Siamese twins Spider Girls
సాలీడులా నడిచే అవిభాజ్య కవలలు
Siamese twins Spider Girls
గంగ, జమున అవిభాజ్య కవలలు (Siamese twins). కోల్కతాలో పుట్టిన వీరు అవిభాజ్యంగా ఉంటారు కనుక నిలబడగలరు కానీ, మామూలుగా నడవలేరు. ఎక్కువ దూరం అసలే నడవలేరు. ఆ నడక అచ్చం సాలీడును తలపిస్తుంది. ఈ కవలల నడక విషాదంతో కూడినదే అయినా కొంచెం తమాషాగా కూడా ఉంటుంది. గంగ, జమునలకి "The Human Indian Spider” అనే పేరు కూడా వచ్చింది. మనకు Spider Man సినిమాలు తెలుసు కానీ, అనుకరణలు కాకుండా నిజంగా స్పైడర్ లా నడవడం, మరోలా నడవలేకపోవడం వింతే.
పశ్చిమ బెంగాల్లో పుట్టిన గంగ, జమునలకి ఇప్పుడు నలభయ్యేళ్లు. అయినా చిన్న పిల్లల్లాగే ఉంటారు. వీళ్ళ అసలు పేర్లు ఆయరా, జయరా. వింతగా పుట్టడం వల్ల చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో తమ పేర్లు మార్చుకుని దేశంలో పవిత్రమైన, ప్రసిద్ధమైన నదుల పేర్లను పెట్టుకున్నారు.
కవలపిల్లలు పుట్టడం చాలా సహజం. అయితే వాళ్ళు పూర్తిగా విడివడకుండా పుడితే మట్టుకు కష్టమే. కొందరికి తల, ఇంకొందరికి పొట్ట, మరికొందరికి నడుము కింది భాగం కలిసిపోయి ఉంటుంది. ఇలాంటి సియామీస్ ట్విన్స్ ను విజయవంతంగా ఆపరేషన్ తో ఇద్దరూ సుఖంగా ఉండేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కవలల విషయం రాగానే మనకు డాక్టరు నాయుడమ్మ గుర్తొస్తారు. గుంటూరుకు చెందిన డాక్టరు నాయుడమ్మ అలాంటి శస్త్ర చికిత్సలు అనేకం చేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల లేదా, కాలయాపన చేయడం వల్ల కాదా, అసలే తెలీకపోవడం వల్ల, లేదా మరీ సంక్లిష్టంగా ఉండటం వల్ల కొందరు కవలలు జీవితాంతం అవిభాజ్యంగానే ఉండిపోతారు. అలాంటి అవిభాజ్య కవలలు (Siamese twins like Spider) గంగ, జమున. వాళ్ళిద్దరూ ఏ కారణంగా అయితేనేం కలిసే ఉండిపోయారు.
గంగ, జమునలకి రెండు గుండెలు, నాలుగు చేతులు ఉన్నాయి. కానీ మూడే కాళ్ళు ఉన్నాయి. నాలుగో కాలు ఉంది కానీ అది పూర్తిగా ఆశక్తమైంది. దాంతో అసలు ఆ కాలిని వాళ్ళు కనిపించకుండా దుస్తుల్లో దాచేస్తారు. చేతుల సాయం కూడా తీసుకుంటూ నడుస్తారు. వాళ్ళలా నడుస్తుంటే అచ్చం సాలీడులానే ఉంటుంది కనుక తమ ప్రదర్శనకు "The Spider Girls" అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కన్నడ, తమిళ భాషల్లో విడుదలైన ''H2O''చిత్రంలో నటించారు. ఇద్దరికీ విడిగా ఓటు హక్కు ఉంది, రెండు రేషన్ కార్డులు ఉన్నాయి కానీ, ఇద్దరూ ఒకే పళ్ళెంలో భోంచేస్తారు. వీరికి పిల్లల్ని కనాలని ఉంది కానీ అది ప్రమాదానికి దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరించారు.
సాధారణంగా అప్పుడప్పుడూ కలిసేవారికే బోల్డన్ని తేడాలు ఉంటాయి. తగాదాలు వస్తుంటాయి. మరి, అవిభాజ్యంగా ఉండి, క్షణం కూడా ఒకర్నొకరు వదిలిపెట్టడానికి వీల్లేని గంగ, జమునల మధ్య విభేదాలు ఉండవా అంటే.. ఎందుకు ఉండవు? చాలాసార్లు ఇద్దరి అభిప్రాయాలూ కలవవు. ఒక్కోసారి గొడవ పడతారు కూడా. గంగకి చేపల కూరంటే ఇష్టం. జమునకేమో మాంసం నచ్చుతుంది. గంగకి సాయంత్రాలు పుస్తకాలు చదవడమో, సంగీతం వినడమో సరదా. కానీ జమునకి అవేం నచ్చవు, ఖాళీ దొరికితే చాలు నిద్రపోవాలనుకుంటుంది. గంగకి అమితాబ్ బచ్చన్ అంటే మహా అభిమానం. కానీ, జమునకు ఆయన సినిమాలు నచ్చవు. గదాధర్ అనే వీధి నాటకాలు వేసే వ్యక్తిని ఈ కవలలు పెళ్ళి చేసుకున్నారు. ''వాళ్ళలో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం?'' అని గదాధర్ ను అడిగితే, ''ఇద్దరూ ఇష్టమే'' అని సమాధానం ఇచ్చాడు.
''మేం అవిభాజ్యంగా ఉన్నప్పటికీ ఇద్దరిమి. ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉండవు. వ్యక్తిత్వాలు ఒకలా ఉండవు. ఇలా తప్పనిసరిగా కలిసి ఉండటం ఎంతమాత్రం న్యాయం కాదు.. కానీ ఏం చేద్దాం?'' అంది గంగ ఒక సందర్భంలో. ఎంత విషాదం కదూ! అయితే వారిద్దరూ కూడా సర్జరీకి సిద్ధంగా లేరు. ''ఆపరేషన్లో అవిభాజ్య కవలలు చనిపోయే అవకాశం ఉందని మాత్రమే కాదు, విధి లిఖితాన్ని ఎదిరించిన చందమౌతుంది'' అంటారు.
Siamese twins Spider Girls, Ganga and Jamuna appeared in world news, spider girls Ganga and Jamuna, Siamese twins walks like spider, Siamese twins spider girls, Siamese twins ganga and jamuna married gadadhar, ganga jamuna miracle