Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 19


    ఇం : చాలాకాలం అయింది.
    రచ : ఇంతకాలం ఎక్కడున్నావ్ ?
    ఇం : కలకత్తాలో -
    రచ : ఏం చేస్తున్నావ్ ?
    ఇం : ఉద్యోగం.
    రచ : వివాహం చేసుకున్నావా?
    ఇం : చేసుకున్నాను.
    రచ : అంటే చివరకు, మానసి ఈ వివాహానికి ఒప్పుకుందన్న మాట.
    ఇం : లేదు.
    రచ : ఆఁ.
    ఇం : మరొక అమ్మాయిని చేసుకున్నాను.
    రచ : మరొక అమ్మాయినా ?
    ఇం : అవును.
    రచ : ఆమె ఎవరు ?
    ఇం : ఒక స్త్రీ.
    రచ : పేరు ?
    ఇం : మానసి.
    రచ : అదెలా సంభవం ?
    ఇం : ఈ ప్రపంచంలో సంవంకానిది ఏదీ లేదు. ఎంత మంది మానసీలు వస్తున్నారో వెళుతున్నారో. అందులో ఒక మానసితో వివాహం జరుగుతుంది.
    మానసి. సోదరి మానసి - మానసి స్నేహితురాలు
    మానసి- మానసి కూతురు మానసి.
    రచ : అమల్, విమల్ , కమల్ లాగా!
    ఇం : అవును. అమల్ , విమల్, కమల్, ఏవం ఇంద్రజిత్.
    (మానసి ప్రవేశిస్తుంది. తలమీద ముసుగు వుంటుంది)
    రా ! రా  పరిచయం చేస్తాను. ఈమె నా భార్య. మానసి. (మానసితో) ఇతను నా స్నేహితుడు రచయిత.
    రచ : నమస్కారం.
    మా : నమస్కారం. మీరు ఏం రాస్తుంటారు?
    రచ : ఎప్పుడు ఏం  రాయాలనిపిస్తే అది.
    మా : ప్రస్తుతం ఏం రాస్తున్నారు?
    రచ : ఒక నాటకం. రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను.
    మా : నాకు వినిపిస్తారా?
    రచ : తప్పకుండా ముందు కానివ్వండి.
    మా : ఇంకా  ఎంత రాయాలి?
    రచ : ఎంతో లేదు. ఇవ్వాళో, రేపో ప్రారంభిస్తాను.
    మా : ఇంకా ప్రారంభించలేదా?
    రచ : ఎక్కడా ? కుదరటం లేదు.
    మా : ఇప్పుడేగా  అన్నారు. పూర్తి గావటానికి ఎంతో లేదని?
    రచ : ఈ నాటకం ప్రారంభానికీ, ముగింపుకు అట్టే తేడా వుండదు. వృత్తాకారంగా వుంటుంది.
    మా : మీ మాటలు నాకు  అర్ధం కావటంలేదు.
    ఇం :  ఎలా అర్ధం అవుతాయి మానసీ - మాట్లాడేది అర్ధం కావాలని కాదుగా?
    మా : బలే ! ఇతర్లకు అర్ధం కావలెననేగా మాట్లాడేది.
    ఇంద్ర : అది  ఒక్కప్పటి సంగతి. ఇప్పుడు మాట్లాట్టం అలవాటయింది కనుక మాట్లాడుతున్నాం.
    మానసి : ఇక ఆపండి. అర్ధంలేని మాటలు.
    ఇంద్ర : నేనంటూందీ - అదేగా ?
    (అమల్ , విమల్ , కమల్ , ప్రవేశిస్తారు. స్టేజీకి రెండో వైపుగా నిలుచుని మాట్లాడుతూ వుంటారు)
    మానసి : వాళ్ళంతా ఎవరూ?
    రచ : అమల్ - విమల్ - కమల్ .
    అమల్ : ధనతంత్రం -రాజతంత్రం-గణతంత్రం.
    విమల్ : సామాజ్య్రవాదం -నాజీవాదం- మార్క్సువాదం.
    కమల్ : ఆర్ధికశాస్త్రం - టెండర్ -స్టేట్ మెంటు.
