వాస్తులో ఇల్లే కాదు, స్థలమూ ముఖ్యమే (Plot Shape and Results)
వాస్తులో ఇల్లే కాదు, స్థలమూ ముఖ్యమే
(Plot Shape and Results)
మనలో చాలామంది ఇంటికే తప్ప స్థలానికి వాస్తు వర్తించదు అనుకుంటారు. నిజానికి వాస్తులో ఇల్లే కాదు, స్థలమూ ముఖ్యమే. ఇల్లు కట్టబోయే స్థలంతోనే వాస్తు మొదలవుతుంది. విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం ముందుగా శిల్పానికి ఉపయోగించే చక్కటి శిలను ఎన్నుకోవాలి. అలాగే ఇళ్ళు కట్టించుకునేముందు, అందుకు అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవాలి.
ఇళ్ళ స్థలం ఎలా ఉంది అనే దాన్నిబట్టి ఫలితాలు ఉంటాయి. ఇల్లు కట్టబోయే స్థలంలో ఎత్తుపల్లాలు లేదా వంకరటింకరలు ఉండటం మంచిది కాదు. అలాంటి లోపభూయిష్టమైన స్థలంలో వాస్తు సూత్రాలతోనే ఇల్లు కట్టినా దుష్ఫలితాలు ఏర్పడతాయి. జనాభా పెరిగి ఊళ్ళు విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నిసార్లు లోతట్టు ప్రాంతాలు, చెరువులను కూడా ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. అలాంటి నెలలో కట్టిన ఇల్లు కుంగిపోయి అవకాశాలు ఎక్కువ. కనుక లక్షలు ఖర్చుపెట్టి ఇళ్ళ స్థలం కొనబోయేముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకుంటాం కదా, స్థలం ఎలా ఉంటేనేం అనుకుంటే అది అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఇళ్ళ స్థలం ఏయే ఆకృతుల్లో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం..
ఇళ్ళ స్థలం చతురస్రాకారంలో ఉంటే చాలా శ్రేష్ఠం.
దీర్ఘ చతురస్రాకారంలో ఉండటం కూడా చాలా మంచిది.
ఇంటి స్థలం ముక్కోణపు ఆకారం లేదా వంకరటింకరలుగా ఉండటం మంచిది కాదు.
తూర్పు ఆగ్నేయం పెరిగినట్లయితే కుటుంబంలో స్త్రీలకు ఆరోగ్యం దెబ్బ తింటుంది. భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చే ప్రమాదం ఉంది.
పశ్చిమ వాయువ్యంలో పెరిగితే దోషం లేదు.
ఉత్తర వాయువ్యంలో పెరగడం వల్ల ఆర్ధిక నష్టాలు వస్తాయి.
దక్షిణ ఆగ్నేయంలో పెరిగితే దోషం లేదు.
నైరుతి దిక్కున పెరగడం అస్సలు మంచిది కాదు. అనుకోని ఆపదలు ముంచుకొస్తాయి. ఒక్కోసారి ఆకస్మిక మరణాలు సంభవించవచ్చు.
Vastu for Home and Place, Vastu significance, Vastu for plots, Indian architecture and vastu rules