భగవద్గీత పార్ట్ - 15
అథ నవమోపాధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః
శ్రీ భగవాన్ ఉవాచ :-
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే !
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వామోక్ష్యసేపాశుభాత్ !! 1
ఇదం - తు - తే - గుహ్యతమం - ప్రవక్ష్యామి - అనసూయవే
జ్ఞానం - విజ్ఞానసహితం - యత్ - జ్ఞాత్వా - మోక్ష్యాసే - అశుభాత్
యత్ - దేనిని, జ్ఞాత్వా - తెలిసికొని, అశుభాత్ - అశుభకరమగు సంసార బంధము నుండి, మోక్ష్యాసే - విడివడగలవో, గుహ్యతమం - అతి రహస్యమైన, విజ్ఞానసహితం - అనుభవ జ్ఞానముతో కూడుకోనిన, ఇదం - ఈ, జ్ఞానం - జ్ఞానమును, అనసూయవే - అసూయలేని, తే - నీ కొరకు, ప్రవక్ష్యామి - చెప్పుచున్నారు.
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - ఓ అర్జునా ! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీవు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారము నుండి ముక్తుడవు కాగలవు.
రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ !
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ !! 2
రాజవిద్యా - రాజగుహ్యం - పవిత్రం - ఇదం - ఉత్తమం
ప్రత్యక్షావగమం - ధర్మ్యం - సుసుఖం - కర్తుం - అవ్యయం
ఇదం - ఈ బ్రహ్మజ్ఞానము, రాజవిద్యా - విద్యలలో రాజైనది, రాజగుహ్యం - రహస్యములలో అతిరహస్యమైనది, ఉత్తమం - ఉత్తమమైనది, పవిత్రం - పవిత్రమైనది, ప్రత్యక్షావగమం - ప్రత్యక్షానుభవముచే గ్రహించదగినది, ధర్మ్యం - ధర్మము తప్పనిది, కర్తుం - చేయుటకు, సుసుఖం - మిక్కిలి సులభమైనది, అవ్యయం - నాశరహితమైనది.
ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము. అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది.
అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప !
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని !! 3
అశ్రద్ధధానాః - పురుషాః - ధర్మస్య - అస్య - పరంతప
అప్రాప్య - మాం - నివర్తంతే - మృత్యుసంసారవర్త్మని
పరంతప - అర్జునా, అస్య - ఈ, ధర్మస్య - ధర్మము నందు, అశ్రద్ధధానాః - శ్రద్ధలేని, పురుషాః - పురుషులు, మాం - నన్ను, అప్రాప్య - పొందక, మృత్యుసంసారవర్త్మని - మృత్యురూపమైన సంసార మార్గమునందు, నివర్తంతే - మరలుచున్నారు.
ఓ పరంతపా ! ఈ ధర్మమార్గము నందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారమునందు మళ్ళి మళ్ళి పడుచున్నారు.
మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా !
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః !! 4
మయా - తతం - ఇదం - సర్వం - జగత్ - అవ్యక్తమూర్తినా
మత్ స్థాని - సర్వభూతాని - న - చ - అహం - తేషు - అవస్థితః
అవ్యక్తమూర్తినా - ఇంద్రియ గోచరము గాని, మయా - నాచేతను, ఇదం - ఈ, సర్వం - సమస్తమైన, జగత్ - ప్రపంచము, తతం - వ్యాప్తమైనది, సర్వభూతాని - సర్వభూతములును, మత్స్థాని - నా యందున్నవి, తేషు - వానియందు, అహం - నేను, నచ అవస్థితః - ఉన్నవాడును కాను.
నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నియును నా యందే యున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు లేను.
న చ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్ !
భూతభృన్న చ భూతస్థోమమాత్మా భూతభావనః !! 5
న - చ - మత్ స్థాని - భూతాని - పశ్య - మే - యోగం - ఐశ్వర్యం
భూతభృత్ - న - చ - భూతస్థః - మమ - ఆత్మా - భూతభావనః
భూతాని - ప్రాణులన్నియు, న చ మత్ స్థాని - నాయందే లేవు, మే - నాయొక్క, ఐశ్వర్యం - ఈశ్వరసంబంధమైన, యోగం చ - యోగమును, పశ్య - చూడుము, మమ - నాయొక్క, ఆత్మా - ఆత్మ, భూతభృత్ - భూతములను భరించునట్టిది, భూతభావనః - భూతములను రక్షించునది, భూతస్థః న చ - భూతముల యందుండునది కాదు.
ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములనన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ భూతముల యందు ఉండునది గాదు.
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగోమహాన్ !
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారాయ !! 6
యథా - ఆకాశస్థితః - నిత్యం - వాయుః - సర్వత్రగః - మహాన్
తథా - సర్వాణి - భూతాని - మత్ స్థాని - ఇతి - ఉపధారాయ
సర్వత్రగః - సర్వవ్యాప్తియును, మహాన్ - గొప్పదియును, వాయుః - వాయువు, నిత్యం - నిత్యము, యథా - ఏరితిని, ఆకాశస్థితః - ఆకాశము నందున్నదో, తథా - ఆ రీతిని, సర్వాణి - సమస్తములైన, భూతాని - భూతములు, మత్స్థాని ఇతి - నాయందున్నవని, ఉపధారయ - గ్రహించుము.
ఆకాశము నుండి ఉత్పన్నమైన, సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే ఉన్నవని గ్రహించుము.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ !
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ !! 7
సర్వభూతాని - కౌంతేయ - ప్రకృతిం - యాంతి - మామికాం
కల్పక్షయే - పునః - తాని - కల్పదౌ - విసృజామి - అహం
కౌంతేయ - అర్జునా, కల్పక్షయే - కల్పాంతము నందు, సర్వభూతాని - సకల భూతములు, మామికాం - నా సంబంధమైన, ప్రకృతిం - మాయను, యాంతి - పొందుచున్నవి, కల్పాదౌ - కల్పారంభమునందు, తాని - ఆ సర్వభూతములను, పునః - మరలా, అహం - నేను, విసృజామి - సృజించుచున్నాను.
ఓ కౌంతేయా ! కల్పాంతము నందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. సృష్టిఆరంభమున నేను మరల వాటిని సృజించుచుందును.
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః !
భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ !! 8
ప్రకృతిం - స్వాం - అవష్టభ్య - విసృజామి - పున - పునః
భూతగ్రామం - ఇమం - కృత్స్నం - అవశం - ప్రకృతేః - వశాత్
స్వాం - స్వకీయమైన, ప్రకృతిని, అవష్టభ్య - అవలంభించి, అవశం - పరతంత్రమైన, ఇమం - ఈ, కృత్స్నం - సమస్తమైన, భూతగ్రామం - భూతసమూహమును, పునః పునః - మరల, ప్రకృతే - ప్రకృతియొక్క, వశాత్ - వశముచే, విసృజామి - సృజించుచున్నాను.
తమతమ స్వభావశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరల మరల పుట్టించుచున్నాను.
న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ !
ఉదాసీనవదాసీనమ్ ఆసక్తం తేషు కర్మసు !! 9
న - చ - మాం - తాని - కర్మాణి - నిబధ్నంతి - ధనంజయ
ఉదాసీనవత్ - ఆసీనం - అసక్తం - తేషు - కర్మసు
ధనంజయా - అర్జునా, తేషు - ఆ, కర్మసు - కర్మలయందు, అసక్తం - సంగము లేనివాడను, ఉదాసీనవత్ - ఉదాసీనుడను, ఆసీనం చ - ఉన్నవాడనైన, మాం - నన్ను, తాని - ఆ, కర్మాణి - కర్మలు, న నిబధ్నంతి - బంధింపవు.
ఓ అర్జునా ! ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు.
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ !
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే !! 10
మయా - అధ్యక్షేణ - ప్రకృతిః - సూయతే - సచరాచరం
హేతునా - అనేన - కౌంతేయ - జగత్ - విపరివర్తతే
కౌంతేయ - అర్జునా, అధ్యక్షేణ - అధ్యక్షుడనైన, మయా - నాచేత, ప్రకృతిః - ప్రకృతి, సచరాచరం - చరాచరములును, సూయతే - ప్రసవించుచున్నది, అనేన - ఈ, హేతునా - కారణముచే, జగత్ - జగత్తు, విపరివర్తతే - ప్రవరించుచున్నది.
ఓ అర్జునా ! సాక్షిభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది.
అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ !
