ఆంజనేయునికి హనుమన్నామము – దేవతల వరములు
ఆంజనేయునికి హనుమన్నామము – దేవతల వరములు
వాయుదేవుడు బాలుని ఎత్తుకుని గుహలోకి వెళ్ళిపోయేను. ఇంద్రునిపై తీవ్ర కోపము కలిగెను. వెంటనే అతడు తన గతిని బంధిచేను. వాయుప్రసారము లేకపోవుటతో ప్రపచంమంతటా కల్లోలము బయలుదేరును. ముల్లోకములలోనూ ఏదిను కదలుట లేదు. అందరి శ్వాస కార్యములనూ బంధింపబడిపోయ్యాయి. దేవతలు భయపడిపోయారు. మహేంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. బ్రహ్మదేవుని సమీపించి విషయములను వివరించారు. దేవతా ప్రముఖులను వెంటపెట్టుకొని ఆ పర్వత గుహలోకి వచ్చి, బాలుని స్పర్శించుసరికి అతడు ఆనందముతో లేచి నిలబడ్డాడు. దానితో వాయు దేవుడు పరమానంద సంభరితుడయ్యెను. వెంటనే జగత్తు అంతయు ప్రాణవాయు సంచరించింది. బ్రహ్మదేవుడు అమరులనుద్దేశించి”ఈ బాలుడు సాధారణుడుకాదు.
దేవతాకార్యసిద్ధ్యర్ద అతరించినాడు. కనుక దేవలందరూ ఇతనికి వరములను ఇవ్వాలి అనెను. అంతలో మహేంద్రుడు ఆనందపారవశ్యమున “నా వజ్రముల వలన ఇతని హనువు భగ్నమైనది కనుక నేటిను౦డి ఇతడు హనుమంతుడని పిలవబడగలడు. నా వజ్రము వలన ఇతనికి ఎన్నడునూ ఏ అపాయము కలగదు అనెను. “నా శతాంశతేజమును ఇతనికి ఇచ్చుచున్నాను. నాశక్తితో ఇతడు తన రూపమును అభిష్టప్రకారము మార్చుకొనగలడు. ఇతనికి శాస్త్రాధ్యయనేచ్చ కలుగనని నేను అతనిచే సమస్త శాస్త్రములనూ అధ్యయనము చేయించెదను. ఇతడు మహావాజ్మియుడు అవును అని సూర్యభగవానుడు పలికాడు. అదే విధముగా వరుణ, కుబేర విశ్వకర్మాది దేవతలందరూ బాలహనుమంతునకు వరములను ప్రసాదించిరి. బ్రహ్మదేవుడు వరములను ఇస్తూ ఈ బాలుడు బ్రహ్మజ్ఞానియై, బ్రహ్మస్త్ర బ్రహ్మపాశవిముక్తుడైయు౦డుగాక!” అని ఆశీర్వదించి, వాయుదేవుని ఉద్దేశించి “నీ కుమారుడు మహా వీరుడై, స్వేచ్చా రుపధారణా సమర్ధుడై, అప్రతిహత గతికలవాడై, అమరకీర్తితో ప్రఖ్యాతి చెందును. రాబోవు రామరావణ సంగ్రామ రంగములో ఇతడు రామసహాయకుడై ఆ మహాత్మునకు అత్యంత ప్రేమపాత్రుడు కాగలడు” అని తెలిపి స్వస్తానమునకు వెళ్ళిపోయిరి. ఈ రీతిగా హనుమంతునకు వరములను ఇచ్చి దేవతలు తమ తమ నెలవులకు వెళ్ళిపోయిరి. ఈ సమాచారమ౦తయూ విని అంజనాకేసరులు చెప్పలేని ఆనందమును పొందారు.