డిసెంబర్ 1.. మోక్షద ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే పితృదోషాలు, అరిష్టాలు మాయం..!
డిసెంబర్ 1.. మోక్షద ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే పితృదోషాలు, అరిష్టాలు మాయం..!
హిందూ ధర్మంలో పూజ, వ్రతం, ప్రత్యేక తిథులు, పండుగలు.. ఇలా ప్రతీది చాలా ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఆయా తిథి, రోజు సందర్భంగా ఆచరించే పరిహారాలు, తీసుకునే చర్యలు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడతాయి. అలాంటి ప్రశస్తమైన తిథులలో ఏకాదశి తిథి చాలా ప్రత్యేకమైనది. 2025 డిసెంబర్ 1వ తేదీన మార్గశిర శుక్లపక్ష ఏకాదశి వచ్చింది. దీన్ని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు కొన్ని చర్యలు పాటించడం వల్ల పితృదోషాలు, అరిష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంతకూ మోక్షద ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు, చర్యలు ఏంటో తెలుసుకుంటే..
ఉపవాసం..
మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అది ఉపవాసం ఉండే వారికి మాత్రమే కాకుండా పితృదేవతలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.
సోమవారం, ఏకాదశి..
మోక్షద ఏకాదశి సోమవారం రోజున వచ్చింది. స్మార్త, వైష్ణవ శాఖల ప్రకారం ఏకాదశి తిథి డిసెంబర్ 1వ తేదీ మొత్తం ఉంది. ఈ కారణంగా ఈ రోజు ఉపవాసం, పూజకు చాలా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
దీపారాధన పరిష్కారాలు..
మోక్షద ఏకాదశి రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా మంచిది. ఇది ప్రతికూల శక్తిని ఇంట్లోకి రానివ్వకుండా నిరోధిస్తుందని చెబుతారు. ఇది ఇంటికి, కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందట.
నెయ్యి దీపం..
కుటుంబంలో అన్ని విధాల ఎదుగుదల ఉండాలన్నా, ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలన్నా మోక్షద ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. సాధారణ రోజుల్లో కంటే ఏకాదశి రోజు నెయ్యి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కూడా. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
పితృదేవతలకు శ్రేష్టం..
మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం, పూజ, దీపం మొదలైనవి అన్నీ పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా రావిచెట్టు పితృదేవతల నివాసంగా పరిగణించబడుతుందట. మోక్షద ఏకాదశి రోజు రావిచెట్టు కింద దీపం వెలిగించి పితృదేవతలను ప్రార్థించాలి. ఇది పితృదేవతలను తృప్తి పరచడంతో పాటు వారి ఆశీర్వాదం లభించేలా చేస్తుంది.
*రూపశ్రీ.