ఈశాన్యం మూల గొయ్యి ఉంటే? (Vastu – Dig in Eesanyam)

 

ఈశాన్యం మూల గొయ్యి ఉంటే?

(Vastu – Dig in Eesanyam)

 

ఇంటి లోపల గానీ, బయటగానీ ఈశాన్యంలో గుంటలు, గోతులు ఉండకూడదు. మామూలు గొయ్యే కాదు, నీళ్ళ సంపు, బావి లాంటివి కూడా ఉండకూడదు. ఈశాన్యంలో గనుక గుంట లేదా గొయ్యి ఉన్నట్లయితే అది పెద్ద వాస్తు దోషం కిందికి వస్తుంది.

 

ఈశాన్యంలో గొయ్యి ఉంటే ఏర్పడే దుష్పరిణామాలు

అలాంటి ఇంట్లో లేనిపోని అనుమానాలు, భయాందోళనలు చోటు చేసుకుంటాయి.

కుటుంబసభ్యులకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంది.

వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురౌతాయి. ప్రమోషన్లు ఆగిపోతాయి. ఏ రకమైన అభివృద్ధి ఉండదు.

పిల్లలకు ఊహించని కష్టనష్టాలు వస్తుంటాయి.