Swayamvar in Shiva Purana

 

స్వయం 'వరం'

Swayamvar in Shiva Purana

''నీ కూతురి స్వయంవరానికి తప్పకుండా వస్తా''నని మాటిచ్చి రాజును, రమాదేవినీ ఆశీర్వదించి అక్కడినుంచి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు.

 

శ్రీదేవి పాదాలను వత్తుతుంటే, మెత్తనైన శేషతల్పంపై శయన భంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించి భక్తిగా నమస్కరించాడు. మునీంద్రుని చూసిన శ్రీహరి ఉచితరీతిన సత్కరించి కుశలప్రశ్నలు అడిగిన అనంతరం నారదుడు ఇలా చెప్పాడు.

 

''స్వామీ! లోకంలో నిన్ను మించిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ అందమైన జీవితాన్ని గడుపుతున్నావు. భార్యవల్ల కలిగే సుఖం ముందు ఇంకే సుఖమైనా తృణప్రాయమే అంటారు.

 

విశాలమైన ఆ సభామంటపమంతా వివిధ దేశాధీశులతోనూ, రాకుమారులతోనూ నిండి ఉంది. అయితే అక్కడ కూర్చున్న వారి నేత్రాలు మాత్రం అపరంజిబొమ్మను, అందాలరాశిని ఎప్పుడెప్పుడు సందర్శిద్దామా అన్న ఆకాంక్షతో వేగిపోతున్నాయి.

 

ఇక నారదుడైతే చెప్పనవసరమే లేదు. రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టూ, ఆమెతో తాను స్వర్గసుఖాలు అనుభవిస్తున్నట్టు ఊహాలోకంలో తెలిపోతున్నాడు. అలా ఎవరి ఊహల్లో వారు తన్మయులై ఉన్న వేళ ... ఒక్కసారి కళ్యాణపురాధీశుడు మండపాన్ని చేరుకోవడంతో వారి ఊహాలోకానికి తెరపడ్డట్లయింది.

 

ఆస్థాన పురోహితుడు వేదమంత్రాలు చదువుతుంటే, శ్రావ్యమైన రీతిలో మంగళవాద్యాలు మిన్నంటి మోగుతుంటే, చేతిలో పూలమాల పట్టుకుని అందమైన మేలిముసుగులో అనేకమంది చెలికత్తెలు వెంటరాగా, సౌకుమార్యంగా నడుచుకుంటూ సభామండపాన్ని చేరుకుంది విరికొమ్మ, పూరెమ్మ అయిన రమాదేవి.

 

ఆమె ఇక్కడకు రాకముందే ఆమె గురించి ఎన్నో కలలుగన్న రాజులంతా ఇక ఆమెను చూసేసరికి మరింత ఆశలు పెంచుకున్నారు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలన్న ధృడనిశ్చయానికి వచ్చారు. స్వయంవరానికి వచ్చిన వారిని ఉద్దేశించి కళ్యాణపురాధీశుడు ''అయ్యా! ఎక్కడెక్కడినుండో ఈ స్వయంవరం కోసం ఇక్కడకు ఏతెంచిన మీ అందరికీ నా అభినందనలు. నా కూతురైన రమాదేవి స్వయంవరానికి ఇంతమంది హాజరుకావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీలో ఒకరి గళసీమలోనో నా కూతురు వరమాలను వేస్తుంది. ఆ భాగ్యశాలి నాకు అల్లుడు’’ అని, వెంటనే కూతురివైపు చూసి ఇలా అన్నాడు.

 

''తల్లీ! ఇంతమంది రాజులలో నీకు నచ్చిన వరుడెవరో తేల్చుకునే శుభతరుణం ఇది. ఆలస్యమైనా బాగా ఆలోచించుకుని నీ భాగస్వామిని ఎంచుకో’’మని ఆదేశించాడు.

 

తండ్రి మాటకోసమే ఎదురుచూస్తున్న ఆ పూబోణి అప్పటికే తాను ఎవర్ని కట్టుకోవాలో మనసులో గట్టిగా నిర్ణయించుకోవడంతో అంతే స్థిరంగా రాకుమారులవైపు అడుగుల్ని కదిపింది. ఆమె కళ్ళు తన మనోహరుడి కోసం వెతుకులాడుతుండగా ముందుకు నడిచింది.

 

ఇంకా ఉంది.....

 

shiva purana part 3, shiva purana in telugu, divine shiv purana, shiv purana gives moksha