తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు పాశురం

 

 

తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు పాశురం

 

 

 

 



    *     కఱవై పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్
        అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై
        ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
        కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు
        ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు
        అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?
        శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్


భావం : ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.

    అవతారిక : ----

 

 

 

 



గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కాని వారి అంతరంగమందున్న కోరిక ఆముష్మిక మైనదని స్వామికి తెలియును 'నీకు మాకును వున్న సంబంధమే! మేమజ్ఞానులము. మేము నిన్నుగాని, నీవు మమ్ములనుగాని విడిచి వుండలేని బంధమే అర్హత' అని విన్నవించారీ పాశురంలో

        (కమానురాగము __ రూపకతాళము)

   
ప...    ప్రేమతో చిరునామమున నిన్ను పిలిచినామని
        స్వామీ! గోవింద ! అలగబోకుమా! కణ్ణా!

    అ..ప..    ఏమీ! తెలియని వారము స్వామీ!
        మము కృపజూడర! గొల్ల పడుచులము
        స్వామీ! గోవింద! అలగబోకుమా! కణ్ణా!

    చ ...    ఎంతటి పుణ్యమొ నీ అవతారము
        వింత గద! గొల్లకులమున ప్రభవము!
        ఎంత త్రేంచినను తెగనీది బంధము
        ఎంత ధన్యమీ గోపికా కులము!
        స్వామీ! గోవింద! అలగాబొకుమా! కణ్ణా!

    2చ..    కోపింపకుమా! కృష్ణ ! కృపాకర!
        కృపాజేయును వాద్య విశేషము త్వర!
        గోపికలము మే మజ్ఞానులము
        మేవుచు పశువులను బ్రతికెడివారము
        స్వామీ! గోవింద! అలగాబోకుమా! కణ్ణా!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్