Read more!

తిరుప్పావై ఇరవై ఏడవ రోజు పాశురం

 

 

తిరుప్పావై ఇరవై ఏడవ రోజు పాశురం 

 

 



    *     కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై
        ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్       
        నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక
        శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ
        యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్
        అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు
        మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.


భావం :     నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!

    అవతారిక : ----

 

 

 

 



స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.

            (హంసద్వనిరాగము _ అదితాళము)

   
ప ...     అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!
        నిను సుత్తియించి ప్రాప్యము నొంది   

    అ..ప..    నిను సుత్తియించి ప్రాప్యము నొంది.
        సన్మానమంది సన్నుతి జేతుము
   
    చ..    కంకణమ్ములను భుజకీర్తులను
        కర్ణ భూషలును కర్ణ పుష్పములు
        మెరుగుటందియలు మేని తోడవులును
        పరవశత నలంకరించుకొందుము
   
    చ..     మేలిమి పలువల మేము ధరించి
        పాలు నేయి గలసిన పరమాన్నము       
        కేలోడ మనము కలసి భుజియించి
        ఇల నీ సంశ్లేషమున సుఖింతుము

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్