GREEN BATHROOM

GREEN BATHROOM Our suggestions to turn your Bathroom into the Cleanest, Greenest room in your home. I am not suggesting you to color the bathroom, here i mean to make it a more eco-friendly and non-toxic environment. Clear the Air: Excess humidity causes mold, which can spur allergies, asthma and other breathing troubles. Since, bathroom is the most humid area in the house, ventilating it is a good idea. Install exhaust vents, as the existing ventilators are very narrow and small. Decorate the area with oxygen-producing plants, they will not only reduce humidity, but also absorb a variety of indoor air pollutants. Plants that don't need direct sunlight are better here. Conserve Water: Controlling the usage of tap water while brushing teeth and taking showers instead of baths can save upto 240 gallons/ 888 liters a month. Installing low-flow shower heads save upto 80% of water consumption. Fixing leaks can save upto 3000 gallons/ 11100 liters a year. Replace or Retrofit your toilet: Replace the flush by installing a controllable flush handle. Put a sealed soda bottle or few pebbles in the tank to instantly reduce water consumption. : Low flow toilets are high-efficiency ones, replace the old models with them. Pick Green products: Use Vinegar to clean the bathroom, instead of the toxic bleach cleaners, Saves you money and harm from toxicity. Using Ceramic tiles is also good as they are not easily damaged due to moisture and they are made in a low-impact process without putting any labourer's life at risk.   - Prathyusha Talluri More articles from this author..... NO EMPTY VASES JARS AND DECOR

మీ పిల్లలనే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా...?

మీ పిల్లలనే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా...? ఈ సారీ మీ పాపకి బర్త్ డేకీ అచ్చంగా మీ పాపలా వుండే బొమ్మని గిఫ్ట్ గా ఇస్తే ? తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా "My twinn" పేరుతో ఇలాంటి బొమ్మలు తయారు చేస్తోంది ఓ అమెరికన్ కంపెని. "My twinn" బొమ్మ అచ్చుగుద్దినట్టు, మన పాపాయిలానే వుంటుంది. దానికి చేయాల్సినదల్లా మన పాప ఫోటో ఇవ్వటమే. ఆ ఫోటోలోని పాప లాంటి బొమ్మని చేసి మనకిస్తారు. అదే రకం డ్రెస్,హెయిర్ స్టైల్, కలర్.. ఇలా ప్రతిది కూడా మీరు పంపిన ఫోటోలాగే ఉంటుంది. ట్విన్ డాల్ కావాలి అని అనుకుంటే ఒక్క డ్రెస్ ఏం సరిపోతుంది.అందుకే మన పాపాయి డ్రెస్సెస్ లని ఫోటో తీసి పంపిస్తే అలాగే డ్రెస్సెస్ తయారు చేసి ఇస్తారు.షుస్ లాంటి యాక్ససరీస్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. ఎప్పటికప్పుడు పాపాయి డ్రెస్ తో పాటు ట్విన్ డాల్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేయవచ్చు. మన పాపాయికి బుల్లి రూపంలో కనిపించే బొమ్మ మీద కూడా పెడతారు. ఆర్డర్ చేయాలన్న ఇంకా వివరాలు కావాలంటే www.mytwinn.com లోకి లాగిన్ అవ్వండి. మీ పాప ఫోటో వివరాలు పంపిస్తే 3 వారాల్లో మీ పాపను పోలిన ట్విన్ డాల్ మీకు అందుతుంది.   - రమ

పిల్లలను ఆకర్షించే పెన్సిల్ బాక్స్ తయారీ

పిల్లలను ఆకర్షించే పెన్సిల్ బాక్స్ తయారీ ఎన్ని పెన్సిల్స్, పెన్నులు కొన్నిచ్చినా కూడా మీ పిల్లలు వాటిని ఎక్కడో పాడేసుకొని, మిమ్మల్ని ప్రతిరోజూ పెన్సిల్ కొన్నివ్వమని విసిగిస్తున్నారా? అయితే వారికీ పెన్సిల్స్, పెన్నులు పెట్టుకోవడానికి కంపాక్స్ బాక్సులు అందరి దగ్గర ఉంటాయి. అవి స్కూల్ వరకు మాత్రమే జాగ్రత్తగా ఉంచేలా చేస్తాయి. కానీ ఇంట్లో ఐతే అలా కాదు కదా. వారికీ నచ్చినట్లుగా అక్కడ, ఇక్కడ పడేస్తుంటారు. మరి అలా పిల్లలు వారి పెన్సిల్స్, పెన్స్ లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండాలంటే.. ఆ వస్తువులను పెట్టుకొనే బాక్స్ వారిని ఆకర్షించేలా ఉండాలి. మరి అలాంటి వస్తువును ఎలా తయారు చేయాలో ఇపుడు ఈ వీడియో ద్వారా చూసి, మనం కూడా అలాగే చేద్దాం...!

