Read more!

భగవద్గీత పార్ట్ - 14

 

ఓం శ్రీపరమాత్మనే నమః
అథ అష్టమోపాధ్యాయః - అక్షరపరబ్రహ్మయోగః

అర్జున ఉవాచ :-
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ !
అధిభూతం చ కిం ప్రోక్తమ్ అధిదైవం కిముచ్యతే !!  1

కిం - తత్ - బ్రహ్మ - కిం - అధ్యాత్మం కిం - కర్మ - పురుషోత్తమ
అధిభూతం - చ - కిం - ప్రోక్తం - అధిదైవం - కిం - ఉచ్యతే


పురుషోత్తమ - కృష్ణా, తత్ - ఆ, బ్రహ్మ - బ్రహ్మము, కిం - ఏది, అధ్యాత్మం - అధ్యాత్మము, కిం - ఎట్టిది, కర్మ - కర్మము, కిం - ఎట్టిది, అధిభూతం - అధిభూతము, కిం - ఏది, ప్రోక్తం - చెప్పబడుచున్నది, అధిదైవం చ - అధిదైవముగ, కిం - దేనిని, ఉచ్యతే - అందురు.

అర్జునుడు పలికెను - ఓ పురుషోత్తమా ! బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అని దేనికి పేరు ? అధిదైవము అని దేనిని అందురు.

అధియజ్ఞః కథం కోపాత్ర దేహేపాస్మిన్ మధుసూదన !
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోపాసి నియతాత్మభిః !!  2

అధియజ్ఞః - కథం - కః - అత్ర - దేహే - అస్మిన్ - మధుసూదన
ప్రయాణకాలే - చ - కథం - జ్ఞేయః - అసి - నియతాత్మభిః


మధుసూదన - కృష్ణా, అస్మిన్ - ఈ, దేహే - దేహమునందు, అధియజ్ఞః - అధియజ్ఞుడు, కః - ఎవ్వడు, అత్ర - ఈ విషయము నందు, కథం - ఎట్లు, ప్రయాణకాలే చ - మరణకాలమునందును, నియతాత్మభిః - నియమింపబడిన ఆత్మ గలవారిచేత, కథం - ఎటుల, జ్ఞేయః - తెలియబడువాడవు, అసి - అగుచున్నావు.

ఓ మధుసూదనా ! అధియజ్ఞము అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును నిగ్రహముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు ?

శ్రీభగవాన్ ఉవాచ :-
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోపాధ్యాత్మముచ్యతే !
భూతభావోద్బవకరో విసర్గః కర్మసంజ్ఞితః !!  3

అక్షరం - బ్రహ్మ - పరమం - స్వభావః - అధ్యాత్మం - ఉచ్యతే
భూతభావోద్భవకరః - విసర్గః - కర్మసంజ్ఞితః


బ్రహ్మ - బ్రహ్మము, పరమం - పరమమైనదియు, అక్షరం - క్షరము కానిదియు, స్వభావః - స్వభావము, అధ్యాత్మం - ఆధ్యాత్మము, ఉచ్యతే - చెప్పబడుచున్నది, భూత భావోద్భవకరః - భూతములకు స్వభావ జననములను చేయునట్టి, విసర్గః - విడుచుట, కర్మసంజ్ఞితః - కర్మమను పేరుగలది.

శ్రీ భగవానుడు పలికెను బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, అధ్యాత్మము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మమనబడుచున్నది.

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ !
అధియజ్ఞోపాహమేవాత్ర దేహే దేహభృతాం వర !!   4

అధిభూతం - క్షరః - భావ - పురుషః - చ - అధిదైవతం
అధియజ్ఞః - అహం - ఏవ - అత్ర - దేవే - దేహభృతాం - వర


దేహభృతాంవర - అర్జునా, అధిభూతం - అధిభూతము, క్షరః - నశించునట్టి, భావః - భావముగలది, పురుషః చ - పురుషుడును, అధిదైవతం - అదిదైవతము, అత్ర - ఈ, దేహే - దేహమునందు, అధియజ్ఞః - అధియజ్ఞుడు, అహం ఏవ - నేనే.

