వంటింటి చిట్కాలు.. మీకోసం...

 

వంటింటి చిట్కాలు.. మీకోసం... 

 

వంట చేసేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కాస్త అటు ఇటు అయినా ఆ వంట రుచే మారిపోతుంది. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు.. 

 

* వండిన కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి అందులో కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది.

 

* చపాతీలు వేడిగా ఉన్నపుడు మాత్రమే మెత్తగా ఉంటున్నాయి, కాసేపు అవగానే గట్టిగ అప్పడాలు లాగా అయిపోతున్నాయి. అనుకున్నవాళ్ళు చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం పాలు పోసి కలపాలి, ఇంకా చపాతీలు ఒత్తేటపుడు కాస్త నూనె రాసి మళ్లీ ఒత్తుకుంటే అపుడు చపాతీలు చాలా సాఫ్ట్ గ ఉంటాయి, ఇంకా ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.

 

* అన్నం వండేటప్పుడు అందులో కొంచెం నూనె వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది.

 

* అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి అపుడు పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బా లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎపుడు కావాలంటే అప్పుడు చాయి లో వేస్కొవచ్చు.

 

* వెండి వస్తువులు మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది, కాస్త నల్లబడినా కూడా అవి వేసుకోవడానికి ఇష్టపడం, అందుకే వెండి వస్తువుల్ని టూత్ పేస్ట్ తో శుభ్రపరిస్తే కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.