Tiruppavai Magazine Part - 5 (చక్రవర్తుల రంగనాథ్)
తిరుప్పావై ఐదవరోజు పాశురం..
5. పాశురము :
మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుతు
వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క
ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్.
భావం : మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను అనుసందించుడు.
అవతారిక :
కర్మసందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కద! అనేక జన్మలను పొందుటకీ కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లన భగవద్ధ్యానము, భగవత్సేవ, భగవస్సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతరమార్గములని గోదాదేవి సూచించుచున్నది.
(హిందోళ రాగము - ఆదితాళము)
ప. నామములను పాడుడు - తిరు
నామములను పాడుడు - ఓ! సఖులార!
అ.ప. నామము హరియించు నఘముల నెల్లను
ఏమరక పాడుడు తిరునామములను
1 చ. మధురానాథుని మాయాధీశుని
మధుజల యమునా తీర విహారిని
యదువంశోజ్జ్వల దీప్త దీపికను
హృది దామోదరు యశోగీతికల
2. చ. శుచిని హరిని సుమముల నర్చించుచు
కాచెడి విభునకు అంజలి ఘటించి
వాచాస్తుతించి మదిని ధ్యానించి
సంచిత కర్మలు జారిపోవగా
నామములను పాడుడు