Read more!

వాస్తులో ఎన్ని ద్వారాలు ఉండాలి?

 

వాస్తులో ఎన్ని ద్వారాలు ఉండాలి?

(Vastu and Doors)

 

గుడిలో దేవతా ప్రతిమ ఉంటేనే, ఆ దేవాలయానికి పవిత్రత వస్తుంది. విశిష్టత చేకూరుతుంది. అలాగే ఇంటికి వాస్తు సూత్రాలు ఉన్నప్పుడే ఆ ఇల్లు సుఖసంతోషాలకు నిలయం అవుతుంది. వాస్తు ప్రకారం ఉన్న ఇల్లు వాసయోగ్యమై, ఆనందంగా జీవించే వీలు కలుగుతుంది.

ఇప్పుడు వాస్తులో ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎలా ఉండాలి అనే అంశాలను తెలుసుకుందాం.

వాస్తులో కిటికీలు, ద్వారాలూ సరి సంఖ్యలో ఉండాలి అనేది నియమం.

ఒక ద్వారం ఎదురుగా మరో గది ద్వారం వచ్చేట్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ద్వారాలు ఎదురెదురుగా ఉండాలి.

ద్వారాలు సరిసంఖ్యలోనే ఉండాలి. అయితే పది, ఇరవై లాంటి చివర సున్నా ఉండే సంఖ్యల్లో ద్వారాలు ఉండకూడదు. చివర సున్నా ఉండే సంఖ్యలో ద్వారాలు ఎందుకు ఉండకూడదు అనే సందేహం రావడం సహజం. దానికి కారణం ఏమిటంటే... సున్నాతో పూర్తయ్యే సంఖ్యకు ఒక గుణిజం సరిసంఖ్య, ఇంకో గుణిజం బేసి సంఖ్య అయిన 5 రావడంవల్ల అలా ఉండకూడదన్నమాట. ఒకవైపు బేసి సంఖ్యలో ద్వారాలు వచ్చినట్లయితే, మరోవైపు సరిసంఖ్యలో ద్వారాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు దీర్ఘ చతురస్రాకారంలో రూపొందుతుంది.

చతురస్రాకారంలో ఉండే ఇళ్ళకు వాస్తు బలం ఎక్కువ. అందుకు భిన్నంగా దీర్ఘ చతురస్రాకారంలో, ముఖ్యంగా రైలు మాదిరిగా పొడుగ్గా, ఒకదాని తర్వాత మరో గది చొప్పున ఉండే ఇళ్ళకు వాస్తు బలం తగ్గుతుంది. ఇలాంటి ఇళ్ళలో నివసించేవారికి ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంకా ఇతర బాధలు ఎదురౌతాయి. కనుక ద్వారాల విషయంలోనూ వాస్తును తప్పక పాటించాలి.