రామాయణాన్ని 11సార్లు చూసి కాలాతీత సాక్షిగా నిలిచిన మహర్షి.. ఆయన ఎవరంటే!
రామాయణాన్ని 11సార్లు చూసి కాలాతీత సాక్షిగా నిలిచిన మహర్షి.. ఆయన ఎవరంటే!
కక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు. ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు. ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార. అందుకే ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు.
రామాయణం, రామచరిత్రమాన గ్రంథాల ప్రకారం, కాగ్భూషుండి రాముడి పట్ల చాలా భక్తిపరుడు. అతను ఎంత భక్తిపరుడో, ప్రతి కల్పంలో (యుగంలో) రాముడు భూమిపై అవతరించినప్పుడల్లా కాగ్భూషుండి విష్ణు అవతార రూపుడైన రాముడి బాల్య చేష్టలు, ఆయన లీలలను చూడటానికి అయోధ్యకు వెళ్లేవాడట. ఈ విధంగా ఆయన ఇప్పటికే 11 సార్లు రామాయణం, 16 సార్లు మహాభారతాన్ని చూశాడని చెబుతారు. ఈ రెండు ఇతిహాస సంఘటనలను వేర్వేరు ఫలితాలతో చూశాడని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు.
రామాయణాన్ని శివుడు, పార్వతి దేవి, భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య కాగ్భూషుండి, విష్ణువు వాహనంగా పిలువబడే గరుత్మంతుడి మధ్య జరిగే సంభాషణల కలయికగా చెబుతారు.
వశిష్టుడు, కాక్బూషుండి కథ..
ఒకసారి వశిష్ఠ మహర్షి హిమాలయాల్లో ప్రయాణం చేస్తుంటాడు. ఆయన అటుగా వెళ్తున్నప్పుడు ఆయనకు ఓంకార ధ్వని వినిపిస్తుంది. అది విన్న వశిష్టుడు ఇది సామాన్య వ్యక్తి ఉచ్ఛారణ కాదు.. ఇది బ్రహ్మనాదం.. ఓంకారమే.. ఎంతో గొప్ప తపస్సు చేసే మహర్షులు కూడా అంత నిరంతరంగా ఓంకారాన్ని ఉచ్చరించలేరు. అలాంటిది ఇక్కడ ఎవరు ఉచ్చరిస్తున్నారు అని ఎంతో కుతూహలంగా ముందుకు వెళ్లగా అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. వశిష్టుడు ఆశ్రమంలోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోతాడు. ఓంకారాన్ని కాకిరూపంలో ఉన్న ఒక మహర్షి జపిస్తుండటం ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వశిష్టుడు కాగ్భూషుండిని చూస్తూ.. కాకి రూపంలో ఉండి, ఓంకారాన్ని ఇంత శుధ్దంగా ఎలా జపిస్తున్నాడు అని ఆలోచిస్తాడు. కగ్బూషుండు కళ్లు తెరచి నవ్వుతూ, వశిష్టుడి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి నేను ఏదీ సాధించలేదు, శ్రీరామ నామమే నాకు ఓంకారం, రామనామ జపమే నాకు బ్రహ్మజ్ఞానం అని చెబుతాడు.
వశిష్టుడితో.. మహర్షీ.. జ్ఞానం అనేది రూపాన్న చూడదు.. అది అహంకారాన్ని తొలగిస్తుంది. నీవు ముక్తిని కోరుకుంటే కర్త, కర్మ, ఫల భావాన్ని వదిలేయాలి. నేను అనే భావం ఇంకా ఉంటే ఎంత వేదాల జ్ఞానం ఉన్నా ముక్తి దొరకదు. అని చెబుతాడు. ఈ విషయాన్ని యోగ వశిష్టం అనే గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీరాముడికి గురువైన వశిష్టుడు స్వయానా రాముడికే ఈ విషయం ఉపదేశం చేశాడని చెబుతారు.
*రూపశ్రీ.