వాస్తు ప్రకారం ఇంటి నైరుతి భాగం ఎలా ఉండాలి? (Vastu and Nairuthi of House)

 

వాస్తు ప్రకారం ఇంటి నైరుతి భాగం ఎలా ఉండాలి?

(Vastu and Nairuthi of House)

మామూలుగా ఇంటికి నాలుగు దిక్కులా కొంత ఖాళీ స్థలాన్ని వదిలి, ప్రహరీ గోడ నిర్మించాలి. ఈశాన్యానికి ఎదురుగా ఉండేదే నైరుతి. ఇతర మూలల కంటే నైరుతి మూలలో ఖాళీ స్థలం మెరకగా ఉండాలి. నైరుతిలో బావి లేదా సంపు బొత్తిగా ఉండకూడదు. గొయ్యి కానీ పల్లంగా కానీ ఉండకూడదు. కొంత ఎత్తుకు లేపి మెరకగా ఉండేట్లు చూసుకోవాలి.

 

పల్లెటూళ్ళలో ఇప్పటికీ నైరుతిలో చుట్టిల్లు వేస్తూ ఉంటారు. ఇలా వేయడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఈ ఆధునిక యుగంలో చుట్టిల్లు వేసుకోవడం చాలామందికి రుచించకపోవచ్చు. చుట్టిల్లు ఓల్డ్ ఫాషన్ అనిపించవచ్చు. అప్పుడు నైరుతిలో ఒక అవుట్ హవుజ్ కట్టించుకోవచ్చు. అంత శక్తి లేదు అనుకుంటే కనీసం గది అయినా నిర్మించుకోగల్గితే మంచిది. అలా కూడా కుదరని పక్షంలో స్థలాన్ని బాగా మెరక చేసి ఉంచాలి.

 

ఇంటికి బయటవైపు ఇతర మూలలతో పోలిస్తే నైరుతి వైపున మెరకగా ఉండాలని చెప్పుకున్నాం కదా! అలాగే ఇంటి లోపలివైపు నైరుతిలో బరువు ఉండాలి. అంటే ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం దిక్కులకన్నా ఎక్కువ బరువు ఉండాలి. అంటే నైరుతివైపున బీర్వా, బుక్ ర్యాక్, బోషాణం లాంటి బరువైన సామగ్రి ఉంచాలి.