ఉందని, అతనికి ఈపాటికి తెలిసే వుంటుంది. తను అతన్ని గురించి ఆలోచిస్తే చాలు. అతడు వస్తాడు. అవును! వస్తాడు! అలాగే చెప్పాడుగా?
తన ఆలోచనలు అతనికెలా తెలుస్తున్నాయో?
నిజంగా అతను మనిషేనా? లేక.....

                                            * * *
హైదరాబాద్ దగ్గరవుతున్నకొద్దీ సీతకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలనిపించింది. కాని హారే సీరియస్ గా పేపర్లు చూస్తూ కూర్చున్నాడు. ఆమెకు అతన్ని ప్రశ్నించే ధైర్యం లేకపోయింది.
హైదరాబాద్ నిజాం నవాబు సంస్థానానికి రాజధాని. ఇండియాలో ఉన్న అన్ని సంస్థానాలలోకీ పెద్దది.
హైదరాబాద్ చెట్లతో, కొండలతో, హుసేన్ సాగర్ లో... సహజ వాతావరణంలో అందంగా నిర్మించబడిన చక్కని నగరం.
సీతకు కలకత్తాలో కన్పించిన జనానికి భిన్నంగా వున్న జనం కన్పించారు హైదరాబాదులో.
మొగల సామ్రాజ్య వాసనలు ఇంకా ఆ వాతావరణంలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. జనం అరబ్బీ దుస్తుల్లో పర్షియన్ దుస్తుల్లో, షే రాణిల్లో, చుడిదార్ పైజమాల్లో బురఖాల్లో తిరుగుతూ కన్పించారు. వాళ్ళను చూస్తుంటే సీతకు ఒక ప్లానెట్ నుంచి మరో ప్లానెట్ కు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది.
బ్రిటీష్ వాళ్ళతో సంధి కుదుర్చుకొని నిజాం తన సంస్థానాన్ని నిలుపుకొన్నాడు.
బ్రిటీష్ రెసిడెంట్ కు ఇక్కడ కేవలం ఒక ఎంబాసిడర్ హోదా మాత్రమే ఉన్నదని హారే సీతతో అన్నాడు. నిజాం సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చాయి. వాటినే సీడెడ్ ప్రాంతాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్స్) అంటారు.
బ్రిటిష్ రెసిడెంట్ ను చూసింది. మిస్టర్ జాన్ గ్రహాన్ కార్డరీ - ద రెసిడెంట్. బొద్దుగా తెల్లగా ఉన్నాడు. దర్జాగా ఉన్నాడు. అతనికి కూడా పెద్ద హోదా ఉన్నట్టే సీతకు అన్పించింది.
హైదరాబాద్ రెసిడెన్సీ చాలా పెద్దదిగా ఉన్నది. చాలా అందంగా, పరిశుభ్రంగా ఉన్నది.
మరొకసారి సీత పాలరాతితో కట్టిన ఇరవైరెండు మెట్లు చూసి మంత్రించినట్టు నిలబడిపోయింది. మెట్లకు రెండువైపులా రెండు బ్రహ్మాండమైన పాలరాతి ఫినిక్స్ (ఫేమస్ మాన్ స్టర్ ఇన్ ఈజిప్ట్), హానింగ్ ది ఫేమస్ ఆఫ్ ఎ వర్జిన్ అండ్ బడీ ఆఫ్ ఎ లయన్- అంటే. స్త్రీ ముఖంలో ఉన్న సింహాలు- దీన్ని ప్రాచీనకాలం ఈజిప్టువారు పొడుపు కథలు వేస్తే విప్పలేని వారిని చంపేసే రాక్షసిగా భావించేవారు) ఉన్నాయి.
మెట్లుదాటి పోర్టికోలో ప్రవేశిస్తే వరసగా ఆరు స్తంభాలు ఉన్నాయి. వాటిని దాటితే దర్బార్ హాలు కన్పిస్తుంది. అందంగా కట్టిన ఆ హాలు వినోద కార్యక్రమాల కోసం ఆ భవనం గురించి చెప్పాడు.
"1797లో ఇక్కడకు రెసిడెంటుగా మేజర్ జేమ్సు అబిలెస్ కిర్క్ పాటిల్ ఉండేవాడు. అతనే ఈ భవనం కట్టించాడు. అతను ఇక్కడ ఇద్దర్ని ప్రేమించాడు. ఆ ప్రేమ చిహ్నంగానే ఇది కట్టించాడు."
"ఆయన మొదటి ప్రియురాలు అద్వితీయ సౌందర్యవతి. ఆమెకు పాత రెసిడెట్స్ భవనం నివాసయోగ్యంగా అన్పించలేదు. ఆ అందాలరాణి కోసం ఓ అందమైన భవంతి కట్టించాలనుకున్నాడు" ఆగి ఆమె ముఖంలోకి చూశాడు సెక్రటరీ.
"అనుకోవడం ఏమిటి? కట్టించాడుగా? కుతూహలంగా అన్నది సీత.
"అతను చాలా తెలివైనవాడు. ఆ తెలివితేటలతోనే ఈ పని చెయ్యగలిగాడు. మరొకరైతే సాధ్యపడేది కాదు."
సీత మిస్టర్ బర్నేస్ ముఖంలోకి చూసింది ప్రశ్నార్థకంగా.
"భవంతి నిర్మించడానికి నిజాం నుండి 60 ఎకరాల స్థలం మూసి నదికి అవతల పొందవలసి ఉంది."
"మనం ప్రస్తుతం వున్న ప్రదేశమేనా?"
"అవును."
"తరువాత?"

 Previous Page Next Page