అప్పుల బాధలు పోవాలంటే వసంత నవరాత్రులు ముగిసేలోపు ఈ పరిహారం చేయండి!
అప్పుల బాధలు పోవాలంటే వసంత నవరాత్రులు ముగిసేలోపు ఈ పరిహారం చేయండి!
నవరాత్రులు శక్తి ఆరాధనకు గొప్ప అవకాశం. మార్చి 19వ తేదీ చైత్ర మాస పాడ్యమి నుండి, నవమి వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులలో ఆ అమ్మవారిని ఆరాధిస్తే ఎంతో పుణ్యాన్ని, మరెంతో దైర్యాన్ని, ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. ఈ వసంత నవరాత్రులలో ఉపవాసం, పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నవారు, అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు వసంత నవరాత్రులలో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. పసుపు ఆవాలతో చేసే కొన్ని పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
నెగిటివ్ ఎనర్జీకి..
ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి పసుపు ఆవాలతో మంచి పరిహారం చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతికూలత ఉండి, కుటుంబ అనవసరంగా కలత చెందుతూ, గొడవలు, మరియు ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూ ఉంటే నవరాత్రుల సమయంలో కొన్ని పసుపు ఆవాలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటగా కట్టాలి. ఆ తర్వాత దానిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి. ఈ పరిహారం ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులకు పసుపు ఆవాల పరిష్కారం..
చాలామంది కష్టపడి పనిచేసినా, కష్టపడి సంపాదించినా వారి ఆర్థిక స్థితి మాత్రం అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల లేకపోదా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నట్లయితే, నవరాత్రుల సమయంలో రాత్రిపూట గుప్పెడు పసుపు ఆవాలను తలపై ఏడుసార్లు చల్లుకుని, ఆ తర్వాత దానిని నిర్మానుష్యమైన ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో పారవేయాలి. ఇది ధనం రావడానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది.
రుణ విముక్తికి..
చాలామంది ఏదో అవసరం కోసం అప్పు చేస్తారు. కానీ ఆ తరువాత అప్పు తీర్చాలని ఎంత ప్రయత్నం చేసినా అప్పు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి వారు నవరాత్రుల సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు ఆవాలు కట్టి, దానిని షెల్ప్ లో లేదా డబ్బు ఉంచే లాకర్‌లో ఉంచాలి. ఆర్థిక సమస్యలు తీరడం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించాలి.
ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం..
నవరాత్రి పూజ సమయంలో ఒక వెండి గిన్నెలో గుప్పెడు ఆవాలు వేసి అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. ఆ తర్వాత పూజ చేయాలి. దీనితో ఆధ్యాత్మిక సాధన పూర్తవుతుంది, అమ్మవారి నుండి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులకు..
ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి సాధించలేక, పదేపదే అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లయితే, నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా మంగళవారాలు, ఆదివారాలలో, పసుపు ఆవాలను మ తల మీదుగా ఏడుసార్లు విసిరి, ఆ తర్వాత వాటిని మీ ఇంటి బయట, దక్షిణం వైపుకు లేదా ఏదైనా కూడలిలో పారవేయాలి. ఇది వృత్తిలోని అడ్డంకులను తొలగిస్తుంది.
గమనిక..
పరిహారాలను చేసేటప్పుడు మనస్సులో సంపూర్ణ విశ్వాసంతో పరిహారాలు చేయాలి. "ఓం దమ్ దుర్గాయ నమః" అనే అమ్మవారి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండాలి. ఇది ఈ పరిహారాల ప్రభావాన్ని అనేక రెట్లు పెంచుతుంది.
*రూపశ్రీ.