భగవద్గీతలో అర్జునుడు ప్రస్తావించే సమాధి వెనుక అర్థమిదే...
భగవద్గీతలో అర్జునుడు ప్రస్తావించే సమాధి వెనుక అర్థమిదే...
ఆధ్యాత్మిక సాధనలో ప్రతి ఒక్కరూ అత్యున్నత దశకు చేరుకునేది సమాధి స్థితిని పొందితేనే.. సమాధి స్థితి అనేది ధ్యానంలో ఎంతో సాధన చేస్తే తప్ప సాధ్యం కాదని అంటారు. అయితే సమాధి గురించి చాలామందికి స్పష్టత లేదు.
'సమాధి' అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి 'జ్ఞాన సమాధి' అయితే, రెండవది 'ధ్యానసమాధి'. ధ్యాన సమాధిలో ఉన్నపుడు సాధకుడు బహిః ప్రజ్ఞారహితుడై వుంటాడు. అంటే ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు అతను కదలడు, మెదలడు, మాట్లాడడు. ధ్యానం కొనసాగినంతవరకు ఇది అలాగే కొనసాగుతుంది. ధ్యానము ముగిసిన తరువాత మాత్రమే ఆ వ్యక్తి మాట్లాడటం కానీ లేదా ఇతర పనులు కానీ చేస్తాడు.
భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నలో సమాధి అనేది ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. ధ్యాన సమాధి గురించి ఎవరికైనా అవగాహ ఉంటే కనుక అందరూ అర్జునుడు ప్రస్తావించింది అదేనేమో అనుకుంటారు. కానీ అర్జునుడు అడిగే సందేహం అది కాదు. కొందరు అర్జునుని ప్రశ్నను "సమాధి తరువాత సాధకుడు ఎలా ఉంటాడు?? డును, ఆ మాట్లాడతాడు" వంటి ప్రశ్నలు వెతుక్కుంటారు.
కాని అర్జునుని ప్రశ్న అదికాదు. ధ్యావ సమాధిలో చిత్తవృత్తులు నిరోధించబడినాయి. అయితే ఎంత వరకు ఈ నిరోధం అనేది ఉంటుందో.. అంతవరకు సాధకుడికి ఈ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. కాని అర్జునుని ప్రశ్న జ్ఞాన సమాధిని గురించి. జ్ఞానసమాధి అనేది సహజస్థితి. అది సాధకునిలో అన్ని సమయాలలో నెలకొని ఉంటుంది.
"ఏషా బ్రాహ్మీ స్థితిః" అని భగవద్గీతలో చెప్పారు కానీ "బ్రహ్మీ వృత్తి" అని చెప్పలేదు. అంటే హఠయోగముతో కానీ మరేవిధమైన యోగముతో కాని పొందిన సమాధి ప్రాణమును నిరోధించినంతవరకు మాత్రమే వుంటుంది. కాని అర్జునుని ప్రశ్న సహజంగా జ్ఞాన సమాధిని సాధించిన వ్యక్తి జీవితంలో ప్రతి నిమిషము ఎలా వుంటాడు అని.
దీనికి ఒక నిదర్శనము ఉంది. ఛాంగదేవ జ్ఞానదేవుల జీవితములోని ఒక ఉదంతం. ఛాంగదేవుడు హఠయోగం చేత 1400 సంవత్సరాలు జీవించాడు. జ్ఞానదేవుని సందర్శించాలని చాంగదేవుడు తలచాడు. తన రాకను తెలియ జేయడానికై ఒక పత్రమును పంపాలని అనుకున్నాడు.
జ్ఞానదేవుడు తనకన్న వయసులో చిన్నవాడు. కాబట్టి అతన్ని ఆశీర్వదిస్తూ వ్రాయాలా అనే సందేహం కలిగింది. కాని అతడు జ్ఞానంలో తనకన్న ఎక్కువ కాబట్టి నమస్కారాలు తెలుపుతూ జాబు ప్రారంభించాలా అని సందేహంతో ఏమీ వ్రాయక ఖాళీ తాళపత్రాన్ని జ్ఞానదేవుడికి పంపాడు. జ్ఞానదేవుడు అతని అన్న నివృత్త నాధుడు, చెల్లి ముక్తాబాయి వేదాంత చర్చ చేస్తూండే సమయంలో చాంగదేవుడు పంపిన తాళపత్రం అందింది.
జ్ఞానదేవుడు దాన్ని చూసి చెల్లెలు ముక్తాబాయికి అందించారు. దాన్నిచూచి ముక్తారాయి "దొంగ దేవుని హృదయము హస్యము" అని వ్యాఖ్యానించింది. నివృత్తనాధుడుచూచి ఈతని హృదయము స్వచ్ఛమయింది. ఉపదేశార్హమైనది అని వ్యాఖ్యానించాడు. ఎంత సాధించినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా ధ్యాససమాధిలోనున్న వ్యక్తి వాసనలనుండి విముక్తుడు కాలేకపోయినాడు.
అదే అర్జునుడు చెప్పే విషయానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ సమాధి అంటే ధ్యానంలో పొంగేది కాదు. జ్ఞానం అని అర్థం.
◆నిశ్శబ్ద.