భగవద్గీత పార్ట్ - 5
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః !
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ! 61
తాని - సర్వాణి - సంయమ్య - యుక్తః - ఆసీత - మత్పరః
వశే - హి - యస్య - ఇంద్రియాణి - తస్య - ప్రజ్ఞా - ప్రతిష్ఠితా
తాని - ఆ, సర్వాణి - సర్వ (ఇంద్రియములను), సంయమ్య - వశమునందుంచుకుని, యుక్తః - యోగయుక్తుడు, మత్పరః - నాయందు ప్రియముగలవాడై, ఆసీత - ఉండవలెను, యస్య - ఎవనియొక్క, ఇంద్రియాణి - ఇంద్రియములు, వశే - స్వాధీనము నందున్నవో, తస్య - అతని యొక్క, ప్రజ్ఞా - బుద్ధి, ప్రతిష్ఠితా హి - స్థిరముగా కూడును.
కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే !
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపాభిజాయతే ! 62
ధ్యాయతః - విషయాన్ - పుంసః - సంగః - తేషు - ఉపజాయతే
సంగాత్ - సంజాయతే - కామః - కామాత్ - క్రోధః - అభిజాయతే
విషయాన్ - విషయములను, ధ్యాయతః - ధ్యానించుచున్న, పుంసః - పురుషునకు, తేషు - వానియందు, సంగః - ఆసక్తి, ఉపజాయతే - కలుగుచున్నది, సంగాత్ - సంగత్వము వలన, కామః కోరిక, సంజాయతే - పుట్టుచున్నది, కామాత్ - కోరిక వలన, క్రోధః - క్రోధము, అభిజాయతే - కలుగును.
విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధముకల్గును.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః !
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ! 63
క్రోధాత్ - భవతి - సమ్మోహః - సమ్మోహాత్ - స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ - బుద్ధినాశః - బుద్ధినాశాత్ - ప్రణశ్యతి
క్రోధాత్ - క్రోధము వలన, సమ్మోహః - వ్యామోహము, భవతి - కలుగుచున్నది, సమ్మోహతః - మోహమువలన, స్మృతివిభ్రమః - విస్మృతియు, స్మృతిభ్రంశాత్ - విస్మృతివలన, బుద్ధినాశః - బుద్ధినాశము వలన, ప్రణశ్యతి - పతనమగుచున్నాడు.
అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశనమువలన మనుష్యుడు పతనమగుచున్నాడు.
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ !
ఆత్మవశ్యైర్విదేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ! 64
రాగద్వేషవియుక్తైః - తు - విషయాన్ - ఇంద్రియైః - చరన్
ఆత్మవశ్యైః - విధేయాత్మా - ప్రసాదం - అధిగచ్ఛతి
రాగ - రాగముచేతను, ద్వేష - ద్వేషముచేతను, వియుక్తైః - విడువబడినట్టియు, ఆత్మవశ్యైః తనవశమైన, ఇంద్రియైః - ఇంద్రియముల చేతను, విషయాన్ - విషయములను, చరన్ తు - గ్రహించుచున్నాను, విధేయాత్మా - యోగ యుక్తుడు, ప్రసాదం - ప్రశాంతతను, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.
ఇంద్రియములను వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే !
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ! 65
ప్రసాదే - సర్వదుఃఖానాం - హానిః - అస్య - ఉపజాయతే
ప్రసన్నచేతసః - హి - ఆశు - బుద్ధిః - పర్యవతిష్ఠతి
అస్య - ఈ యోగయుక్తునకు, ప్రసాదే - ప్రశాంతము వలన, సర్వదుఃఖానాం - సర్వ దుఃఖముల యొక్క, హానిః - వినాశము, ఉపజాయతే - కలుగుచున్నది, ప్రసన్న చేతసః - ప్రసన్నచిత్తుడైన, ఆశు - శీఘ్రముగ, బుద్ధిః - బుద్ధి, పర్యావతిష్ఠతి హి - స్థిరమగును.
మనోనిర్మలత్వము వలన అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్నివిషయముల నుండియు వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా !
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ! 66
న - అస్తి - బుద్ధిః - అయుక్తస్య - న - చ - అయుక్తస్య - భావనా
న - చ - అభావయతః - శాంతిః - ఆశాంతస్య - కుతః - సుఖం
అయుక్తస్య - యోగయుక్తుడు గానివానికి, బుద్ధిః - వివేకము, న అస్తి - లేదు, అయుక్తస్య - యోగ యుక్తుడు గానివానికి, భావనా చ - ఆత్మ భావనయును, న - లేదు, అభావయతః - భావశూన్యునకు, శాంతిః - శాంతి, న చ - లేదు, అశాంతస్య - శాంతి లేనివానికి, సుఖం - సుఖము, కుతః - ఎట్లు లభించును.
ఇంద్రియనిగ్రహము మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు. అట్టి మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తికభావమే కలుగదు. తద్భావనా హీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును?
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోపాను విధీయతే !
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ! 67
ఇంద్రియాణాం - హి - చరతాం - యత్ - మనః - అను - విధీయతే
తత్ - అస్య - హరతి - ప్రజ్ఞాం - వాయుః - నావం - ఇవ - అంభసి
చరతాం - చరించుచున్న, ఇంద్రియాణాం - ఇంద్రియార్థముల యందు, యత్ మనః - ఏ మనస్సు, అనువిధీయతే - అనుసరించి, ప్రవరించుచున్నదో, తత్ - అట్టి మనస్సు, అస్య - ఈ మనుజుని యొక్క, ప్రజ్ఞాం - విచక్షణాశక్తిని, అంభసి - నీటియందు, నావం - ఓడను, వాయుః ఇవ - గాలివలె, హరతి హి - హరించుచున్నది.
