జీవితంలో లక్ష్యాలు సాధించాలంటే భగవద్గీత చెప్పిన విషయాలు గుర్తుంచుకోవాలి!
జీవితంలో లక్ష్యాలు సాధించాలంటే భగవద్గీత చెప్పిన విషయాలు గుర్తుంచుకోవాలి!
భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన బోధనల సారం. అర్జునుడు కృష్ణుడి బోధనలను విన్న తర్వాతే యుద్ధానికి వెళ్లాడు. అందుకే నేటికీ చాలామంది మార్గదర్శకత్వం తెలియక, కష్ట సమయాల్లో ఇన్నప్పుడు సరైన మార్గదర్శకత్వం కోసం భగవద్గీతను చదువుతారు. భగవద్గీత మనిషి జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. భగవద్గీత చదివితే మానసిక బలం, ఓర్పు, సరైన దిశలో వెళ్లే జ్ఞానం లభిస్తాయి. ఇక ప్రతి మనిషి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించాలి అంటే భగవద్గీతలో చెప్పిన కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుంటే..
ఫలితం..
ఫలితాలపై దృష్టి పెట్టకుండా, మనిషి తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. ఫలితాల గురించి చింతించడం ఎల్లప్పుడూ మనిషిని
బలహీనపరుస్తుందని నమ్ముతారు.
మార్పు..
గీత ప్రకారం, జీవితంలో మార్పు అనేది ఒక వాస్తవం. కాబట్టి, దానిని ఎల్లప్పుడూ స్వీకరించాలి. ఈ మార్పులను సులభంగా అంగీకరించేవారు మానసికంగా సమతుల్యంగా ఉండి విజయం సాధిస్తారు.
గర్వం..
కృష్ణుడు ఎప్పుడూ దేనికీ గర్వపడకూడదని చెబుతాడు. అంతేకాకుండా, దేనితోనూ అతిగా అనుబంధం కలిగి ఉండకూడదు. అనుబంధాలతో, అహంకారంతో బధీ అయిపోయిన వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేడు, మానసికంగా బలంగా ఉండలేడు.
కోరికలు..
సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రతి వ్యక్తి తన కోరికలను నియంత్రించుకోవాలి. మనస్సుపై నియంత్రణ లేకపోతే జీవితంలో దారితప్పే అవకాశాలే ఎక్కువ.
సహనం..
గీత ప్రకారం, కష్ట సమయాల్లో సహనం మనిషిని చాలా గట్టిగా నిలబెడుతుంది. కాబట్టి, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో తమ మీద తాము నమ్మకం ఉంచి సహనంతో ఉండాలి.
పై విషయాలన్నీ గుర్తుంచుకుని వాటిని పాటిస్తే ప్రతి వ్యక్తి ఏ లక్ష్యాన్ని అయినా తప్పకుండా సాధించగలుగుతాడు.
*రూపశ్రీ.