మహిళల్లో పొట్ట మీద పాశుపతాస్త్రం ఇదిగో….
మహిళల్లో పొట్ట మీద పాశుపతాస్త్రం ఇదిగో….
అమ్మాయిలు మొదటే అందంగా ఉంటారు. అందంగా కనబడలేదనుకో అందం కోసం బోలెడు కసరత్తులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే అతిలోక సుందరి శ్రీదేవిలా కనబడాలని డైటింగ్ చేస్తారు, వ్యాయామాలు చేస్తారు కనిపించిన ప్రతీది ఫాలో అవుతారు, సైజ్ జీరో సినిమాలో అనుష్కలా అడ్డమైన ప్రయోగాల్లోకి దిగుతారు. ఇదంతా కేవలం ఒక దశలో మాత్రమే... అంటే చాలా మంది ఆడవారికి పెళ్ళయ్యేవరకు ఉండే ఆసక్తి, శారీరక స్పృహ పెళ్ళి తరువాత ఉండవు. మరీ ముఖ్యంగా పిల్లలు పుడితే వారి శరీరం మీద వారికి శ్రద్ద చాలా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా ఎలాంటి వారికి అయినా పొట్ట దగ్గర కొవ్వు చాలా తొందరగా పేరుకు పోతుంది. పొట్ట దగ్గర కొవ్వు లేకుండా కడుపు ఫ్లాట్ గా ఉండటం ఎంతో మంది కల అయిపోయింది ఇప్పట్లో…. అయితే పొట్ట దగ్గర కొవ్వు ఉన్నా దాన్ని కరించడానికి ఎంచుకునే మార్గాలే సరిగా ఉండటం లేదు. కొందరికి అయితే అసలు ఓపిక ఉండదు. కానీ ఓపిక కావాలి, ఖచ్చితమైన మార్గం తెలియాలి పొట్టను ఫ్లాట్ గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు.
పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కరిగించడానికి ఫిట్నెస్ మంత్రం వేయాలి. అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఒక్క వ్యాయామం చేస్తే చాలు. పొట్ట మీద పాశుపతాస్త్రం లా పని చేసేది బ్యాలెన్సింగ్ ప్లాంక్. దీన్ని ఎలా చేయాలంటే….
●మొదట బోర్లా పడుకోవాలి. ఇప్పుడు అరచేతులు, పాదాల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి. ఇప్పుడు శరీరం పుషప్స్ తీసేటప్పుడు శరీరం ఎలాంటి భంగిమలో ఉంటుందో అలా ఉంటుంది. దీనినే ప్లాంక్ అని అంటారు.
● ఈ భంగిమలో నుండి మెల్లగా కుడి చెయ్యి, ఎడమ కాలు రెండూ పైకి లేపి నేరుగా చాపాలి. ఈ భంగిమలో 30 సెకెన్లు ఉండాలి. కావాలంటే నంబర్లు లెక్కపెట్టుకోవచ్చు.
● నేల మీద ఆనించి ఉన్న ఇంకొక కాలు, చెయ్యి మీద శరీర బరువును మోపాలి. అంటే పైకి చాపిన వాటి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా అలా ఫ్రీ గా చాపి ఉంచాలి.
● అలా చేసిన తరువాత మళ్ళీ కాలు, చెయ్యి మార్చుకోవాలి. ఈసారి ఎడమ చెయ్యి, కుడి కాలు పైకి లేపి నిటారుగా చాపి 30 సెకెన్లు ఉండాలి.
ఈ విధంగా మార్చుకుంటూ 5 సెట్లు చేయాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా దీన్ని ఫాలో అయితే అమ్మాయిలు ఇబ్బంది పడే పొట్ట సమస్య మంత్రమేసినట్టు తగ్గిపోతుంది. అయితే ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు డైట్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. శరీరానికి పోషకాలు అందిస్తూనే కొవ్వులు చేరిపోకుండా జాగ్రత్త పడాలి. ఇవి రెండూ ఖచ్చితంగా ఉంటే సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది.
◆ నిశ్శబ్ద.