హనుమంతుడి రహస్య మంత్రం.. 11సార్లు జపించి చూడండి ఆశ్చర్యపోతారు..!
హనుమంతుడి రహస్య మంత్రం.. 11సార్లు జపించి చూడండి ఆశ్చర్యపోతారు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో ఒక ఇబ్బందులు, సమస్యలు ఉండనే ఉంటాయి. ఫలానా సమస్యకు ఫలానా పని చేస్తే పరిష్కారం ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరిలో మాత్రం తెలియని భయం ఉంటుంది. బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మనసులో మాత్రం తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మరికొందరికి కెరీర్ గురించి భయం, ఇంకొందరికి ఒంటరిగా ఉండాలన్నా, చీకటిలో ఒంటరిగా నడవాలన్నా భయంగా ఉంటుంది. ఇలాంటివి మనిషిని లోపలి నుండి బలహీనంగా మారుస్తాయి. అయితే ఇలాంటి భయాలను తరిమికొట్టే హనుమ మంత్రం ఉంది. ఇది చాలా రహస్యమైనదని పురాణాలు, పండితులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుంటే..
సంకట మోచనుడు హనుమ..
హనుమను సంకట మోచనుడు అని అంటారు. అంటే.. అన్ని రకాల కష్టాలు, ఇబ్బందుల నుండి గట్టెక్కించగల దయామయుడు హనుమంతుడు. సమస్యలను మూలాల నుండి తొలగించేవాడు హనుమంతుడు. పురాణ కథనాలు, నమ్మకాలు, రామచరిత మానస్ వంటి గ్రంథాల ప్రకారం.. భక్తులకు చాలా పెద్ద విపత్తులు సంభవించినప్పుడు హనుమంతుడిని నమ్మితే ఆయన అపరిమిత శక్తితో సమస్యలను తొలగిస్తాడు. అందుకే హనుమంతుడిని సంకట మోచనుడు అని అంటారు.
హనుమ శక్తి..
హనుమ చిరంజీవిగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే కలియుగంలో కూడా ఆయన శక్తి అన్ని కాలాలలో మేల్కునే ఉంటుందని పండితులు చెబుతారు.
రహస్య మంత్రం..
"అంజనిగర్భ సంభూతం కపీంద్రం సచివోత్తమమ్. రామప్రియం నమస్తేభ్యం హనుమాన్ రక్ష సర్వదా."
భావం..
అంజనీ గర్బంలో జన్మించిన హనుమంతుడు, వానరరాజు, శ్రీరాముడికి ప్రియమైన హనుమంతుడా నేను నీకు నమస్కరిస్తున్నాను, అన్ని భయాల నుండి దయచేసి నన్ను రక్షించు అని ఈ మంత్రం అర్థం..
ఈ మంత్రం ఒక ధ్యాన, శరణాగతి మంత్రం. దేవుళ్లను స్తుతిస్తే వారు సంతోషిస్తారు. కానీ శరణు కోరి, వేదనతో లేదా బాదతో నన్ను రక్షించు అని శరణాగతి కోరితే వారి మనసు తొందరగా కరిగిపోతుంది. అందుకే ఈ మంత్రాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు.
ఎప్పుడు, ఎలా జపించాలి..
హనుమంతుడిని ధ్యానం చేసేటప్పుడు, ఉదయం లేదా సాయంత్రం దీపారాధన సమయంలో ఈ మంత్రాన్ని 11సార్లు జపించాలి.
11సార్లు జపించడంలో కూడా ప్రాముఖ్యత చెబుతారు. హనుమంతుడు పరమేశ్వరుడి 11వ అవతారం అని చెబుతారు. అందుకే ఈ సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చారు. హనుమంతుడి పాదాలను ఆశ్రయించిన వ్యక్తులకు కాలం కూడా హాని కలిగించదని చెబుతారు. పురాణ గ్రంథాలలో కూడా ఇది ప్రస్తావించారు.
11సార్లు పైన పేర్కొన్న మంత్రాన్ని జపించడం వల్ల మెదడులో ఒక ప్రత్యేక ప్రకంపనం ఏర్పడుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్ తగ్గుతుంది. ధైర్యాన్ని పెంచుతుంది. కుజ దోషం లేదా శనిదోషం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
*రూపశ్రీ.