Read more!

Mahashiva Powerful Trinetram

 

మహాశివుని మూడో కన్ను కల్పితం కానే కాదు...

Mahashiva Powerful Thrinethram

 

శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతారని విన్నాం కదూ! ఇది పుక్కిటి పురాణం కాదని, ఇందులో నూటికి నూరుశాతం నిజం ఉందని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనం మహాశివుని ప్రత్యక్షంగా చూసి, మూడోకన్ను ఉందా లేదా అని నిర్ధారించలేం. కానీ ఇలాంటి అత్యద్భుత విషయాలు ఈ ఆధునిక కాలంలో కూడా ఎదురౌతున్నాయి.

 

ఆమధ్య కొన్నాళ్ళ క్రితం నెల్యా మిఖైలోవా అనే రష్యన్ మహిళ వార్తల్లో వ్యక్తి అయింది. ఆమె దేని వంక అయినా నిశితంగా చూస్తే ఆ వస్తువు రెండుగా విడిపోవడం లేదా అక్కడినుండి కదలడం జరిగేది. ఆ సందర్భంలో అనేకమంది శాస్త్రవేత్తలు మిఖైలోవాపై పరిశోధనలు చేశారు. మెదడులోంచి వెలువడే విద్యుత్ ప్రకంపనాలను నమోదు చేశారు. అంటే E.E.G. సాయంతో పరీక్షించారు. అప్పుడు కొన్ని సంగతులు బయటపడ్డాయి.

 

మిఖైలోవాలో దృష్టి కేంద్రాన్ని నియంత్రించే భాగం చాలా శక్తివంతంగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆమెలో హృదయస్పందన విపరీతంగా ఉన్నట్లు కూడా తేలింది. సాధారణ హార్ట్ బీట్ తో పోలిస్తే ఆమె గుండె నాలుగురెట్లు ఎక్కువగా అంటే 240 సార్లు కొట్టుకున్నట్లు నమోదయింది. మిఖైలోవాలో ఈ శక్తి అన్నిసార్లూ కేంద్రీకృతమై ఉండదు. ఒక్కోసారి ఆమెచుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడంతో శక్తి తరంగాలు బయల్దేరతాయి. అవి ఆమె చూపుద్వారా ప్రసరించి, ఎదుట ఉన్నదానిపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రక్రియకు సైకోకెనిసిన్ అని పేరు పెట్టారు.

 

సైకోకెనిసిన్ వల్ల శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. అప్పుడు శక్తి తరంగాలు అయస్కాంత తత్వంతో ప్రకంపిస్తాయి. దాంతో ఒక వస్తువు దూరంగా జరగొచ్చు లేదా దరికి రావొచ్చు. రెండుగా చీలొచ్చు లేదా కాలిపోవచ్చు. ఈ శక్తి సూర్యచంద్రుల మధ్య ఆకర్షణ శక్తి లాంటిది.

 

ప్రపంచంలొ అనేక వింతలూ విడ్డూరాలు ఉన్నాయి. అవి అరుదుగా అప్పుడప్పుడూ సాక్షాత్కరిస్తుంటాయి. అలాంటి వింతల్లో శక్తివంతమైన చూపు ఒకటి. కనుక మహాశివుడు చూపుతో భస్మం చేయగలడు అనేది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆ దివ్యశక్తినిబట్టి ''త్రినేత్రం'' అన్నారు.

 

Mahashiva's 3rd eye Trinetram, mahashiva's 3rd eye is real, mysterious hindu epic stories, mysterious things in hindu epics, Mahashiva's Powerful Thrinethram, lord shiva's thrinethra (3rd eye) burns, lord shiva's trinetra wonderful vision