వాస్తులో ఎటువైపు ఎంత స్థలం వదలాలి? (Vastu and Open Place)

 

వాస్తులో ఎటువైపు ఎంత స్థలం వదలాలి?

(Vastu and Open Place)

 

జనాభా ఎక్కువై పోవడంతో అపార్టుమెంట్లు ఎక్కువై ఇండివిడ్యువల్ హౌజులు తగ్గిపోయాయి. ప్రైవేట్ ఇళ్ళలో కూడా వాస్తుబద్ధమైన ఇళ్ళు కరువయ్యాయి. వాస్తు గురించి అవగాహన లేక, వాస్తు సూత్రాలను పాటించని వారు కొందరైతే, స్థలాభావం కారణంగా వాస్తును అనుసరించలేక పోయేవారు ఇంకొందరు.

కారణం ఏదయితేనేం, వాస్తును అమలుపరచాకపోతే, ఆ దుష్ఫలితాలను అనుభవించక తప్పదు.

కనుక వాస్తు సూత్రాలను అమలుపరచాలి.

వాస్తులో ఏ గది ఎటువైపు ఉండాలి అనేది మాత్రమే కాదు, ఇంటికి ఎటువైపు రోడ్డు ఉంది అనేదాన్నిబట్టి కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

తూర్పు , ఉత్తర దిక్కుల్లో ఖాళీ స్థలం వదిలేసి, ఇంటిని నిర్మించి నట్లయితే, ఇంటికి ఎటువైపు రోడ్డు వచ్చినా చెడు ఉండదు. ఈ రెండు దిక్కుల్లో ఎంత ఖాళీ స్థలం వదలాలి అంటే.. కనీసం 20 అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి.

తూర్పు, ఉత్తర దిక్కుల్లో కొంత ఖాళీ స్థలమే వదిలినప్పుడు ఇంటికి తూర్పు, ఉత్తరాల్లో రోడ్లు వచ్చినా పరవాలేదు.

తూర్పు, ఉత్తర దిక్కుల్లో కొంత ఖాళీ స్థలమే వదిలినప్పుడు పశ్చిమ, దక్షిణ దిక్కుల్లో రోడ్డు ఉంటే దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

కేవలం 30 గజాల స్థలంలో కూడా ఇళ్ళు నిర్మిస్తున్న నేపథ్యంలో వాస్తు సూత్రాలు ఎంతవరకూ అమలవుతాయి? ఇంత ఇరుకైన స్థలాలు అసలు గృహ నిర్మాణానికే అనుకూలం కాదు.