మా : మృత్యువును వరించడమా ?
ఇం : ఓహొ - అవును. మృత్యువును వరించటం నిజానికి మృత్యువులో సుఖంవుంది. మృత్యువును వరించినవారు ఎందరో సుఖపడ్డారు. భవిష్యత్తునంతా గతంలోనికి ఇమిడ్చి, ఎంత సుఖన్నో అనుభవించి వుంటారు. ఒకరోజు నేనూ, చావవలసినవాణ్ణే. ఇవ్వాళే ఎందుకు చేరకూడదు?
మా : అలా అనకు, నువ్వు బ్రహికివుండాలి.
ఇం : మనిషి బ్రతకాలంటే నమ్మకం కావాలి. భగవంతుని మీద నమ్మకం - అదృష్టంమీద నమ్మకం - పనిమీద నమ్మకం - మనిషిమీద నమ్మకం - తిరుగుబాటుమీద నమ్మకం - తనమీద నమ్మకం - ప్రేమమీద నమ్మకం - ఇందులో ఏ ఒక్క నమ్మకం - నాలో వుందో చెప్పగలవా ! మానసీ-
మా : జీవితంమీద నమ్మకంవుందిగా?
ఇం : జీవితం - పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం దొరక్క - చిన్న చిన్న ప్రశ్నలతో రాజీపడి బ్రతకటం -ఇదేగా జీవితం? మానవజీవితం ? - నేను కోటానుకోట్ల మానవుల్లో ఒకణ్ని. నా జీవితంలోని మిధ్య - కోట్ల జీవితాల మిధ్య.
మా : నీవు ఏం చేయాలనుకొంటున్నావు ? ఏం చేస్తావు?
ఇం : ఏం చేస్తానా? అలసి నిద్రపోతాను. నవ్వేసి తేలిగ్గా నిట్టరుస్తాను. అలా నవ్వేసి, వదలేయాటమే మంచిదిగా కనిపిస్తుంది. జీవితం హశ్యాస్పదమయింది. హసనాన్ని ఆపటం, నిరర్ధకం-
(ఇంద్రజిత్ ఆకస్మాత్తుగా అట్టహాసం చేస్తాడు. మానసి రచయిత పక్కలకు వెళ్ళిపోతారు. తెలియకుండా వాళ్ళు ముగ్గురూ గూడా అట్టహాసం చేస్తారు. రచయిత బాగా స్టేజీముందుకు వస్తాడు. రెండు చేతులూ ఎత్తి ప్రేక్షకులను, వాళ్ళు నవ్వుతున్నట్లు నవ్వు ఆపటానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తాడు. అమల్ - విమల్ - కమల్ - వెళ్ళిపోతారు. వారినవ్వూ క్రమంగా తగ్గిపోతుంది.)
రచ : అలా నవ్వకండి. మీకు నమస్కారం చేస్తాను. కాస్త ఆ నవ్వు ఆపండి. నిజమే-నాటకం- రాయటం నావల్ల అవటంలేదు. మీరు చూస్తూనే వున్నారుగా నేను ఎంత ప్రయత్నిస్తున్నానో?
అమల్ , విమల్ , కమల్ వాళ్ళ నాటకం ఇంద్రజిత్.
(పిన్ని ప్రవేశిస్తుంది)
పిన్ని : భోజనానికిరావా?
రచ :రాను.
(పిన్ని వెళ్ళిపోతుంది. మానసి ప్రవేశిస్తుంది.)
మా : భోజనం చెయ్యవా ?
రచ : (రెండు చేతులతో ముఖాన్ని దాచుకొంటూ) నువ్వు కూడా....?
మా : పోరాపాటయింది రాస్తున్నావా?
రచ " ఎలా రాయను? ఇంద్రజిత్ తిరిగి రాడు. మూడు సంవత్సరాల్లో మూడు ఉత్తరాలు రాశాడు.మూటిలోను ఒకటే ధోరణి...
