Eluru Sri Rama Temple Miracle

 

ఏలూరు రామాలయంలో అద్భుతం

Eluru Sri Rama Temple Miracle

 

Click here for the VIDEO

 

మీరెప్పుడైనా పాల తరకపై దేవుణ్ణి చూశారా? లేదు కదూ! ఈ అద్భుతం ఏలూరు కోదండ రామ ఆలయంలో జరిగింది. అవును, పాల తరకపై వివిధ దేవుళ్ళ ఆకృతులు దర్శనమిచ్చాయి. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ఏలూరు రామచంద్రాపురంలో శ్రీరామ ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండగా ఈ అబ్బురపరిచే వింత జరిగింది. ఆలయానికి అనుబంధంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, సాయిబాబా, వీరాంజనేయస్వామి ఉపాలయాలు నిర్మిస్తున్నారు. అందుకోసమై ఈ దేవుళ్ళ విగ్రహాలకు సోమవారంనాడు క్షీరాభిషేకం చేశారు. మూడడుగుల లోతు ఉన్న తొట్టిలో విగ్రహాలను ఉంచి పాలు పోశారు. తొట్టిలో మూడు అడుగుల లోతులో విగ్రహాలు ఉండగా, మంగళవారం ఉదయానికి వాటి ఆకృతి, పాల తరకపై పైకి స్పష్టంగా ఏర్పడి కనిపించడం నమ్మశక్యం కాకుండా ఉందంటూ సంతోషంగా చెప్తున్నారు. పాలపై దేవుళ్ళ ప్రతిరూపాలు చూట్టం చాలా ఆనందంగా ఉందని, దైవలీల అని భక్తులు ఉద్విగ్నంగా చెప్తున్నారు.

 

Kodandarama temple god appeared, Wonder at Eluru Rama Temple Video, Gods appeared on milk video, miracle in eluru rama temple video, srirama temple reconstruction miracle, gods on milk wonder video