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ !! 11
అవజానంతి - మాం - మూఢాః - మానుషీం - తనుం - ఆశ్రితం
పరం - భావం - అజానంతః - మమ - భూతమహేశ్వరం
మమ - నాయొక్క, పరం - ఉత్తమమైన, భావం - భావమును, భూతమహేశ్వరం - భూతముల నియంతను, అజానంతః - తెలియని, మూఢాః - మూఢులు, మానుషీం - మానవ సంబంధమైన, తనుం - దేహమును, ఆశ్రితం - ఆశ్రయించిన, మాం - నన్ను, అవజానంతి - అవమానించుచున్నారు.
నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి, నన్ను అలక్ష్యము చేయుచున్నారు.
మోఘశా మోఘకర్మణోమోఘజ్ఞానా విచేతసః !
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః !! 12
మోఘశాః - మోఘకర్మాణః - మోఘజ్ఞానాః - విచేతసః
రాక్షసీం - ఆసురీం - చ - ఏవ - ప్రకృతిం - మోహినీం - శ్రితాః
మోఘశాః - వ్యర్థములైన ఆశలు కలవారు, మోఘకర్మాణః - వ్యర్థములైన కర్మలు గలవారు, మోఘజ్ఞానాః - వ్యర్థములైన జ్ఞానము గలవారు, విచేతసః - అజ్ఞానులు, మోహినీం - మోహజనితమైన, రాక్షసీం - రాక్షస సంబంధమైనట్టి, ఆసురీం చ - అసుర సంబంధమైనట్టియు, ప్రకృతిం ఏవ - స్వభావమునే, శ్రితాః - ఆశ్రయించినవారగుచున్నారు.
వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసీ - ఆసురీ - మోహినీ స్వభావములను పొందుచున్నారు.
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః !
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ !! 13
మహాత్మానః - తు - మాం - పార్థ - దైవీం - ప్రకృతిం - ఆశ్రితాః
భజంతి - అనన్యమనసః - జ్ఞాత్వా - భూతాదిం - అవ్యయం
పార్థ - అర్జునా, మహాత్మానః తు - మహాత్ములైతే, దైవిం - సాత్వికమైన, ప్రకృతిం - స్వభావమును, ఆశ్రితాః - ఆశ్రయించిన వారగుచు, భూతాదిం - జగత్తునకు కారణమైన, మాం - నన్ను, అవ్యయం - నాశము లేని వానినిగ, జ్ఞాత్వా - తెలిసికొని, అనన్యమనసః - ఏకాగ్రచిత్తులై, భజంతి - భజించుచున్నారు.
కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపినిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు.
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ ధృఢవ్రతాః !
సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే !! 14
సతతం - కీర్తయంతః - మాం - యతంతః - చ - దృఢవ్రతాః
సమస్యంతం - చ - మాం - భక్త్యా - నిత్యయుక్తాః - ఉపాసతే
సతతం - ఎల్లప్పుడును, మాం - నన్ను, కీర్తయంతః చ - సంకీర్తనము చేయువారు, యతంతః - ప్రయత్నించువారు, ధృఢవ్రతాః - దృఢమైన వ్రతములు చేయువారు, భక్త్యా - భక్తిచేత, నమస్యంతః చ - నమస్కరించెడి వారునునైన, నిత్యయుక్తాః - నిత్యయోగులు, మాం - నన్ను, ఉపాసతే - సేవించుచున్నారు.
ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే !
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ !! 15
జ్ఞానయజ్ఞేన - చ - అపి - అన్యే - యజంతః - మాం - ఉపాసతే
ఏకత్వేన - పృథక్త్వేన - బహుధా - విశ్వతోముఖం
అన్యే చ అపి - మరికొందరు, విశ్వతోముఖం - విశ్వరూపుడనైన, మాం - నన్ను, జ్ఞానయజ్ఞేన - జ్ఞానయజ్ఞముచేత, ఏకత్వేన - ఏకముగను, పృథక్త్వేన - భిన్నముగాను, బహుధా - అనేక విధములుగను, యజంతః - పూజించుచు, ఉపాసతే - ఉపాసించు చున్నారు.
మరికొందరు జ్ఞానులు నిర్గుణనిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించు చుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు.
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ !
