అర్జునుడు తన సొంత కుమారుడి చేతిలోనే మరణించాడా...

 

అర్జునుడు తన సొంత కుమారుడి చేతిలోనే మరణించాడా...

మహాభారతంలో  ముఖ్యమైన పాత్రలలో  అర్జునుడి ఒకరు. అర్జునుడి గురించి చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.  అర్జునుడు గొప్ప విలుకాడు.  మహాభారతంలో గొప్ప యోధుడు. మహాభారత యుద్ధంలో గొప్ప యోధులు కూడా ఆయనను ఓడించలేకపోయారు, కానీ అర్జునుడి ప్రాణాన్ని అతని కొడుకు తీశాడనే ఒక కథ ప్రచారంలో ఉంది. అసలు  అర్జునుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు?  పిల్లలు ఎంతమంది? కొడుకే అర్ఝునుడిని చంపాడనే విషయంలో వాస్తవం ఎంత? పూర్తీగా తెలుసుకుంటే..

అర్జునుడికి నలుగురు భార్యలు ఉన్నారు.  ద్రౌపది, సుభద్ర, ఉలుపి,  చిత్రాంగద. ద్రౌపది,  అర్జునుడి కొడుకు పేరు శ్రుతకర్మ, అభిమన్యుడు సుభద్రకు జన్మించాడు. నాగకన్య ఉలుపి ఇరావణుడికి జన్మనిచ్చింది,  చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడు. అర్జునుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి  భాగంగా బయలుదేరినప్పుడు ఉలుపి,  చిత్రాంగదలను వివాహం చేసుకున్నాడని వారికి   కుమారులు వారికి జన్మించారని చెబుతారు. కుమారులకు జన్మనిచ్చిన తర్వాత అర్జునుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ముందుకు సాగినప్పుడు, ఉలుపి అతన్ని ఆపడానికి ప్రయత్నించిందట.  కానీ అర్జునుడు ఆగలేదు. ఇది ఉలుపి మనస్సులో అర్జునుడి పట్ల కోపాన్ని సృష్టించిందని అంటారు. ఆ కోపం  అది క్రమంగా పెరిగిందని,  ఉలుపి అర్జునుడి మీద ద్వేషం పెంచుకునేలా చేసిందని అంటారు.

దీని తరువాత ఉలుపి చిత్రాంగదకు జన్మించిన బభ్రువాహనుడి మనస్సులో చిన్నప్పటి నుంచీ ద్వేషాన్ని నింపడం ప్రారంభించిందని చెబుతారు. క్రమంగా ఉలుపి సవతి కొడుకు బభ్రువాహనుడు కూడా అర్జునుడిని ద్వేషించడం ప్రారంభించాడట.  అతను తన తండ్రిని ద్వేషించడం ప్రారంభించాడు. మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు అశ్వమేధ యజ్ఞం చేశాడని చెబుతారు. అప్పుడు అర్జునుడిని యాగ గుర్రానికి రక్షకుడిగా నియమించారు. అర్జునుడు ఆ గుర్రాన్ని అనుసరించేవాడు.


ఆ గుర్రం తిరుగుతూ ఈశాన్య భారతదేశానికి చేరుకుందని చెబుతారు. ఆ సమయంలో మణిపూర్ రాజు బభ్రువాహనుడు. అర్జునుడి రాక గురించి తెలుసుకుని, గుర్రాన్ని కాపాడుకుంటూ తన రాజ్య సరిహద్దులోకి ప్రవేశించాడని తెలుసుకున్న బభ్రువాహనుడు ఉలుపి సలహా మేరకు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన తండ్రి అర్జునుడితో పోరాడాడట. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో, బభ్రువాహనుడు స్పృహ తప్పి పడిపోయాడు, అర్జునుడు చంపబడ్డాడు అని చెబుతారు.


అర్జునుడి మరణ వార్త విన్న చిత్రాంగద అక్కడికి చేరుకుని దుఃఖించడం ప్రారంభించిందట. బబ్రువాహనుడి కోపం కూడా తగ్గిపోయి తన తండ్రి మరణం గురించి దుఃఖించసాగాడట. అప్పుడు చిత్రాంగదు ఉలుపికి వివరించి అర్జునుడి పట్ల తన శత్రుత్వాన్ని వదులుకోమని చెప్పింది. ఉలుపి నాగకన్య కావడంతో ఆమె వద్ద సంజీవని మాణిక్యం ఉందట.  ఉలుపి ఆ అద్భుతమైన మణితో అర్జునుడిని బ్రతికించిందని చెబుతారు. ఇది మాత్రమే కాదు యుద్ధంలో భీష్మ పితామహుడిని చంపినందుకు అర్జునుడికి విధించబడిన శాపం నుండి కూడా ఉలుపి అర్జునుడిని విడిపించిందని అంటారు. ఉలుపికి అర్జునుడి నాల్గవ భార్య అయిన మత్స్యకన్య హోదా ఇవ్వబడింది. ఉలుపి అర్జునుడు స్వర్గానికి వెళ్లేవరకు అతనితోనే ఉందని చెబుతారు.

                              *రూపశ్రీ.