ఈ చిన్న చిన్న తప్పులే పేదరికానికి కారణం అవుతాయి!

 

ఈ చిన్న చిన్న తప్పులే పేదరికానికి కారణం అవుతాయి!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన ప్రతిదీ మన జీవితంలో శుభ లేదా అశుభకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఏ వస్తువులు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కలిగిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఈరోజుల్లో జ్యోతిష్యాన్ని నమ్మేవారు వాస్తును నమ్ముతున్నారు. ఏ పని మొదలు పెట్టినా వాస్తును ఫాలో అవుతున్నారు. ఇల్లు కట్టడం మొదలుకుని..ఇంట్లో చెప్పుల స్టాండు వరకు ప్రతీది వాస్తు ప్రకారమే చేస్తున్నారు. అయితే తెలియక చేసే కొన్ని తప్పిదాలు వాస్తు దోషానికి దారి తీస్తాయి. చాలా మంది ఇళ్లలో పనికిరాని వస్తువులను అలాగే ఉంచుతుంటారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అవి ఎప్పటికీ తీరవు. ఒకదాని వెనక మరొకటి అవరోధం మనస్సును అశాంతి, నిరాశతో నింపుతాయి. అలాంటప్పుడు ఇంటి వాస్తుపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటి వంటగది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితికి సంబంధించినది. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.

ఇంట్లో అగరబత్తిని వెలిగించడం ద్వారా గదుల నుండి ప్రతికూల శక్తిని తొలగించవచ్చు . వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. వాస్తు ప్రకారం, కిటికీలు లేదా తలుపులపై సెలెనైట్ రాళ్లను ఉంచడం వల్ల ఇంట్లో బయటి నుండి వచ్చే ప్రతికూల శక్తిని ఆపుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లో అనవసరమైన వస్తువులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. కాబట్టి, ఇంట్లో ఉంచిన ఉపయోగించని వస్తువులను తొలగించడం మంచిది. ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదం. ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని అంటారు. వాస్తు ప్రకారం, ఈశాన్య కోణం నుండి బరువైన వస్తువులను తొలగించండం మంచిది. అదేవిధంగా ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు, జంక్ వస్తువులను తొలగించాలి. తుప్పు పట్టిన పదార్థాలు ప్రతికూల శక్తిని వేగంగా ఆకర్షిస్తాయి.ఆగిపోయిన గడియారం , విరిగిన పాత్ర మొదలైనవి ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసివేయండి. ఎందుకంటే... వాస్తు ప్రకారం, ఆగిపోయిన  గడియారం లేదా ఇంట్లో ఉంచిన విరిగిన పాత్రలు ఇంటికి ఆర్థిక సమస్య లేదా పేదరికాన్ని తెస్తాయి.