మంత్రోపాహమమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ !! 16
అహం - క్రతుః - అహం - యజ్ఞః - స్వధా - అహం - అహం - ఔషధం
మంత్రః - అహం - అహం - ఏవ - ఆజ్యం - అహం - అగ్నిః - అహం - హుతం
అహం - నేను, క్రతుః - క్రతువును, అహం - నేను, యజ్ఞః - యజ్ఞమును, అహం - నేను, స్వధా - పిండమును, అహం - నేను, ఔషధం - ఔషధమును, అహం - నేను, మంత్రః - మంత్రమును, అహం - నేను, ఆజ్యం - హవిస్సును, అహం - నేను, అగ్నిః - అగ్ని హోత్రమును, అహం ఏవ - నేనే, హుతం - హోమకర్మను.
నేనే క్రతువును. నేనే యజ్ఞమును, పిండమును నేనే, ఔషధులును నేనే. నేనే మంత్రమును, నేనేహవిస్సును. నేనే అగ్నిని. హోమరూపకర్మమును నేనే అయియున్నాను.
పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః !
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ !! 17
పితా - అహం - అస్య - జగతః - మాతా - ధాతా - పితామహః
వేద్యం - పవిత్రం - ఓంకారః ఋక్ - సామ - యజుః - ఏవ - చ
అస్య - ఈ, జగతః - జగత్తునకు, అహం - నేను, పితా - తండ్రిని, మాతా - తల్లిని, ధాతా - సృష్టికర్తను, పితామహః - తాతను, వేద్యం - తెలిసికొనదగిన, పవిత్రం - పవిత్రమైన, ఓంకారః - ప్రణవమును, ఋక్సామ యజురేవ చ - ఋగ్వేద, సామవేద యజుర్వేదములును.
ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడనూ నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములును నేనే.
గతిర్భార్తా ప్రభుః సాక్షీనివాసః శరణం సుహృత్ !
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ !! 18
గతిః - భర్తా - ప్రభుః - సాక్షీ - నివాసః - శరణం - సుహృత్
ప్రభవః - ప్రలయః - స్థానం - నిధానం - బీజం - అవ్యయం
గతిః - గతిని, భర్తా - భరించువాడను, ప్రభుః - ప్రభువును, సాక్షీ - సాక్షిని, నివాసః - నివాసమును, శరణం - ఆశ్రయమును, సుహృత్ - మిత్రుడను, ప్రభవః - సృష్టికర్తను, ప్రలయః - వినాశకరుడను, స్థానం - స్థితికర్తను, నిధానం - నిక్షేపమును, అవ్యయం - నాశములేని, బీజం - మూలకారనమును.
పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందరికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆసింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే.
తపామ్యహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ !
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున !! 19
తపామి - అహం - అహం - వర్షం - నిగృహ్ణామి - ఉత్సృజామి - చ
అమృతం - చ - ఏవ - మృత్యుః - చ - సత్ - అసత్ - చ - అహం - అర్జున
అర్జున - అర్జునా, అహం - నేను, తపామి - తపింపజేయుచున్నాను, అహం - నేను, వర్షం - వర్షమును, నిగృహ్ణామి - నిలుపుచున్నాను, ఉత్సృజామి చ - కురిపించుచున్నాను, అమృతం చ - అమృతమును, మృత్యుః చ - మృత్యువును, సత్ - సత్తును, అసత్ చ - అసత్తును, అహం ఏవ - నేనే.
ఓ అర్జునా ! సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మరల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే.
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే !
తే పున్యమాసాద్య సురేంద్రలోకమ్ అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ !! 20
త్రైవిద్యాః - మాం - సోమపాః - పూతపాపాః - యజ్ఞైః - ఇష్ట్వా - స్వర్గతిం - ప్రార్థయంతే
తే - పుణ్యం - అసాద్య - సురేంద్రలోకం - ఆశ్నన్తి - దివ్యాన్ - దివి - దేవభోగాన్
త్రైవిద్యాః - వేదాధ్యయనపరులు, యజ్ఞైః - యజ్ఞములచేతను, మాం - నన్ను, ఇష్ట్వా - పూజించి, సోమపాః - సోమపానము చేసినవారై, పూతపాపాః - శుద్ధిచేయబడిన పాపములు గలవారై, స్వర్గతిం - స్వర్గలోక స్థితిని, ప్రార్థయంతే - ప్రార్థించుచున్నారు, తే - వారు, పుణ్యం - పుణ్యప్రదమైన, సురేంద్రలోకం - దేవేంద్రలోకమును, అసాద్య - పొంది, దివి - స్వర్గమునందు, దివ్యాన్ - దివ్యములైన, దేవభోగాన్ - దేవతా భోగములను, అశ్నంతి - అనుభవించుచున్నారు.
