అంజనాదేవీ వృత్తాంతము
అంజనాదేవీ వృత్తాంతము
మహేంద్రుని అమరావతీ నగరంలో ''పుంజికస్థల'' అను అప్సర ఉండేది. ఒకానొక సమయంలో ఆమె వలన జరిగిన అపరాధమువలన ఒక మహర్షి ఆమెను వానర యోనియందు జన్మి౦చుమని శపించెను. ఆమె అత్యంత వినయభావంతో అనేక రకాలు ప్రార్ధించగా అతడు అనుగ్రహించి ఆమె ఎప్పుడు ఏరూపము ధరింపవలెను అనుకొనునో ఆ రూపము ధరించవచ్చునని వరము ఇచ్చెను. తత్కారణమున ఆమె వానరిగాకానీ యధేచ్చగా సంచరించుటకు అవకాశము లభించెను. ఆమెయే అంజనాదేవి. వానర రాజైన కేసరి ఆమెను భార్యగా స్వికరించెను. సుందరాంగియైన ఆమెను అతడు ఎంతో అనురాగముతో చూసేవాడు. ఒకనాడు వారు ఇద్దరూ మానవరూపములు ధరించి తమ రాజ్యమందలి విహరింపసాగారు. అప్పుడు వాయువు మందమందముగా వీచుచుండెను.
ఆదంపతులు అట్ల విహరించుచుండగా వాయుతరగం ఒకటి అంజన చీర చెంగును ఎగురకొట్టేను. తనను ఎవరో స్పృశించుచున్నట్లు అంజనకు అనిపి౦చెను. ఆమె తన వస్త్రమును సరిచేసుకుని నేరుగా నిలిచి గద్ది౦చుచు, ''నాపాతివ్రత్యమును భంగపరచ సాహసించు వారెవరు? నేనిప్పుడే అట్టివానిని శపించి భస్మముచేసెదను'' అన్నది అందుకు జవాబుగా ''దేవీ ! నేను వాయుదేవుడను. నా స్పర్సవల్ల నీ పాతివ్రత్యము భంగము కాలేదు శక్తిలో, నాతో సమానమైన సుపుత్రుడు నీకు కలుగగలడు. బాలబుద్ద్యాదులందు వానిని తిరస్కరించగలవారెవరు ఉండరు. నేను తనిని సర్వదా రక్షి౦చు చుందును. ఆ చిరకాలంలో నీకు కలుగబోవు భగవత్సేవకుడై ఆదర్శ మార్గగామియై ఆ చంద్రర్కామైన సత్కీర్తిని సముపార్జించగలడు'' అను సమీరదేవుని పలుకులు అంజనకు వినిపించెను. తదనంతరము అంజనాకేసరులు స్వస్తానమునకు వెడలిపోయిరి. శంకరభగవానుడు నిజంశతో శ్రవణే౦ద్రియము గుండా ఆమెగర్భమందు ప్రవేశించెను. శ్రీమత్ వైశాఖ బహుళ దశమి శనివారం నాడు శ్రీ శంకర భగవానుడు అంజనా గర్భము నుండి వానర రూపంలో అవతరించాడు.