    విమల్ :రిపోర్టు-మినిట్సు-బడ్జటు.
    కమల్ : మీటింగ్ - కమిటీ - కాన్పరెన్సు.
    అమల్ : సభ్యత - విద్య - సంస్కృతి.
    విమల్ : సాహిత్యం - వేదాంతం- చరిత్ర.
    కమల్ : బహ్మ - నిర్మాణం - భూమి.
    అమల్ : రాజ్ కపూర్ - మాలాసిన్హా - బిస్వజిత్.
    విమల్ : ఉమ్రీగర్ - కృష్టన్ - మిల్కాసింగ్.
    కమల్ : హేమంతకుకుమార్ - S.D బర్మన్ - లతామంగేష్కర్.
    అమల్ : డాక్టర్ - హొమియోపథి - కవికుమారు.
    విమల్ : ట్రాం - బస్ - ట్రైన్.
    కమల్ : సున్నితం - చెత్తా - దోమలు.
    అమల్ : కూతురు -కొడుకు - భార్య.
    విమల్ : మాస్టరు - డ్రైవరు - నంటవాడు.
    కమల్ : మరదలు - మేనల్లుడు - మామ.
    మానసి :  వాళ్ళంతా ఏమిటి అంటున్నారు?
    ఇంద్ర : మాట్లాడుతున్నారు.
    (అమల్ , విమల్ , కమల్ చేతులు వూపుతూ మాటలు వినిపించకుండా మాట్లాడుతూవుంటారు.)
    మానసి : ఏమాటలు ?
    ఇంద్ర : నాకూ తెలియలేదు. కవిగార్ని అడిగిచూడు.
    మానసి : (రచయితతో ) ఇంతకంటే మాట్లాట్టానికి వేరే మాటలే లేవా?
    రచ : ఉండే వుండాలి. తప్పకవుండాలి.
    (ముందుకొచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు.)
    ఇంతకంటే మాట్లాట్టానికి ఏమీలేదా?
    (ప్రేక్షకులు మౌనం) లేదా? (మళ్ళీ మౌనం)
    నేను ఎవర్ని  గురించి నాటకం రాయాలి?
    ఈ మాటల్ని తీసుకొనా? ఇలాంటి నాటకంలో వేషం ఎవరేస్తారు?
    (ఇంద్ర , మానసి వెళ్ళబోతారు.)
    ఇంద్రజిత్ ! వెళ్ళవద్దు.
    (మానసి వెళ్ళిపోతుంది. ఇంద్రజిత్ తిరిగోస్తాడు.)
    రచ : ముందు చెప్పివెళ్ళు !
    ఇంద్ర : ఏం చెప్పాలి ?
    రచ : మానసి  ఎక్కడవుంది ?
    ఇంద్ర : ఇప్పుడేగా  ఇక్కడనుంచి వెళ్ళింది ?
    రచ : ఈ మానసికాదు. నిజామాబాద్ లో వుంటూవుండేది ఆ మనసి. ఆమె ఎక్కడుంది?
    ఇంద్ర : నిజామాబాద్ లో వుంది.
    రచ : ఆమెకు ఉత్తరాలు రాయటంలేదా?
    ఇంద్ర : రాస్తూనే వుంటా !
    రచ : ఆమెను కలుస్తూ వుంటావా?
    ఇంద్ర : అప్పడప్పుడు.
    రచ : ఎక్కడ?
    ఇంద్ర : ఆ మైదానంలోనే - ఆ చెట్టుక్రిందే !
    రచ : మాట్లాడుతూవుంటావా ?
    ఇంద్ర : మాట్లాడతాను.
    రచ : ఏం మాట్లాడతావు ?
    ఇంద్ర : ఇంతకాలం ఏం మాట్లాడేవాణ్ణో అవే మాటలు. ఆమె గురించి....నా గురించి...
    రచ : ఆ మాటలు కూడా అమల్ , విమల్ , కమల్  మాట్లాడుకొనే మాటల్లాగే వుంటాయా?
    (ఇంద్ర జావాబివ్వడు.)   

 Previous Page Next Page