ఋగ్యజుస్సామవేదములచే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి !
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే !! 21
తే - తం - భుక్త్వా - స్వర్గలోకం - విశాలం - క్షీణే - పుణ్యే - మర్త్యలోకం - విశంతి
ఏవం - త్రయీధర్మం - అనుప్రపన్నాః - గతాగతం - కామకామాః - లభంతే
తే - వారు, తం - ఆ, విశాలం - విస్తారమైన, స్వర్గలోకం - స్వర్గలోక సౌఖ్యములను, భుక్త్వా - అనుభవించి, పుణ్యే - పుణ్యము, క్షీణే - క్షీణించగా, మర్త్యలోకం - మానవ లోకమును, విశంతి - ప్రవేశించుచున్నారు, ఏవం - ఈ రీతిగాను, త్రయీధర్మం - సకామకర్మమును, అనుప్రపన్నాః - అనుష్ఠించెడివారలు, కామకామాః - కోరికలు గలవారై, గతాగతం - జననమరణములను, లభంతే - పొందుచున్నారు.
ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగ స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహితసకామకర్మలను ఆశ్రయించు వారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే !
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ !! 22
అనన్యాః - చింతయంతః - మాం - యే - జనాః - పర్యుపాసతే
తేషాం - నిత్యాభియుక్తానాం - యోగక్షేమం - వహామి - అహం
అనన్యాః - అన్యచింతలులేక, మాం - నన్ను, యే - ఎట్టి, జనాః - జనులు, చింతయంతః - స్మరించుచున్నవారై, పర్యుపాసతే - సేవించుచున్నారో, నిత్యాభియుక్తానాం - నిత్యము నాయందు ఏకీభావము కలిగిన, తేషాం - వారలయొక్క, యోగక్షేమం - యోగక్షేమములను, అహం - నేను, వహామి - వహించుచున్నాను.
పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారియోగ క్షేమములను నేనే వహించుచుందును.
యేపాప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః !
తేపాపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ !! 23
యే - అపి - అన్యదేవతాః - భక్త్వాః - యజంతే - శ్రద్ధయా - అన్వితాః
తే - అపి - మాం - ఏవ - కౌంతేయ - యజంతి - అవిధిపూర్వకం
కౌంతేయ - అర్జునా, యే అపి - ఎవరయితే, అన్యదేవతాః - ఇతర దేవతల, భక్త్వాః - భక్తులై, శ్రద్దయా - శ్రద్ధతో, అన్వితాః - కూడినవారై, యజంతే - ఉపాసించుచున్నారో, తే అపి - వారును, మాం ఏవ - నన్నే, అవిధి పూర్వకం - క్రమముతప్పి,యజంతి - పూజించుచున్నారు.
ఓ అర్జునా ! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ !
న థు మామాభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే !! 24
అహం హి - సర్వయజ్ఞానాం - భోక్తా చ - ప్రభుః - ఏవ - చ
న - తు - మాం - అభిజానంతి - తత్త్వేన - అతః - చ్యవంతి - తే
అహం హి - నేను, సర్వయజ్ఞానాం - సమస్త యజ్ఞములకు, భోక్తా చ - భోక్తను, ప్రభుః ఏవ చ - ప్రభువును కూడా, తు - అయినను, తే - వారు, మాం - నన్ను, తత్త్వేన - తాత్త్వికముగ, న అభిజానంతి - ఎరుగరు, అతః - అందుచేత, చ్యవంతి - పతనమగుదురు.
ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎరుంగరు. కావున పతనమగు చున్నారు. (పునర్జన్మ పొందుచున్నారు).
యాంతి దేవవ్రతా దేవాన్ పిత్రూన్ యాంతి పితృవ్రతాః !
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో పి మామ్!! 25
యాంతి - దేవవ్రాతాః - దేవాన్ - పితౄన్ - యాంతి - పితృవ్రతాః
భూతాని - యాంతి - భూతేజ్యాః - యాంతి - మద్యాజినః - అపి - మాం
దేవవ్రతాః - దేవతల నారాధించువారు, దేవాన్ - దేవతలను, యాంతి - పొందుచున్నారు, పితృవ్రతాః - పితృపూజ చేయువారు, పిత్రూన్ - పితరులను, యాంతి - పొందుచున్నారు, భూతేజ్యాః - భూతములను ఆరాధించువారు, భూతాని - భూతములను, యాంతి - పొందుచున్నారు, మద్యాజినః అపి - నన్ను పూజించెడి వారు, మాం - నన్ను, యాంతి - పొందుచున్నారు.
దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి !
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః !! 26
పత్రం - పుష్పం - ఫలం - తోయం - యః - మే - భక్త్యా - ప్రయచ్ఛతి
తత్ - అహం - భక్త్యుపహృతం - ఆశ్నామి - ప్రయాతాత్మనః
యః - ఎవడు, భక్త్వా - భక్తితో, పత్రం - ఆకునో, పుష్పం - పువ్వునో, ఫలం - ఫలమునో, తోయం - ఉదకమునో, మే - నాకు, ప్రయచ్ఛతి - సమర్పించునో, ప్రయతాత్మనః - నిష్కాముడైన అట్టి భక్తునియొక్క, భక్త్యుపహృతం - భక్తి పూర్వకముగా సమర్పింప బడినటువంటి, తత్ - దానిని, అహం - నేను, అశ్నామి - భుజించుచున్నాను.
నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమును గాని, ఫలమును గాని జలమును గాని, నేను ప్రత్యక్షముగా ఆరగింతును.
యత్క రోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ !
యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ - మదర్పణం !! 27
యత్ - కరోషి - యత్ - అశ్నాసి - యత్ - జుహోషి - దదాసి - యత్
యత్ - తపస్యసి - కౌంతేయ - తత్ - కురుష్వ - మదర్పణం
కౌంతేయ - అర్జునా, యత్ - దేనిని, కరోషి - చేయుచున్నావో, యత్ - దేనిని, అశ్నాసి - తినుచున్నావో, యత్ - దేనిని, జుహోషి - హోమము చేయుచున్నావో, యత్ - దేనిని, దదాసి - దానము చేయుచున్నవో, యత్ - దేనిని, తపస్యసి - తపస్సు చేయుచున్నావో, తత్ - దానినంతయును, మదర్పణం - నాకర్పింపబడినదానినిగను, కురుష్వ - చేయుము.
ఓ కౌంతేయా ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తప్పస్సును నాకే సమర్పింపుము.
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః !
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి!! 28
శుభాశుభఫలైః - ఏవం - మోక్ష్యసే - కర్మబంధనైః
సంన్యాసయోగయుక్తాత్మా - విముక్తః - మాం - ఉపైష్యసి
ఏవం - ఈ విధముగ, శుభాశుభఫలైః - శుభాశుభఫలములను గలుగజేసెడి, కర్మబంధనైః - కర్మబంధములచేత, మోక్ష్యసే - విముక్తుడవగుదువు, సంన్యాసయోగయుక్తాత్మా - సన్యాసయోగయుక్తుడవై, విముక్తః - విడువ బడినవాడవై, మాం - నన్ను, ఉపైష్యసి - పొందగలవు.
ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే పొందగలవు.
సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తిన ప్రియః !
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ !! 29
సమః - అహం - సర్వభూతేషు - న - మే - ద్వేష్యః - అస్తి - న - ప్రియః
యే - భజంతి - తు - మాం - భక్త్యా - మయి - తే - తేషు - చ - అపి - అహం
అహం - నేను, సర్వభూతేషు - సమస్తభూతముల యందును, సమః - సముడను, మే - నాకు, ద్వేష్యః - శత్రువు, న అస్తి - లేడు, ప్రియః - ఇష్టడును, న - లేడు, యే తు - ఎవరైతే, మాం - నన్ను, భక్త్యా - భక్తితో, భజంతి - భజించుచున్నారో, తే - వారు, మయి - నా యందు, తేషు చ - వారియందు,అహం అపి - నేనును.
నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారి యందు ఉందును.
అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ !
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః !! 30
అపి - చేత్ - సుదురాచారః భజతే - మాం - అనన్యభాక్
సాధుః - ఏవ - సః - మంతవ్యః - సమ్యక్ - వ్యవసితః - హి - సః
సదురాచారః అపి - మిక్కిలి దురాచారము గలవాడై నను, అనన్యభాక్ - అన్యాశ్రయము నాభిలషించనివాడై, మాం - నన్ను, భజతే చేత్ - భజించునెడల, సః - వాడు, సమ్యక్ - చక్కగ, వ్యవసితః హి - స్థిరమైన చిత్తము గలవాడుగాన, సః - అతడు, సాధుః ఏవ - సాధువేయని, మంతవ్యః - తలంపదగినవాడు.
