గుప్త నవరాత్రులు.. అమ్మవారి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే!

 

గుప్త నవరాత్రులు.. అమ్మవారి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే!

ఆషాడ మాసం ప్రారంభం నుండి  గుప్త నవరాత్రులు మొదలవుతాయి. ఆషాడ మాసంలో చేసుకునే ఈ గుప్తనవరాత్రులలో వారాహీ అమ్మని పూజిస్తారు. లలితాదేవి సైన్యాధ్యక్షురాలే వారాహీ అమ్మ. జీవితంలో దిక్కుతోచని స్థితిలో  ఉన్నప్పుడు, ఎటువైపు అడుగేయాలో అర్థం కానప్పుడు,  ఎంత కష్టపడినా విజయం  దక్కకపోయినప్పుడు,  అన్నివైపుల నుండి  అడ్డంకులు, ఇబ్బందులు  ఎదురైనప్పుడు మనిషికి బలాన్ని,  ఆత్మవిశ్వాసాన్ని, ముందువెళ్లే మనోబలాన్ని ఇవ్వగలిగేది దైవమే. ఇలాంటి పరిస్థితులలో ఉన్నవారికి వారాహీ నవరాత్రులు గొప్ప వరం అని  చెప్పవచ్చు.  ఇది కేవలం అమ్మవారిని పూజించే పండుగ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక సాధన , తాంత్రిక శక్తులన మేల్కొల్పడానికి ఒక అవకాశంగా కూడా పరిగణిస్తారు. తంత్ర శాస్త్రంలో వివరించబడిన దశ మహావిద్యల సాధన వారాహీ నవరాత్రులలో ఎంతో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ గుప్త నవరాత్రులలో ఏ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది?  తెలుసుకుంటే..

 మేషరాశి..

మేష రాశి వారు గుప్త నవరాత్రుల సమయంలో కాళీ దేవికి ప్రత్యేక పూజలు చేయాలి. అమ్మవారికి ఎర్రటి పువ్వులను సమర్పించి, భక్తిశ్రద్ధలతో "ఓం క్రీం కాళికాయ నమః" మంత్రాన్ని జపించాలి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
 
వృషభ..

వృషభ రాశి వారికి ఇది ఆధ్యాత్మిక సాధనకు చాలా మంచి సమయం. అమ్మవారికి కొబ్బరికాయను సమర్పిస్తూ "ఓం హ్రీం ఛిన్నమస్తాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తూ,  కోరికలు నెరవేరాలని ప్రార్థించాలి.

మిథునం..

మిథున రాశి వారు 'ఓం ధుం ధుమావత్యై స్వాహా' అనే మంత్రాన్ని జపించి, అమ్మవారికి ఎర్ర కండువాను సమర్పించాలి. దీనివల్ల జీవితంలోని ఆటంకాలు తగ్గుతాయట.

కర్కాటక..

కర్కాటక రాశి వారు "ఓం శ్రీం కమలాయై నమః" అనే మంత్రాన్ని జపించి, అమ్మవారికి ఎండు ఫలాలు, పటిక బెల్లం లేదా తామర గింజల పాయసాన్ని సమర్పించాలి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.

సింహ రాశి..

"ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపురసుందరే నమః" అనే మంత్రాన్ని జపించడం సింహరాశి వారికి శుభప్రదం . అమ్మవారికి కుంకుమ మరియు కండువా సమర్పించడం వల్ల  ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

కన్యారాశి..

కన్యారాశి వారు అమ్మవారికి ఆకుపచ్చ చీర లేదా రవికను సమర్పించి, "ఓం హ్రీం స్త్రీం హుం ఫట్" అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం అదృష్టాన్ని , విజయాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని చెబుతారు.

తులరాశి..

తులారాశి వారు అమ్మవారికి తీపి పదార్థాలు సమర్పించి 'ఓం హ్రీం భువనేశ్వర్యై నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఇది మానసిక శాంతిని, సమతుల్యతను కాపాడుతుంది.

వృశ్చికరాశి..

వృశ్చిక రాశి వారు ఎండు ఫలాలు, కొబ్బరికాయతో నింపిన ఎర్ర రవిక గుడ్డను అమ్మవారికి సమర్పించాలి. "ఓం హ్రీం భైరవ్యై నమః" అనే మంత్రాన్ని జపించడం వల్ల ధైర్యం, బలం పెరుగుతాయి.

ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారు అమ్మవారికి పసుపు పువ్వులు , శనగపిండి లడ్డూలను సమర్పించాలి. "ఓం హ్రీం శ్రీం మాతాంగ్యే నమః" అనే మంత్రాన్ని జపించడం అదృష్టాన్ని తెస్తుంది.

మకరరాశి..

మకర రాశి వారు 'ఓం హ్రీం బగలాముఖ్యై నమః' అనే మంత్రాన్ని జపించి, అమ్మవారికి సుగంధ పుష్పాలు , గాజులను సమర్పించాలి, ఇది శత్రు అడ్డంకిని శాంతింపజేస్తుంది.

కుంభం..

కుంభ రాశి వారు తొమ్మిది రోజుల పాటు దుర్గా చాలీసా పఠించి, తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది సానుకూల శక్తిని నిలుపుకోవడానికి సహాయపడుతుందట.

మీనరాశి..

మీన రాశి వారు ప్రతిరోజూ విరగని దీపాన్ని వెలిగించి దుర్గాదేవి మంత్రాలను జపించాలి. దేవతకు పసుపు ముద్దను సమర్పించి, సంపద , శ్రేయస్సు వృద్ధి కోసం దానిని తరువాతి కాలం కోసం భద్రంగా ఉంచుకోవాలట.


గమనిక.. పైన పేర్కొన్న విషయాలు పండితులు వివిధ సందర్బాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు.

                              *రూపశ్రీ.