కుండలిని శక్తి ఎలా మేల్కొంటుంది.. అది మేల్కొంటే ఏం జరుగుతుంది!
కుండలిని శక్తి ఎలా మేల్కొంటుంది.. అది మేల్కొంటే ఏం జరుగుతుంది!
ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి కుండలిని అనే పదం సుపరిచితమే.. ధ్యానం ద్వారా శరీరంలో కుండలిని శక్తి మేల్కొంటుందని యోగులు, సాధకులు చెబుతుంటారు. అయితే ఈ కుండలిని శక్తి ధ్యానం చేసే అందరికీ సిద్దించదు. కుండలిని శక్తి జాగృతం కావాలంటే చాలా సాధన అవసరం. ఈ కుండలిని శక్తి మేల్కున్నప్పుడు మనిషికి జ్ఞానోదయం అవుతుందని అంటారు. చాలామంది తమ శరీరంలో కుండలిని శక్తిని జాగృతం చేయడానికి దాన్ని మేల్కొపడానికి ధ్యాన సాధన చేస్తుంటారు. ఈ కుండలిని శక్తి ఎలా మేల్కొంటుందో తెలుసుకుంటే..
కుండలిని శక్తిని మేల్కొలపడం ధ్యాన సాధకుల లక్ష్యంగా చెబుతారు. అయితే ఈ కుండలిని శక్తి చాలా కఠినమైన యోగా, ధ్యానం, ప్రాణాయామం, మంత్ర సాధన ద్వారా మేల్కుంటుంది. అయితే ఈ కుండలిని శక్తి మేల్కున్న వ్యక్తి పరమాత్మకు ప్రతిరూపంగా పేర్కొంటారు.
మనిషి శరీరం లోపల ఏడు చక్రాలు ఉంటాయి. వాటిలో కుండలిని కూడా ఒకటి. ఇది శరీరంలో పాములాగా చుట్ట చుట్టుకుని మూడు రౌండ్లుగా ఉంటుందట. ఇది శరీరం లోపల మూలాధార చక్రంలో ఉంటుంది.
కుండలిని శక్తి నిద్రాణంగా ఉన్నంత కాలం వ్యక్తి ప్రాపంచిక విషయాలలోనూ, బాహ్య సుఖాలలోనూ మునిగిపోతాడు. అయితే కుండలిని శక్తి మేల్కొనడం ప్రారంభించినప్పుడు వ్యక్తిలో దైవిక శక్తులు మేల్కొంటాయి. దైవిక అనుభవాలు ఎదురవుతాయి.
కుండలిని శక్తి ధ్యానం చేయడం ద్వారా మేల్కుంటుంది. అయితే వ్యక్తి ధ్యానం చేయడం ఆపేస్తే అది తన స్థానాన్ని మార్చుకుంటుంది. శరీరంలో ఏదైనా భాగంలో ఉంటుంది. అది ఎక్కడికి వెళ్లినా అది ఉన్న ప్రాంతలోని ప్రతికూల శక్తిని అణిచివేస్తుంది.
కుండలిని శక్తి మేల్కున్నప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక ప్రాయాణం చాలా లోతుగా సాగుతుంది. మనిషి శారీరక, మానసిక శక్తులు బలపడతాయి. వ్యక్తిలో ఆకర్షణ, వర్ణించలేని కాంతి, చాలా ప్రశాంతత, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్గతంగా సమయాన్ని గడపడం, ఏకాంతంగా ఉండటం. వ్యక్తి శరీరం చాలా తేలికగా అనిపించడం జరుగుతుంది.
కుండలిని శక్తి మేల్కుంటే ఇంద్రియాల పనితీరు చాలా నియంత్రణలో ఉంటుంది. ధ్యానం చేస్తుండగానే శ్వాస ఆగిపోవడం, ఆత్మ శరీరం నుండి వేరుకావడం, ఆత్మ ప్రయాణం వంటి అనుభవాలు కూడా కలుగుతాయి. కుండలిని మేల్కున్నప్పుడు ముఖ్యంగా వెన్నుపాములో కంపనాలు కలుగుతాయి. మూలాధార చక్రం జాగృతం అవుతుంది.
*రూపశ్రీ.