నీటిపై తెలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించిచున్నది.
తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః !
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ! 68
తస్మాత్ - యస్య - మహాబాహో - నిగృహీతాని - సర్వశః
ఇంద్రియాణి - ఇంద్రియార్థేభ్యః - తస్య - ప్రజ్ఞా - ప్రతిష్ఠితా
మహాబాహో - అర్జునా, తస్మాత్ - అందువలన, ఇంద్రియార్థేభ్యః - ఇంద్రియ విషయముల నుండి, సర్వశః - అన్ని విధముల, యస్య - ఎవనియొక్క, ఇంద్రియాణి - ఇంద్రియములు, నిగృహీతాని - నిగ్రహించిన, తస్య - పురుషుని యొక్క, ప్రజా - బుద్ధి, ప్రతిష్ఠితా - స్థిరమై యున్నది.
కనుక ఓ అర్జునా ! ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును.
యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ !
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ! 69
యా - నిశా - సర్వభూతానాం - తస్యాం - జాగర్తి - సంయమీ
యస్యాం - జాగ్రతి - భూతాని - సా - నిశా - పశ్యతః - మునేః
సర్వభూతానాం - సమస్త ప్రాణులకు, యా - ఏది, నిశా - రాత్రియో, తస్యాం - దానియందు, సంయమీ - యోగి, జాగర్తి - మేలుకొని యుండును, యస్యాం - దేనియందు, భూతాని - భూతములు, జాగ్రతి - మేలుకొని యుండునో, సా - అది, పశ్యతః - పరమాత్మ తత్వమొరిగిన మునికి, మునేః - మునికి, నిశా - రాత్రి.
సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కిని యుండును. ఎప్పుడు నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండునో అది పరమాత్మతత్వమునెరిగిన మునికి రాత్రిగానుండును.
ఆపూర్వమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ !
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ! 70
ఆపూర్వమాణం - అచల - ప్రతిష్ఠం - సముద్రం - ఆపః - ప్రవిశంతి - యద్వత్
తద్వత్ - కామాః - యం - ప్రవిశంతి - సర్వే - సః - శాంతి - ఆప్నోతి - న - కామకామీ
ఆపూర్వమాణం - అంతనిండినదియు, అచలప్రతిష్ఠం - చలించక నిలిచి యున్నదియను అగు, సముద్రం - సముద్రమును, ఆపః నీరు, యద్వత్ - ఏ విధముగ, ప్రవిశంతి - ప్రవేశించుచున్నదో, తద్వాత్ - అలాగుననే, కామాః - విషయములు, సర్వే - అన్నియును, యం - ఎవనిని, ప్రవిశంతి - చేరుచున్నవో, సః - అట్టి యోగి, శాంతిం - శాంతిని, అప్నోతి - పొందుచున్నాడు, కామకామీ - భోగసక్తుడు, న ఆప్నోతి - పొందలేడు.
సమస్త దిశల నుండి పొంగి ప్రవహించు వచ్చిచేరిన నదులన్నియును సముద్రమును ఏ విధముగ చలింపకయున్న ప్రవేశించుచున్నదో అలాగే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు.
ఆపూర్వమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ !
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ! 71
ఆపూర్వమాణం - అచల - ప్రతిష్ఠం - సముద్రం - ఆపః - ప్రవిశంతి - యద్వత్
తద్వత్ - కామాః యం - ప్రవిశంతి - సర్వే - స - శాంతి - ఆప్నోతి - న - కామకామీ
ఆపూర్వమాణం - అంతటనిండినదియు, అచలప్రతిష్ఠం - చలించక నిలిచి యున్నదియును అగు, సముద్రం - సముద్రమును, ఆపః - నీరు, యద్వత్ - ఏ విధముగ, ప్రవిశంతి - ప్రవేశించుచున్నదో, తద్వత్ - అలాగుననే, కామాః - విషయములు, సర్వే - అన్నియును, యం - ఎవనిని, ప్రవిశంతి - చేరుచున్నవో, సః - అట్టి యోగి, శాంతిం - శాంతిని, ఆప్నోతి - పొందుచున్నాడు, కామకామీ - భోగాసక్తుడు, న ఆప్నోతి - పొందలేడు.
సమస్తదిశల నుండి పొంగి ప్రవహించును వచ్చిచేరిన నదులన్నియును సముద్రమును ఏ విధముగ చలింపకయున్న ప్రవేశించుచున్నదో అలాగే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య నిముహ్యతి !
స్థిత్వాస్యామంతకాలేపాపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ! 72
ఏషా - బ్రాహ్మీ - స్థితిః - పార్థ - న - ఏనాం - ప్రాప్య - విముహ్యతి
స్థిత్వా - అస్యాం - అంతకాలే - అపి - బ్రహ్మనిర్వాణం - ఋచ్ఛతి
పార్థ - అర్జునా, ఏషా - ఇది, బ్రాహ్మీస్థితిః - బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి, ఏనాం - దీనిని, ప్రాప్య - పొంది, న - విముహ్యతి - మోహితుడు కాడు, అంతకాలే అపి - అంత్యకాలము నందు అస్యాం - ఈ యోగమునందు, స్థిత్వా - నిలిచి, బ్రహ్మానిర్వాణం - మోక్షము, ఋచ్ఛతి - పొందుచున్నాడు.
ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలము నందున ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రాహ్మీనందరూపమగును మోక్షమును పొందుచున్నాడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయోపాధ్యాయః