ఓ అర్జునా ! ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము - దేహధారులలో శ్రేష్ఠుడవైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే - వాసుదేవుడనే అధియజ్ఞమును.

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వాకలేవరమ్ !
యః ప్రయాతి స మద్భావం యాతినాస్త్యత్ర సంశయః !!  5

అంతకాలే - చ - మాం - ఏవ - స్మరన్ - ముక్త్వా - కలేవరమ్
యః - ప్రయాతి - సః - మద్భావం - యాతి - న - అస్తి - అత్ర - సంశయః


యః - ఎవడు, అంతకాలే చ - మరణ సమయమునందు, మాం ఏవ - నన్నే, స్వరన్ - స్మరించుచున్నవాడై, కలేవరం - దేహమును, ముక్త్వా - విడిచి, ప్రయాతి - వెడలుచున్నాడో, సః - వాడు, మద్భావం - నాభావమును, యాతి - పొందుచున్నాడు, అత్ర - ఈ విషయము నందు, సంశయః - సందేహము, న అస్తి - లేదు.

అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రము గూడ సంశయము వలదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ !
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః !!  6

యం - యం - వా - అపి - స్మరన్ - భావం - త్యజతి - అంతే - కలేవరం
తం - తం - ఏవ - ఏతి - కౌంతేయ - సదా - తద్భావభావితః


కౌంతేయ - అర్జునా, యః - ఎవడు, అంతే - అంత్యకాలమందు, యం యం భావం వా అపి - ఏయే భావమును, స్మరన్ - తలచుచు, కలేవరం - దేహమును, త్యజతి - విడుచుచున్నాడో, సః - వాడు, సదా - ఎల్లప్పుడు, తత్ - ఆ, భావభావితః - భావమునే తలచినవాడై, తం తం ఏవ - ఆయాభావమునే, ఏతి - పొందుచున్నాడు.

కౌంతేయా ! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయాస్వరూపములనే పొందుచున్నాడు.

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ !
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయః !!  7

తస్మాత్ - సర్వేషు - కాలేషు - మాం - అనుస్మర - యుధ్య - చ
మయి - అర్పిత మనోబుద్ధిః - మాం - ఏవ - ఏష్యసి - అసంశయం


తస్మాత్ - అందువలన, సర్వేషు - సమస్తమైన, కాలేషు - కాలములందును, మాం - నన్ను, అనుస్మర - అనుస్మరించుచు, యుధ్య చ - యుద్ధమును చేయుము, మయి - నాయందు, అర్పిత - ఉంచబడిన, మనోబుద్దులు కలిగి, మాం ఏవ - నన్నే, ఏష్యసి - పొందగలవు, అసంశయం - సందేహము లేదు.

కావున ఓ అర్జునా ! నీవు సర్వదా నన్నే స్మరించు చుండుము. యుద్ధమున కూడ చేయుము. నీ బుద్ధిని మనస్సును నా యందే నిల్పియున్నచో నిజముగా నన్నే పొందెదవు.

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా !
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ !!  8

అభ్యాస యోగయుక్తేన - చేతసా - నాన్యగామినా
పరమం - పురుషం - దివ్యం - యాతి - పార్థ - అనుచింతయన్ 


పార్థ - అర్జునా, అభ్యాస యోగయుక్తేన - అభ్యాసమనెడి యోగాముతో కూడినదియు, న అన్యగామినా - ఇతర విషయముల యందు ప్రవర్తింపనిదియు, చేతసా - మనస్సుచేత, దివ్యం - దివ్యుడు, పరమం - ఉత్తముడునైన, పురుషం - పురుషుని, అనుచింతయన్ - స్మరించుచు, యాతి - (అతనిచే) పొందుచున్నాడు.

మనస్సునందు వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండ నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును.

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః!!
  9


సర్వస్య - ధాతార - మచింత్యరూపమ్
ఆదిత్య - వర్ణం - తమసః  - పరస్తాత్


కవిం - పురాణం - శాశ్వతుడు, అనుశాసితారం - నియంతయు, అణోః - అణువు కంటెను, అణీయాంసం - సూక్ష్ముడును, సర్వస్య - సమస్తమునకు, ధాతారం - ధాతయును, అచింత్యరూపం - ఊహింపశక్యముగాని రూపము గలవాడును, ఆదిత్యవర్ణం - సూర్యప్రకాశము గలవాడును, తమసః - చీకటికంటెను, పరస్తాత్ - వేరైన వాడును.

సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైనవాడును, సర్వ ప్రాణులను పోషించు వాడును, అచింత్య రూపుడును, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును ఐన పరమేశ్వరుని స్మరించు వాడగు....

ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యాయుక్తో యోగబలేన చైవ !
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషము పైతి దివ్యమ్ !! 10

ప్రయాణకాలే - మనసా - ఆచలేన - భక్త్యా - యుక్తః - యోగబలేన - చ - ఏవ
భ్ర్రువోః - మధ్యే - ప్రాణం - ఆవేశ్య - సమ్యక్ - సః - తం - పరం - పురుషం - ఉపైతి - దివ్యం


ప్రయాణకాలే - మరణకాలమునందు, ఆచలేన - చలనములేని, మనసా - మనస్సుతోడను, భక్త్వా -  భక్తితోడను, యోగబలేన చ ఏవ - యోగబలముతోడను, యుక్తః - కూడినవాడై, భ్రువోః మధ్యే - భ్రూమధ్యమునందు, ప్రాణం - ప్రాణమును, సమ్యక్ -  నిలకడగా, ఆవేశ్య - నిలిపి, తం - ఆ పురుషుని, యః - ఎవడు, అనుస్మరేత్ - స్మరించునో, సః - అతడు, దివ్యం - దివ్యుడును, పరం - సర్వోత్తముడునగు, పురుషం - పురుషుని, ఉపైతి - పొందుచున్నాడు.

అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగా నిల్పి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యరూపుడును, పరమపురుషుడును ఐన పరమాత్మనే చేరును.

యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః !
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తేపదం సంగ్రహేణ ప్రవక్షే!!   11

యత్ - అక్షరం - వేదవిదః - వదంతి
విశంతి - యత్ - యతయః - వీతరాగాః
యత్ - ఇచ్చంతః - బ్రహ్మచర్యం - చరంతి
తత్ - తే - పదం - సంగ్రహేణ - ప్రవక్ష్యే


వేదవిదః - వేదవేత్తలు, యత్ - దేనిని, అక్షరం - అక్షరమని, వదంతి - చెప్పుచున్నారో, వీతరాగాః - రాగమును విడిచిన, యతయః - యతులు, యత్ - దేనిని, విశంతి - చేరుచున్నారో, యత్ - దేనిని, ఇచ్చంతః - కోరుచున్నవారై, బ్రహ్మచర్యం - బ్రహ్మచర్యమును, చరంతి - పూనుచున్నారో, తత్ - అట్టి, పదం - స్థానమును, తే - నీకొరకు, సంగ్రహేణ - సంగ్రహమున, ప్రవక్ష్యే - వివరించి చెప్పుచున్నాను.

వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు - ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్న్యాసులు ఆ పరమపదము నందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును.

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ !
మూర్ద్న్య్ధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగాధారణామ్ !!  12

సర్వద్వారాణి - సంయమ్య - మనః - హృది - నిరుధ్య - చ
మూర్ధ్ని - ఆధాయ - ఆత్మనః - ప్రాణం - ఆస్థితః - యోగధారణాం


ఆత్మనః - తనయొక్క, సర్వద్వారణి - సమస్త ఇంద్రియ ద్వారములను, సంయమ్య - నియమించి, మనః - మనస్సును, హృది - హృదయమునందు, నిరుధ్య చ - నిలిపి, మూర్థ్ని - శిరస్సునందు, ప్రాణం - ప్రాణమును, ఆధాయ - ఉంచి, యోగధారణాం - యోగాభ్యాసమున, ఆస్థితః - ఉన్నవాడై.

సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి, పరమాత్మధ్యానమునందే నిమగ్నుడై.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్ !
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ !!  13

ఓం - ఇతి - ఏకాక్షరం - బ్రహ్మ - వ్యాహరన్ - మాం - అనుస్మరన్
యః - ప్రయాతి - త్యజన్ - దేహం - సః - యాతి - పరమాం - గతిం


బ్రహ్మ - పరబ్రహ్మ, ఓం ఇతి - ఓం అనెడి, ఏకాక్షరం - ఏకాక్షరమున, వ్యాహరన్ - పలుకుతూ, మాం - నన్ను, అనుస్మరన్ - స్మరించుచూ, దేహం - దేహమును, త్యజన్ - త్యజించి, యః - ఎవడు, ప్రయాతి - పోవుచున్నాడో, సః - అతడు, పరమాం - ఉత్తమమైన, గతిం - గతిని, యాతి - పొందుచున్నాడు.

అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను, నిర్గుణబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగ మొనర్చు వాడు మోక్షమును పొందుచున్నాడు.

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః !
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః !!  14

అనన్యచేతాః - సతతం - యః - మాం - స్మరతి - నిత్యశః
తస్య - అహం - సులభః - పార్థః - నిత్యయుక్తస్య - యోగినః


పార్థ - అర్జునా, యః - ఎవడు, అనన్యచేతాః - అనన్యచిత్తముతో, సతతం - సదా, నిత్యశః - అనుదినము, మాం - నన్ను, స్మరతి - తలంచుచున్నాడో, నిత్యయుక్తస్య - నిత్యయుక్తుడైన, తస్య యోగినః - ఆ యోగికి, అహం - నేను, సులభః - సులభుడను.

పార్థాః ! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి నేను సులభముగా లభింతును.

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ !
నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః !!  15

మాం - ఉప్యేత - పునర్జన్మ - దుఃఖాలయం - అశాశ్వతం
న - ఆప్నువంతి - మహాత్మానః - సంసిద్ధిం - పరమాం - గతాః


పరమాం - ఉత్తమమైన, సంసిద్ధిం - మోక్షమును, గతాః - పొందిన, మహాత్మానః - మహాత్ములు, మాం - నన్ను, ఉప్యేత - పొంది, దుఃఖాలయం - దుఃఖమునకు స్థానము, అశాశ్వతం - అనిత్యమును నగు, పునర్జన్మ - పునర్జన్మమును, నాప్నువంతి - పొందురు.

పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను  తిరిగి పొందురు.

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోపార్జున !
మామూపేత్య తు కౌంతేయ  పునర్జన్మ న విద్యతే !! 16

ఆబ్రహ్మ భువనాత్ - లోకాః - పునరావర్తినః - అర్జున
మాం - ఉపేత్య - తు - కౌంతేయ - పునర్జన్మ - న - విద్యతే


అర్జున - అర్జునా, ఆబ్రహ్మభువనాత్ - బ్రహ్మలోకము వరకును గల, లోకాః - లోకములు, పునరావర్తినః - మరల పుట్టుకను కలిగించునవి, కౌంతేయ - అర్జునా, మాం - నన్ను, ఉపేత్య తు - పొందిన మాత్రముననే, పునర్జన్మ - పునర్జన్మము, న విద్యతే - కలుగదు.

అర్జునా ! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు. కౌంతేయా ! కనుక నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు.

సహస్రయుగపర్యంతమ్ ఆహార్యద్బ్రహ్మణో విదుః !
రాత్రిం యుగసహస్రాంతాం తేపాహోరాత్రవిదో జనాః !! 17

సహస్రయుగపర్యంతం - అహః - యత్ - బ్రహ్మణః - విదుః
రాత్రిం - యుగ సహస్రాంతాం - తే - అహోరాత్రవిదః - జనాః


అహోరాత్రవిదః - రాత్రింబవళ్ళు పరిణామమును ఎరిగిన, తేజనాః - ఆ జనులు, బ్రాహ్మణః - బ్రహ్మకు, యత్ - ఏది, అహః - పగలో, (తత్ - దానిని), సహస్రయుగ పర్యంతం - వేయి యుగముల పరిమితిగల దానినిగను, రాత్రిం - రాత్రిని, యుగ సహస్రాంతాం - వేయి యుగముల పరిమితిగల దానినిగను, విదుః - తెలిసికొని యున్నారు.

వేయి చాతుర్యగమూలా కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా ఎరిగినవారు.

అవ్యక్తద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే !
రాత్ర్యగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే !! 18

అవ్యక్తాత్ - వ్యక్తయః - సర్వాః - ప్రభవంతి - అహరాగమే
రాత్ర్యాగమే - ప్రలీయంతే - తత్ర - ఏవ - అవ్యక్తసంజ్ఞకే 


అహరాగమే - పగటి ప్రారంభమునందు, అవ్యక్తాత్ - అవ్యక్తము నుండి, సర్వాః వ్యక్తయః - సమస్త వ్యక్తరూపములు, ప్రభవంతి - కలుగుచున్నవి, రాత్ర్యాగమే - రాత్రికలిగినప్పుడు, అవ్యక్తసంజ్ఞకే - అవ్యక్తమనబడు, తత్ర ఏవ - దానియందే, ప్రలీయంతే - లీనమగుచున్నవి.

చరాచర ప్రాణులన్నియును బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి (బ్రహ్మయొక్క సూక్ష్మశరీరము నుండి) ఉత్పన్నములగును. మరల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును.

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే !
రాత్ర్యగమేపావశః పార్థః ప్రభవత్యహరాగమే !! 19

భూతగ్రామః - సః - ఏవ - అయం - భూత్వా - భూత్వా - ప్రలీయతే
రాత్ర్యాగమే - అవశః - పార్థ - ప్రభవతి - అహరాగమే


పార్థ - అర్జునా, భూతగ్రామః - భూతసమూహమును, స ఏవ అయం - అదియే, అవశః - వశములేక, రాత్రాగ్యమే - రాత్రి ప్రారంభమైనపుడు, ప్రభవతి - పుట్టుచున్నది.

పార్థా ! ఈ ప్రాణి సముదాయము ప్రకృతివశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును.

పరస్తస్మాత్తు భావోపాన్యోపావ్యక్తోపావ్యక్తాత్ సనాతనః !
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి !! 20

పరః - తస్మాత్ - తు - భావః - అన్యః - అవ్యక్తః - అవ్యక్తాత్ - సనాతనః
యః - సః - సర్వేషు - భూతేషు - నశ్యత్సు - న - వినశ్యతి 


యః - ఏ, భావః తు - భావము అయితే, తస్మాత్ - ఆ, అవ్యక్తాత్ - అవ్యక్తము కంటెను, అన్యః - ఇతరమైనదియును, పరః - ఉత్తమమైనదియును, అవ్యక్తః - వ్యక్తము కానిదియును, సనాతనః - శాశ్వతమైనదియునగు, సః - ఆ, భావః - భావము, సర్వేషు భూతేషు - సమస్త భూతములు, నశ్యత్సు - నశించుచున్నాను, న వినశ్యతి - నశింపదు.

ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు.

అవ్యక్తోపాక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ !
యం ప్రాప్య న నివర్తంతే తద్దామ పరమం మమ !! 21

అవ్యక్తః - అక్షరః - ఇతి - ఉక్తః - తం - ఆహుః - పరమాం - గతిం
యం - ప్రాప్య - న - నివర్తంతే - తత్ - ధామ - పరమం - మమ


అవ్యక్తః - అవ్యక్తుడు, అక్షరః - అవినాశి, ఇతి - అని, ఉక్తః - చెప్పబడిన, తం - ఆ పరమాత్మను, పరమాం - ఉత్తమమైన, గతిం - స్థానముగా, ఆహుః - చెప్పుచున్నారు, యం - దేనిని, ప్రాప్య - పొంది, న నివర్తంతే - తిరిగిరారో, తత్ - అట్టి, మమ - నా యొక్క, ధామ - స్థానము, పరమం - శ్రేష్ఠమైనది.

ఈ అవ్యక్తమనే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరల తిరిగిరారు.

పురుషః స సరః పార్థః భక్త్వాలభ్యస్త్వనన్యయా !
యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ !! 22

పురుషః - సః పరః - పార్థః - భక్త్వా - లభ్యః - తు - అనన్యయా
యస్య - అంతఃస్థాని - భూతాని - యేన - సర్వం - ఇదం - తతం


పార్థ - అర్జునా, భూతాని - భూతములు, యస్య - ఎవనియొక్క, అంతఃస్థాని - లోపలనున్నవో, యేన - ఎవనిచేత, సర్వం - సమస్తమైన, ఇదం - ఈ జగత్తు, తతం - వ్యాప్తమైనదో, సః - ఆ, పరః - ఉత్తముడైన, పురుషః - పురుషుడు, అనన్యయా - ఏకాగ్రమైన, భక్త్యాతు - భక్తిచేతనే, లభ్యః - పొందదగినవాడు.

ఓ పార్థా ! సమస్త ప్రాణులు ఆపరమాత్మ యందె అంతర్గతములై యున్నవి. ఆ పరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యముకాగలడు.

యత్ర కాలే త్వనావృత్తిమ్ ఆవృత్తిం చైవ యోగినః !
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ !!  23

యత్ర - కాలే - తు - అనావృత్తిం - ఆవృత్తిం - చ - ఏవ - యోగినః
ప్రయాతాః - యాంతి - తం - కాలం - వక్ష్యామి - భరతర్షభ


భరతర్షభ - అర్జునా, యత్ర - ఏ, కాలే తు కాలమునందైతే, ప్రయాతాః - గతించిన, యోగినః - యోగులు, అనావృత్తిం - జన్మ రాహిత్యమును,  యత్ర - ఏ, కాలే - కాలమునందు, ప్రయాతాః - గతించిన, ఆవృత్తిం చ ఏవ - పునర్జన్మమును, యాంతి - పొందుచున్నారో, తం - ఆ, కాలం - కాలమును, వక్ష్యామి - చెప్పుచున్నాను.

ఓ భారతశ్రేష్ఠా ! ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మఱియు ఏకాలమునందు దేహత్యాగము చేసినవారు తిరిగివచ్చు గతిని పొందుదురో అటువంటి కాలములను, అనగా రెండు మార్గములను చెప్పుచున్నాను.

అగ్నిర్జ్యోరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ !
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః !! 24

అగ్నిః - జ్యోతిః - అహః - శుక్లః - షణ్మాసాః - ఉత్తరాయణం
తత్ర - ప్రయాతాః - గచ్చంతి - బ్రహ్మ - బ్రహ్మవిదః - జనాః


అగ్నిః - అగ్నియును, జ్యోతిః - తేజమును, అహః - పగలును, శుక్లః - శుక్లపక్షమును, షణ్మాసాః - ఆరుమాసములునుగల, ఉత్తరాయణం - ఉత్తరాయణమును, తత్ర - ఆ కాలమునందు, ప్రయాతాః - చనిపోయిన, బ్రహ్మవిదః - బ్రహ్మవేత్తలగు, జనాః - జనులు, బ్రహ్మ - బ్రహ్మమును, గచ్చంతి - పొందుచున్నారు.

బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమార్గము ద్వారా బ్రహ్మపదప్రాప్తి నుందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమక్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి, పరమపదమును చేర్చుదురు.

