వాస్తుకూ పూలచెట్లకూ సంబంధం ఉంది... (Vastu and Flower Plants)

 

వాస్తుకూ పూలచెట్లకూ సంబంధం ఉంది...

(Vastu and Flower Plants)

పూలమొక్కల్ని అందం కోసం, ఆహ్లాదం కోసం పెంచుకుంటామని మాత్రమే మనకు తెలుసు. కానీ, పూలమొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు వాస్తురీత్యా కూడా మంచిదని చెప్తోంది వాస్తుశాస్త్రం.

 

మనిషికి, మొక్కకి అవినాభావ సంబంధం ఉంది. చెట్లు లేకపోతే అసలు మనుగడే లేదు. తిండితిప్పలు మొదలు నివాసం వరకూ ప్రతిదానికీ మనం చెట్లమీదే ఆధారపడతాం. కాయగూరలు, కలప ఇచ్చే చెట్ల సంగతి అలా ఉంచితే, పూలమొక్కల వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. అనేక పూల మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉన్నందున మనకు నిత్యం ఉపయోగపడతాయి.

 

ఇక పూలమొక్కల గురించి వాస్తు ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం...

ఇంటిముందు పూలమొక్కలు నాటినట్లయితే అదృష్టం కలిసివస్తుంది.

వాకిట్లో ఏ పూలమొక్కలు ఉన్నా మంచిదే. ముఖ్యంగా చేమంతులు, గులాబీలూ మరీ శ్రేష్టం.

దేవుని నిత్యం పుష్పాలతో పూజించాలి. వీలైతే పూలదండలతో అలంకరించాలి.

తలలో ఎప్పుడూ పూలు ధరించాలి.

తలలో మల్లే, గులాబి, విరజాజి, సన్నజాజి, చేమంతి లాంటి పూలు పెట్టుకోవడం వల్ల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం కలుగుతుంది. ఏదో రూపంలో ధనం కలిసివస్తుంది.

దైవారాధన, అలంకారం లేదా తలలో పెట్టుకోవడం - ఎందుకోసం అయినా సరే పూలు కొనే అలవాటు ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోనే పూలమొక్కలు ఉంటే మరీ శ్రేష్టం.

ఫ్లవర్ వాజుల్లో పూలు ఉంచడం మంచిది.

ఒక గాజుపాత్రలో నీళ్ళు పోసి, అందులో పూవులు ఉంచడం మంచిది. ఏరోజుకారోజు నీళ్ళను, సుమాలను కూడా మార్చాలి. అంటే సుమాలు ఎప్పుడూ వాడిపోకుండా తాజాగా ఉండాలి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తలెత్తవు.