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా అతడు సాధువే యని గ్రహింపుము.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్ఛతి !
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి !! 31
క్షిప్రం - భవతి - ధర్మాత్మా - శశ్వత్ - శాంతిం - నిగచ్చతి
కౌంతేయ - ప్రతి - జానీహి - న - మే - భక్తః - ప్రణశ్యతి
క్షిప్రం - శీఘ్రముగా, ధర్మాత్మా - ధర్మాత్ముడు, భవతి - అగుచున్నాడు, శశ్వత్ - స్థిరమైన, శాంతిం - శాంతిని, నిగచ్చతి - పొందచున్నాడు, కౌంతేయ - అర్జునా, మే - నా యొక్క, భక్తః - భక్తుడు, న ప్రణశ్యతి ఇతి - నాశముబొందడని, ప్రతిజానీహి - ప్రతిజ్ఞను చేయుము.
కౌంతేయా ! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము.
మాం హి పార్థ వ్యాపాశ్రిత్య యే పి స్యుః పాపయోనయః !
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేపి యాంతి పరాం గతిమ్ !! 32
మాం - హి - పార్థ - వ్యవశ్రిత్య - యే - అపి - స్యుః - పాపయోనయః
స్త్రియః - వైశ్యాః - తథా - శూద్రాః - తే - అపి - యాంతి - పరాం - గతి
పార్థ - అర్జునా, యే - ఎవరు, మాం - నన్ను, వ్యపాశ్రిత్య - శరణుబొంది, పాపయోనయః - పాపాత్ములు, స్త్రియః - స్త్రీలును, వైశ్యాః - వైశ్యులును, తథా - అలాగే, శూద్రాః - శూద్రులును, స్యుః అపి - అయియున్నారో, తే అపి - అట్టివారును, పరాం - ఉత్తమమైన, గతిం - గతిని, యాంతిహి పొందుచున్నారు.
ఓ అర్జునా ! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరనుపొంది పరమగతినే పొందుదురు.
కిం పునర్ర్బాహ్మణాః పుణ్యాభక్తా రాజర్షయస్తథా !
అనిత్యమసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ !! 33
కిం - పునః - బ్రాహ్మణాః - పుణ్యాః - భక్తాః - రాజర్షయః - తథా
అనిత్యం - అసుఖం - లోకం - సుఖం - ఇమం - ప్రాప్య - భజస్వ - మాం
పుణ్యాః - పుణ్యాత్ములైనట్టి, భక్తాః - భక్తులైనట్టి, బ్రాహ్మణాః - బ్రాహ్మణులును, తథా - అటులే, రాజర్షయః - రాజర్షులును, కిం పునః - ఏమి చెప్పవలయును, అనిత్యం - నిత్యము కానిదియు, అసుఖం - సుఖము లేనిదియును, అగు, ఇమం - ఈ, లోకం - లోకమును, ప్రాప్య - పొందినవాడై, మాం - నన్ను, భజస్వ - భజింపుము.
ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము, ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము.
మన్మనా భావ మధ్భవక్తో మద్యాజీ మాం నమస్కురు !
మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మానం మాటత్ప్రరాయణః !! 34
మన్మనా - భావ - మద్భక్తః - మద్యాజీ - మాం - నమస్కురు
మాం - ఏవ - ఏష్యసి - యుక్త్వా - ఏవం - ఆత్మానం - మత్పరాయణః
మన్మనా - నాయందే మనస్సుగలవాడవు, భావ - కమ్ము, మద్భక్తః - నాకు భక్తుడవును, మద్యాజీ - నన్నే పూజించువాడవు, (భవ - కమ్ము), మాం నన్నే, నమస్కురు - నమస్కరింపుము, ఏవం - ఇట్లు, ఆత్మానం - ఆత్మను, యుక్త్వా - నియోగించి, మత్పరాయణః - నా యందు మనస్సుగలవాడై, మాం ఏవ - నన్నే, ఏష్యసి - పొందగలవు.
నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నా యందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగోనామ