ఈ లక్షణాలున్న స్త్రీల ఇంటికి కుబేరుడే స్వయంగా వస్తాడట..!
ఈ లక్షణాలున్న స్త్రీల ఇంటికి కుబేరుడే స్వయంగా వస్తాడట..!
భారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి, శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం, విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు, మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది. ఎందుకంటే స్త్రీలు మొత్తం కుటుంబానికి కేంద్రబిందువు లాంటి వారు. గరుడ పురాణం కొన్ని ప్రత్యేక లక్షణాలను వివరిస్తుంది. ఆ లక్షణాలు స్త్రీకి ఉంటే, ఆమె భర్త, అత్తమామలకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందట. అలాగే ఆ లక్షణాలు ఉన్న స్ట్రీ ఇంటికి స్వయానా కుబేరుడే విచ్చేస్తాడట. ఇంతకీ గరుడ పురాణం చెప్పిన ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
పరిశుభ్రత..
గరుడ పురాణం ప్రకారం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉన్న ఇంట్లో పేదరికం ప్రవేశించదట. తన ఇంటిని చక్కగా ఉంచుకునే ఇల్లాలు, అలాగే తాను కూడా చక్కగా, పరిశుభ్రతతో ఉండే స్త్రీ లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే.. చిందరవందరగా, గజిబిజిగా ఉన్న ఇళ్లకు లక్ష్మీదేవి దీవెనలు దక్కవు.
ఆతిథ్యం..
భారతీయ సంప్రదాయంలో "అతిథి దేవో భవ" అనే సూత్రం చాలా ముఖ్యమైనది. తన ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను, పెద్దలను గౌరవించే భార్య కుటుంబ ప్రతిష్టను పెంచుతుంది. నిస్వార్థ సేవ సామాజిక గౌరవాన్ని పెంచడమే కాకుండా ఇంట్లోకి సానుకూల శక్తిని కూడా నింపుతుంది.
తృప్తి..
తెలివైన భార్య అంటే పరిస్థితులను అర్థం చేసుకునేది. పరిమిత వనరులు లేదా ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని సంతృప్తిగా, సంతోషంగా ఎలా ఉంచుకోవాలో తెలిసిన స్త్రీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు తలెత్తనివ్వదని గరుడ పురాణం చెబుతుంది. అలాంటి మహిళలు కష్ట సమయాల్లో కుటుంబానికి గొప్ప మద్దతుగా నిలుస్తారు. సరైన ఆర్థిక నిర్వహణ ద్వారా ఇంటి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తారు.
ప్రవర్తన..
వైవాహిక జీవితం విజయం భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎంత సంతోషంగా ఉంటారనే విషయంపై ఆధారపడి ఉంటుంది. భర్త మాటలను గౌరవించి, ఇంట్లో మంచిగా మాట్లాడే భార్యను సద్గుణవంతురాలిగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారం కూడా ఉండాలి. భార్య ఇంటికి మహాలక్ష్మీ కావాలంటే.. మొదట ఆ మహాలక్ష్మిని గౌరవించాలి. అప్పుడే ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇద్దరూ ఒక్కమాట మీద ఉంటారు. అలాంటి చోట ప్రేమ కూడా ఉంటుంది. ఇంటి వాతావరణం స్వర్గంలా మారుతుంది.
*రూపశ్రీ.