ద్వారం ఎదురుగా స్తంభాలు లేదా చెట్లు ఉంటే... (Opposite Entrance..)
ద్వారం ఎదురుగా స్తంభాలు లేదా చెట్లు ఉంటే...
(Opposite Entrance..)
ద్వారం ఎదురుగా స్తంభాలు లేదా చెట్లు ఉండటం మంచిది కాదు. సింహద్వారం ఎదురుగా మాత్రమే కాదు, ఏ ద్వారం ఎదురుగా కూడా పిల్లర్లు ఉండకూడదు. ద్వారం ఎదురుగా స్తంభం కానీ చెట్టు కానీ ఉంటే ఎన్ని రకాలుగా కీడు జరుగుతుందో చూడండి...
కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
భయానక వ్యాధులు పరిణమించవచ్చు.
ఆదాయం తగ్గుతుంది.
పిల్లలు మాట వినరు.
కుటుంబసభ్యుల్లో ఏదోవిధమైన అశాంతి చోటుచేసుకుంటుంది.
ఇంట్లో పరస్పరం బేధాభిప్రాయాలు నెలకొంటాయి.
ఒక్కోసారి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, వారు విడిపోవడం వరకూ వెళ్ళొచ్చు.
ఇంటాబయటా ఏదో రూపంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ఏదో రూపంలో అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఘర్షణలు పెరిగి కోర్టు కేసుల వరకూ వెళ్ళే అవకాశం ఉంది.
ఆకస్మిక మరణాలు సంభవించవచ్చు.
అదీ సంగతి... వాస్తు పాటించకపోతే ఎంత విపరీత అనర్ధాలు ఎదురౌతాయో కదా! మన ఇంటికి సంబంధించిన అంశాలు మన చేతిలోనే ఉంటాయి కనుక ద్వారం ఎదురుగా స్తంభాలు, చెట్లు లేకుండా చూసుకోవాలి.
పిల్లర్లకు ఎదురుగా ద్వారం ఏర్పాటు చేయకూడదు. అలా ఉన్న ఇళ్ళలో అద్దెకు కూడా నివాసం ఉండకూడదు. ఇంటి స్తంభాలే కాదు ప్రహరీ గోడకు అమర్చిన గేటు స్తంభాలు కూడా ఉండకూడదు. ఒక్కోసారి కరంటు స్తంభం ఇంటి ద్వారానికి ఎదురుగా ఉండే అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
Vastu Opposite Entrance, pillars opposite doors, trees opposited doors, pillars and trees opposite Entrance