గేటు ఉత్తర వాయువ్యంలో ఉంటే... (Gate - North Vayuvyam)
గేటు ఉత్తర వాయువ్యంలో ఉంటే...
(Gate - Vayuvyam)
ఉత్తర వాయువ్యంలో గేటు ఉంటే కింది అనర్ధాలు ఎదురౌతాయి.
ఆరోగ్యం పాడవుతుంది.
అర్ధాంతర చావుల్లాంటి భయానక ఆపదలు ముంచుకొస్తాయి.
ఆర్ధిక నష్టాలు వస్తాయి.
బాకీ పడ్డవారు అప్పు ఎగ్గొడతారు.
చైతన్యం నశిస్తుంది.
చేసే పని మీద శ్రద్ధాసక్తులు తగ్గిపోతాయి.
చెడు అలవాట్లు చేసుకుంటారు.
దురలవాట్లు వ్యసనాలుగా పరిణమిస్తాయి.
వృత్తి ఉద్యోగాల్లో వెనక పడతారు.
రావలసిన ప్రమోషన్ ఆగిపోతుంది.
ఒక్కోసారి ఉద్యోగమే పోతుంది.
వ్యాపారాలు ఉంటే మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అందరూ వ్యతిరేకులుగా, విరోధులుగా మారతారు.
విపరీతమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.
అప్పు పుట్టదు.
కుటుంబ కలహాలు వస్తాయి.
పిల్లలకు పెళ్ళి సంబంధాలు ఒకపట్టాన కుదరవు.
కుదిరిన సంబంధాలు ఏదో రూపంలో వికటిస్తాయి.