హనుమంతుని చరిత్ర
హనుమంతుని చరిత్ర
లో || అతులిత బలధామం స్వర్ణశైలాభా దేహం దనుజ వన క్రుశానుం జ్ఞానినా మగ్రగాణ్యం సకలగుణ నిధానం వానరాణా మధిశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ||
శివ నిర్ణయం శంకర భగవానుడు సతీదేవితో మహొత్తుంగ కైలాస శిఖరముపై విరాజిల్లుచుండేను.వటవృక్షచ్చాయలో కర్పూర సదృశమగు అతని ధవళ గాత్రము పై జాటాజూటము శోభిల్లు చున్నది . పాణిపద్మమందు రుద్రాక్షమాలయు, సుందరగళసీమలో ఫణిరాజులును విరాజిల్లుచున్నవి.భక్తి శ్రద్దలతో మూర్తీభవించిన వినయ భావముతో సేవలకై అంజలిబద్దుడై ఆసీనుడై యుండెనా యనునట్లు ,అయన సమక్షమందు నందీశ్వరుడు కూర్చొని యుండెను .
ఆ మహాదేవుని సహచర ,యనుచర వర్గము కొలది దురములోనే వివిధ క్రీడలలో మునిగి తేలుచు ఆనందించుచున్నది .ఆ విశ్వనాధుని శిరస్సుపై శీతలకిరణుడు,ఆకాశగంగా సద నివసించుచుండుటచే ఫాలనేత్రమను తృతీయ నేత్రాంతర్గత భయంకర విష జ్వాల శాంతించినది.లలాటసీమ నల౦కరించి యున్న పవిత్ర భస్మ మత్యంత సుందరముగా కాన వచ్చుచున్నది . ''రామ రామ ''అనుచూ ధ్యానైకాగ్రతయందున్న ఆ పరమశివుడు అకస్మాతుగా తన సమాధ్యవస్థను భంగపరుచుకొని,పార్వతి వైపు చూచెను
.ప్రాణేశ్వరుడ ట్లపూర్వభావముతో తనను చూచుట సతీదేవియు చూచినది .వెనువెంటనే యామె పతిదేవుని కెదురుగా నిలిచి ,ముకుళితహస్తయై వినయముగా ''స్వామి !ఇప్పుడు నేను మీ కెట్టి సేవ చేయవలెను ? మీ వదనసీమ నవలోకించుచుండ మీరు నాతో నేదియో చెప్పదలచినట్లు గోచరించినది '' అనగా ,శంకరుడు ''ప్రియురాల !నేడు నా మనస్సులో మహోత్తమ శుభసంకల్పము జరిగినది .ఏ మహామహిమాన్వితుని నేను నిర౦తరము ధ్యానించుచూదునో ,ఎవని మంగళ నామమును సర్వదా స్మరించుచూ గద్గదత్వమును చెందు చుందునో,అట్టి ఆ దేవుడే అచిర కాలములో భూలోకమం దవతరించునున్నాడు
.దేవతలందరునూ యా ఆరాధ్యదేవతతో నవతరింప అత్యంత కుతూహల చిత్తులై ఆ ప్రభుసేవ భాగ్యమును పొందుగోరుచున్నారు .ఇట్టి స్థితిలో నేనెందులకు వంచింప బడవలెను?నేను కూడానచ్చటికి పోయి నా ప్రభువును సేవించుకుని ,యుగయుగముల నుండి కలిగిన లాలసను పూర్ణము చేసికొనెదను''అనెను. పతిదేవుని వచనముల నాలకించిన సతి ఆ సమయంలో ఉచితానుచితము లేమిటి యనెడి విషయము వెంటనే నిశ్చయించు కొనలేకపోయేను .ఆమె హృదయంలో ద్వంద భావములు ఏర్పడినవి .తన నాధుని అభిలాష నేరవేరవలెనన్నదొక భావముకాగా- తనకు భర్తకు మధ్య ఎడబాటు కలుగుచున్నదనునని రెండోవ భావము .ఇట్లామే కొన్ని క్షణము లాలోచించి ''నాధ!మీ సంకల్పము యోగ్యమైనది .
నా ఇష్టదైవమైన మిమ్ము నేను సేవింపగోరునట్లే ,మీరు కూడా మీ ఆరాధ్య దైవము సేవింపగోరుచున్నారు .కాని వియోగభితిచే నా హృదయస్టితి ఎట్లగునో తెలియటంలేదు .మీ సుఖమునందే నాసుఖము కలుగగలదని భావింపగలుగునట్లు నాకు శక్తిని ప్రసాదింపుడు .మూడవ విషయమేమనగా ఈ పర్యాయము భగవానుడు రావణ సంహరార్డమవతరింపనున్నాడు .
మీకు పరమభక్తుడైన రావణుడు మిమ్ములను ప్రసన్నులను చేసుకోనుటకై తన శిరస్సును సైతము ఖండించుకొని హోమమోనరించినాడు .అట్టి దశలో వాని సంహార కార్యమునకు మీరెట్ల సహకరింపగలరు ''? అని ప్రశ్నించేను . అంత మహాదేవుడు మందస్మితముచేయుచూ-''దేవీ !నీవు ఎంతటి అమాయకురాలవు ?ఇందులో మన వియోగ విషయమేమున్నది ?నేనొక రూపంలో అవతరించి నా ప్రభువును సేవించుకొనెదను. ఈ రూపంలో నీ వద్దనే ఉంటూ నీకు ఆ లిలామయుని విచిత్ర లీలను చుపించెదను .
సదవకాసము కల్గినప్పుడల్లా నా స్వామిని చేరి ప్రార్దించేదను .ఇక నీ మూడవ సందేహము ను కూడా నివారించుకొనుము .దశకంఠుడొక రీతిగా నన్నారాధి౦చిననూ ఒకానొక సమయంలో నా అంశనొక దానిని అవహేళన చేసినాడు .నేను ఏకాదశంశాలలో నన్ను విషయము నీకు తెలిసినదే .అతడు తన పది తలలనూ ఖండించి నన్ను అర్చించినవేళ నా పదకొండవ అంశనొకదానిని విడిచిపెట్టెను. నే నాదే అంశతో వానికి విరుద్దముగా యుద్దము చేసెదను .వాయుదేవుని ద్వారా అంజనా గర్భమున అవతరింప నిశ్చయించు కొనినాను .ఇక నీ కెట్టి సందేహము లేదు కదా!''అనిన పరమశివుని ప్రియమధుర వచనములకు సతిదేవీ పరమానంద భరితురాలైనది.