కైలాస యాత్ర చేస్తే వయసు తగ్గుతుందా..
కైలాస యాత్ర చేస్తే వయసు తగ్గుతుందా..
కైలాస పర్వతం అంటే ఆ పరమేశ్వరుని నివాసం. హిమాలయాలలో కైలాస పర్వతం ఉంది. కైలాస పర్వతం 22వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది కేవలం పర్వతం అని చెప్పలేం. ఇది ఆ పరమశివుడు నివాసం అనే కారణం చేత చాలా పవిత్రత సంతరించుకుంది. కైలాస వర్వతానని చేరితే మనసు, ఆత్మ, శరీరం మూడు కూడా చాలా శాంతికి లోనవుతాయని అంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే.. కైలాస యాత్ర తర్వాత చాలా మంది తమకు వయస్సు తగ్గుతున్న అనిపిస్తుందని చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది. దీన్ని పుకారు అని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా కొందరు చెబుతున్న విషయం. దీని గురించి పూర్తీగా తెలసుకుంటే..
జుట్టు రంగు..
కైలాస యాత్ర చేసినవారు స్పష్టంగా గమనించిన విషయం. జుట్టు రంగు మారడం. కైలాస యాత్ర తర్వాత చాలామందికి తెల్లగా ఉన్న జుట్టు తిరిగి నల్లగా మారిందట. ఇది వాతావరణంలో మార్పులు, మానసికంగా మార్పులు రావడం, ప్రశాంతత చేకూరడం వల్ల శరీరంలో జరిగే మార్పుల వల్ల సంభవించి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
చర్మం..
మూడు రోజుల పాటు కైలాస ప్రదక్షిణ చేసిన తర్వాత చాలామంది తమ శరీర చర్మంలో మార్పులు గమనించామని చెబుతున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబారే సమస్య, మొటిమలు, చికాకు, చర్మం ముడతలు. మొదలైనవన్నీ తొలగిపోయినట్టు చెబుతున్నారు.
కళ్లలో మెరుపు..
చాలామందికి మనిషి శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కళ్లలో వ్యక్తం అవుతుందని అంటుంటారు. కైలాస యాత్ర చేసిన వారి విషయంలో ఇది స్పష్టం అవుతోంది. కైలాస యాత్ర చేసిన వారికి కళ్లలో కొత్త మెరుపు చోటు చేసుకుంటుందట. కళ్లు ప్రకాశవంతంగా, అందరినీ ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటాయట.
గోర్లు, జుట్టు..
కైలాస యాత్ర తర్వాత గోర్లు, జుట్టు చాలా వేగంగా పెరుగుతాయట. ఇలా జరగడం వెనుక ఒక కారణం చెబుతున్నారు. కైలాస యాత్ర తర్వాత శరీరం కొత్త శక్తితో నిండుతుందని, దీని కారణంగా గోర్లు, జుట్టు వేగంగా పెరుగుతాయని అంటున్నారు.
శక్తి..
కైలాస యాత్ర చాలా కష్టంతో కూడుకున్నది. ఇది శరీరానికి ఒక విధంగా మంచి శిక్షణ వంటిది. ఇలా కైలాస యాత్ర పూర్తీ చేసిన వారికి శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందట. శరీరం మునుపటికంటే ఉత్సాహంగా మారుతుందట. అందుకే యవ్వనంగా మారుతారని అంటున్నారు.
గుండె ఆరోగ్యం..
కైలాస పర్వత యాత్ర వల్ల గుండె ఆరోగ్యం మరింత బలపడుతుందట. పర్వత ప్రాంతం కావడంతో పర్వతం ఎత్తు, స్వచ్చమైన గాలి శరీరాన్న చాలా రీఛార్జీ చేస్తాయట. ఇది శ్వాస సామర్థ్యాన్ని, హృదయ స్పందనను మెరుగుపరుస్తాయి.
*రూపశ్రీ.