మా : ఏమిటి?-
రచ : ఏముంది. తిరుగుతున్నాడు. చక్రంలా తిరుగుతూనే వున్నాడు. చావటంలేదు. రకరకాల స్వప్నాలు బుర్రలో తిరుగుతున్నాయి. కాని, చావురాదు. జీవితాన్ని దాని అసలు రూపంలో చూసేవాణ్ని. జేవితాన్ని స్వప్నంలా తలచేవాణ్ని గురించి ఏ నాటకం వ్రాయను.
మా : అలాంటివాణ్ని గురించే నాటకం రాయాలి?
రచ : లాభంలేదు. ఎన్నిసార్లు అతణ్ని సంఘటనా చక్రంలో ఇరికించటానికి ప్రయత్నించానో అన్నిసార్లూ - అతను ఆ చక్రం బయటకెళ్ళి పడుతూనే వున్నాడు. ఇది వాస్తవంకాదు అంటాడు. అతనిచేత ఎన్నో చెప్పించాలని ప్రయత్నిస్తాను. ప్రతిసారి - సంభాషణ పరిధిని దాటి వెళ్ళిపోతాడు. ఇది వాస్తవం కాదు అంటాడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అవసరమైన దానికంటే ఎక్కువగా తెలుసుకొన్నాడు.
మా : అయినా అతను కలలు కనటం మానలేదు.
రచ : కలలు ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోతాయిగా.
మా : అవును, అదినాకూ - తెలుసు.
రచ : అలాంటప్పుడు.
మా : కరగిపోనియ్.
రచ : ఆ, తర్వాత ?
మా : ప్రవాహాన్ని దాటటానికి, స్వప్నాల ఆధారం వుండదుగా?
రచ : లేకపోతే మునిగిపోతాడు.
మా : మునిగిపోతే పోనియ్. అప్పుడైనా భవిష్యత్ ఆధారం దోరుకుతుంది. అక్కణ్ణుంచే జీవితం ప్రారంభం కావచ్చును.
రచ : ఇదంతా నీకు ఎలా తెలుసు ?
మా : ఎలా తెలిసిందా ?ఏమిటి తెలిసింది? నాకు ఏమీ తెలియదు. నేను ఒక మూర్ఖురాలిని. నాకు తెలిసిందంతా - నమ్మటం మాత్రమే.
(మానసి వెళ్ళిపోతుంది.)
రచ : నమ్మకం ! పాతాళంమీద నమ్మకం.
(ఇంద్ర ప్రవేశిస్తాడు.)
ఇం : (కవిత)-
ఆస్తికత్వపు, బలహీనతలో ఈదుతున్నాను.
జీవిత భారాన్ని తృణంమీద వేసి ఈదుతున్నాను.
పొగమంచు నిట్టూర్పుల్లో-
వాక్కున్నాయి. తీరాలు రెండూ
ఈ ప్రవాసంలో తెలుసుకున్నాను.
ఒక తథ్యాన్ని-
మేఘాలమాటున కన్పించే
స్వర్ణ సామ్రాజ్యం.
నక్షత్రమాలికల్లో
తేలిపోతున్నా స్వర్ణపూచాయ
అన్నీ మిధ్యేవని తెలుసుకున్నాను.
నిన్ను నేను కోరేది ఒక్కటే.
మిధ్యావచనాలతో
నమ్మించకు ఈ లోకాన్ని
పరంపరాగతంగా వస్తున్న
ఆస్ధ ! విశ్వాసాలను తొలగించు
నీ మనః పటలంనుండి-
(స్వయంగా మునిగి చూడు భూమి ఎంత లోతుగా వుందో)
మానవుడు క్రియా శీలుడు.
మునిగికూడా తప్పిపోడు.
అధికారాన్ని హస్తగతం చేసుకోటానికి
వెనుకాడడు వెళ్ళడానికి
పాతాళానికైనా-
రచ : ఇంద్రజిత్ !
ఇం : ఏమిటి ?
రచ : నువ్వు తిరిగి వచ్చావా?
ఇం : అవును.
రచ : ఎప్పుడు వచ్చావ్ ?