మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త!!
మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త!!
పెరుగుతున్న వయస్సుతో పాటు మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు.అవి ఏమిటి అన్న విషయాలు చూద్దాం.మహిళలు లేదా యుక్త వయస్సులో ఉన్న బాలికలు వివిదరకాల అనారోగ్య సమస్యలు మొదలు అవుతాయి.అందులో ముఖ్యంగా నెలసరి సమస్యలు, ప్రెగ్నెన్సీ వంటివి వస్తూ ఉంటాయి. అందుకు ముఖ్యంగా ఆడపిల్లలు పెరుగు తున్న కొద్దీ బాల్యం, కౌమారం దసలు దాటి యవ్వనం లోకి అడుగు పెట్టగానే శరీరంలో వచ్చే మార్పులు వస్తూ ఉంటాయి.అందుకే వారు ఎదుర్కునే సమస్యల నుండి పోరాడేందుకు వారి ఆహార వ్యవహారాలు,జీవన శైలి లో ఆరోగ్యంగా ఉండడం అవసరం.అంటున్నారు నిపుణులు. అందరు మహిళల శరీర తత్వం ఒకే రకం గా ఉండదు. వేరు వేరు గా ఉంటుంది. ఎదో ఒకరకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. డాక్టర్ను సంప్రదించడం అవసరం. కళ్ళు మూసుకుని గుడ్డిగా అనుసరించడం అయితే కొన్ని అంశాల పై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తునారు.
నెలసరి సమస్యల పై సమాచారం తెలుసుకోండి...
సరైన సమయం లో సుఖవంత మైన పీరియడ్స్ వస్తేనే ఆరోగ్యసంబంధమైన చాలా సమస్యల కు దూరం చేస్తాయి. దీనిని గమనించడం అత్యవసరం.మీనేలసరి చక్రం ఎన్నిరోజులకు వస్తోంది. ఒక్కసారిగా ఏమైనా మార్పులు వచ్చాయా? ఈ అం శాల పై దృష్టి పెట్టాలి అప్రమత్తం ఉండాలి. ఎదో రకమైన మార్పు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ ను సంప్రదించండి.
సరైన సమయం లో కుటుంబ నియంత్రణ...
మహిళల వయస్సు ౩౦ సంవత్సరాలు వచ్చే నాటికీ వారిలో శక్తి తగ్గిపోతుంది. 4౦ సంవత్సరాలు దాట గానే పూర్తిగా బలహీన పడతారు.ఈ మధ్య కాలం లో ప్రసవం విజయవంత మై నప్పటికీ అది సరైన సమయం కాదు. స్త్రీలు గర్భిణీ లుగా ఉన్నప్పుడు వారి శరీర పరిస్థితి ని చూసి అర్ధం చేసుకుంటారు. సరైన సమయం లో నే ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.
యోని సంబంధిత ఇంఫెక్షన్ల పై అప్రమత్తం గా ఉండాలి...
యోని సంబంధిత ఇన్ఫెక్షన్ల పై అప్రమత్తం గా ఉండాలి. ఇది మీకు తెలుసా చాలా రకాల ఇంఫెక్షన్ల లక్షణాలు చాలా తక్కువే క్లేమా డా డియా,గనేరియా, లాంటి ఇన్ఫెక్షన్లు స్పష్టంగా ఉండక పోవచ్చు. మూత్ర విసర్జన తో పాటు నొప్పి ,వేజైనల్ డిస్చార్జ్ ,నేలసరిలో అధిక ఋతుస్రావం,జరుగుతూ ఉంటుంది. మీరు వివాహిత కానట్లయితే గర్భ నిరోధక మాత్రలు లేదా ఇతర సాధనాలు వాడినా పరీక్షలు చేయించడం ఇదీ కాక హెచ్ బి వి సంబంధిత ఇన్ఫెక్షన్లు సర్వైకల్ రోగాలకు సంబందించిన సమస్యలు ఉంది ఉండవచ్చు.మీరు ప్రతి ఏటా పాప్సి మియర్ చేయించడం మానకండి. వాటిని కొనసాగించండి. తద్వారా అనారోగ్య సమస్య నుండి బయట పదండి.