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ !
తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే !! 25

ధూమః - రాత్రిః - తథా - కృష్ణః - షణ్మాసా దక్షిణాయనమ్ !
తత్ర - చాంద్రమసం - జ్యోతిః - యోగీ - ప్రాప్య - నివర్తతే 


ధూమః - ధూమము, రాత్రిః - రాత్రి, తథా - ఆ రీతిగనే, కృష్ణః - కృష్ణపక్షము, షణ్మాసాః - ఆరుమాసములు గల, దక్షిణాయనం - దక్షినాయనమును, యోగీ - యోగి, తత్ర - ఆ మార్గమునందు, చాంద్రమసం - చంద్రసంబంధమైన, జ్యోతిః - జ్యోతిని, ప్రాప్య - పొంది, నివర్తతే - పునర్జన్మము నెత్తుచున్నాడు.

అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గముద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమక్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన - అభిమానదేవతలు కొనిపోయి, స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమసజ్యోతిని పొంది, అనగా తమశుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు. 

శుక్లకృష్ణే గతీ హ్యేతీ జగతః శాశ్వత మతే !
ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః !! 26


శుక్ల - కృష్ణే -  గతీ - హ్యేతీ - జగతః - శాశ్వత - మతే
ఏకయా - యాతి - అనావృత్తిం - అన్యయా - ఆవర్తతే - పునః


శుక్లకృష్ణే - శుక్లకృష్ణములైన, ఏతే - ఈ, గతీహి - గతులు, జగతః - జగత్తునకు, శాశ్వతే - శాశ్వతములని, మతే - తలంపబడుచున్నవి, ఏకయా - ఒక మార్గముచే, అనావృత్తిం - జన్మరాహిత్యమును, యాతి - పొందుచున్నాడు, అన్యయా - రెండవ మార్గముచే, పునః - తిరిగి, ఆవర్తతే - జన్మించుచున్నాడు.

ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణమార్గములనియు వ్యవహారము గలదు. ఇవి సనాతనములు, శుక్లమార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. కృష్ణమార్గమున వెళ్లువారు తిరిగివచ్చి  జననమరణచక్రములో పడుదురు.

నితీ సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన !
తస్మాత్ సర్వేషు కాలేషు యోగాయుక్తో భవార్జున !! 27

న - ఏతే - సృతీ - పార్థ - జానన్ - యోగీ - ముహ్యతి - కశ్చన
తస్మాత్ - సర్వేషు - కాలేషు - యోగయుక్తః - భవ - అర్జున


పార్థ - అర్జునా, ఏతే - ఈ రెండైన, సృతీ - మార్గములను, జానన్ - తెలిసిన, యోగీ - యోగి, కశ్చన - ఎవడును, న ముహ్యతి - మోహమునొందడు, తస్మాత్ - అందువలన, సర్వేషు - సమస్తమైన, కాలేషు - కాలముల యందును, అర్జున - అర్జునా, యోగయుక్తః - యోగయుక్తుడవు, భవ - కమ్ము.

పార్థా ! ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్త్వములను తెలిసికొన్నయోగి మోహమునపడడు. కావున అన్నికాలముల యందును నీవు యోగివి కమ్ము.

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ !
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపై తిచాద్యమ్ !! 28

వేదేషు - యజ్ఞేషు - తపఃసు - చ - ఏవ
దానేషు - యత్ - పుణ్యఫలం - ప్రదిష్టం
అత్యేతి - తత్ - సర్వం - ఇదం - విదిత్వా
యోగీ - పరం - స్థానం - ఉపైతి - చ - ఆద్యం.


యోగీ, యోగి, ఇదం - దేనిని, విదిత్వా - గ్రహించి, వేదేషు - వేదముల యందును, యజ్ఞేషు - యజ్ఞముల యందును, తపఃసు - తపముల యందును, తపఃసు - తపముల యందును,దానేషు చ ఏవ - దానముల యందునుగూడ, యత్ - ఏ, పుణ్యఫలం - పుణ్యఫలము, ప్రదిష్టం - చెప్పబడినదో, తత్ - ఆ, సర్వం - సర్వమును, అత్యేతి - అతిక్రమించుచున్నాడు, ఆద్యం మొదటిదైనదియును, పరం - ఉన్నతమైనదియునగు, స్థానం - స్థానమును, ఉపైతి చ - పొందుచున్నాడు.

ఈ తత్త్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను, యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరబ్రహ్మయోగోనామ