WHITE VINEGAR TALKS

WHITE VINEGAR TALKS If your Vinegar could talk....it will shout to Help you!! Dont Boil Eggs without me: To keep eggs from cracking, add 2 tablespoons of White Vinegar per Litre of Water before you boil. Your cooked eggs will stay intact and be easy to peel. I'll hunt that Fish Smell in the Kitchen: Next time you's searing fish or cooking something equally pungent, like Cabbage, place a small bowl of vinegar next to the stove to absorb the odor. I've never met a Sink/Bath Tub Drain i couldn't unclog: The fizzing combo of vinegar and baking soda is a great way to clear out gunk. First pour half a cup of baking soda in the drain, then follow with the mixture of one cup of white vinegar and one cup of hot water. Immediately plug/cover the drain with a rag/ cleaning cloth to keep the bubbles contained for 10minutes. Rinse by pouring a kettle of boiling-hot water down the drain. I can get rid of Sticky Stuff: When you have to remove the sticker from a bottle, to get rid of the sticky glue, dab the spot with vinegar. Try me on a Manicure: Before applying nail polish, wipe your nails with a cotton ball dipped in white vinegar. It removes the coat of natural oils, allowing the nail polish to stay longer and it prevents chipping too. Dont use me to do these: Cleaning Marble/ Granite countertops. Cleaning waxed Wood surfaces/furniture. Remove grease from Cast iron/ Aluminium pans. Scrub Ceramic tiles.   - Prathyusha Talluri   More articles from this author..... Cup Cakes- Paper Flowers Cute Nut Bird CANS AND CRAFT

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...!

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...! మనం నచ్చిన బట్టల పైన కానీ, ఏదైనా వస్తువుల పైన కానీ మరకలు పడిన లేదా జిడ్డుగా మారి దుర్వాసన వచ్చేలా అయితే మనకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి అలాంటపుడు ఆ మరకల నుండి, దుర్వాసనల నుండి మన వస్తువులను ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దామా...! చెమట మరకలు : చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్ డిటర్జెంట్ సబ్బుతో రుద్ది, ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి చెమట మరకలైతే మాత్రం వెనిగర్ తో కేవలం ఆ ప్రాంతాన్నిమాత్రమే రుద్ది, ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్ లేకుండా గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్ బిళ్ళలు వేసి, ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమైతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మరకలపై కొద్దిగా రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి. లిప్ స్టిక్ బాల్ పెన్ మార్క్స్ : ముందుగా మరకపడిన బట్టను ఓ పాత టవల్ పై ఉంచండి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి. కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు : అందమైన, ఖరీదైన కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు పడితే... అందుకే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్ వ్యాక్స్ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్ మొనతో దానిని చెక్కేసి బ్రష్ తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది. డిన్నర్ ప్లేట్ లపై పసుపు రంగు : ప్లాస్టిక్ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు. నిత్యం వాడే బకెట్లు మగ్ లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్ లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి, ఆ తర్వాత సబ్బుతో కడగాలి. ప్లాస్కు దుర్వాసన: ప్లాస్కు లో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇక పొడిగా ఉండేలా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి దాచుకోండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.  

వంటగదిలో మీకు తెలియని కొత్త షెల్ఫ్ ప్రదేశాలు...!

వంటగదిలో మీకు తెలియని కొత్త షెల్ఫ్ ప్రదేశాలు...! పనికిరాని వస్తువులన్నిటిని కూడా స్టోర్ రూమ్ లోపెట్టేస్తుంటాం. ఎందుకంటే ఈ పనికిరాని వస్తువులను తీసేయడం వలన కాస్త ఖాళీ స్థలం దొరుకుతుంది. అదే ఒకవేళ వంటగదిలో అనేక వస్తువులను పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వాటికోసం మరో స్థలాన్నివెతుక్కోకుండా వంటగదిలోనే మనకు నచ్చినట్లుగా ఎలా అందంగా మార్చుకోవచ్చో కొన్ని సూచనల ద్వారా తెలుసుకుందామా...! వంటగది చిన్నగా ఉందనుకోండి.. అందులో మళ్ళీ షెల్ఫ్ లు అంటూ చేస్తే అది ఇంకా ఇరుకుగా మారిపోతుంది. అలాంటప్పుడు సింక్ క్రింది స్థలాన్ని వాడుకొని మన వస్తువులను అమర్చుకోవచ్చు. మరి సింక్ కింది భాగాన్ని ఎలా వాడుకోవచ్చో చూద్దామా...! సింక్ కింది భాగంలో షెల్ఫ్ లాంటివి అమర్చుకోవడం వలన మీకు అవసరమయ్యే వస్తువులను అక్కడే పెట్టుకోవచ్చు. అలా చేయడం వలన అందంగా ఉండటంతో పాటు స్థలం కూడా మనకు ఉపయోగపడుతుంది. పైగా శాశ్వతంగా అక్కడే ఉండే షెల్ఫ్ లను మీరు ఎంచుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైన రిపెర్లకు ప్లంబర్ వస్తే ఈ మొత్తం క్యాబినెట్ నే తొలగించాల్సి కూడా రావచ్చు. అందుకే అటూఇటూ కదల్చడానికి వీలైన ఎన్నో అండర్ సింక్ షెల్ఫ్ లు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. టూ టైర్, త్రీ టైర్ ఫుల్ అవుట్ బాస్కెట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటు ధరలలోనే లభిస్తున్నాయి. అనువైన దానిని ఎంచుకుని సింక్ కింద అమర్చండి. అందులో డిటర్జెంట్లు, లిక్విడ్ సోప్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ డబ్బాలు, బ్రష్ లు, చివరకు హ్యాండ్ టవల్స్ తో సహా చక్కగా సర్దుకోవచ్చు. చిన్న చిన్న బాటిల్స్ లాంటివి ఉంటే వాటన్నింటిని ఒకే ట్రే లో సర్దుకోవచ్చు. మీరు ఈ షెల్ఫ్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకోవచ్చు.

STRANGE JOBS WOMEN IN THE WORLD TAKE UP

STRANGE JOBS WOMEN IN THE WORLD TAKE UP The two highest IQ’s ever recorded (on a standard test) both belong to women. Given a piece of land and the same level of help, Women were found to be more efficient than men, and produced bigger harvests. Women are ready to take up any challenge and come out Winners. There are always the standard career choices—doctor, lawyer, teacher—but there are plenty of other options no one ever hears about. Few women have taken up such jobs which are called WIERD,,,however, they are all for a Living! Odor Tester: Employees at a Perfumery/ Homecare products Company test the efficacy of deodorants and antiperspirants by sniffing subjects’ armpits..it is not fun, its a job for them. Wrinkle Chaser: At shoe companies, it’s a wrinkle chaser’s job to use a special iron to ensure shoes are smooth as glass when they leave the factory. Furniture Tester: Loungers actually get paid to test furniture for companies by sitting on it. They have to wriggle around, rock, lean back, lean forward and assess the overall level of comfort. Somedays furniture testers try out 200 different pieces. Pet Food Taster: They are appointed to taste pet foods for the texture. Its not tasty for humans atall, and the very fact, its pet food. Vomit Cleaner: The roller coaster rides, remind us of people messing up. Some theme parks employ cleaners specifically designated to mop up puke. Professional Sleep Agents: Professional sleepers doze off as part of sleep research projects, to help scientists and doctors figure out the mysteries behind sleep disorders. Resort Waterslide Tester: to check the height, speed, water quantity and landing as well as all safety aspects of the theme park rides.   - Prathyusha Talluri

వంటసోడాతో నమ్మలేని ఉపయోగాలు...!

వంటసోడాతో నమ్మలేని ఉపయోగాలు...! మాములుగా మనం వంటసోడాను వంటల్లో వాడుతుంటాం. కానీ వంట సోడా వలన అసలు ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా? మరింకెందుకు ఆలస్యం వంటసోడా ఉపయోగాలు ఒకసారి చూద్దామా...! * ఆమ్లెట్ ఉబ్బినట్లుగా రావాలంటే గుడ్డుసొనలో చిటికెడు వంటసోడా కలపాలి. అలాగే కేక్ తయారీలోనూ ఉపయోగించవచ్చు. * బజ్జీలు,పకోడీలు లాంటివి కరకరలాడాలంటే, వాటి తయారీలో చిటికెడు వంటసోడా కలిపితే సరిపోతుంది. * స్నానాల గదిలో అద్దాలపైన పడిన నీటి మరకలను తొలగించాలంటే... వంటసోడా సోడాలో నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి దూదితో అద్దాన్ని తుడవాలి. తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. * బకెట్ నీళ్ళలో చెంచా వంటసోడా వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి. * ఫ్లవర్ వాజ్ లో పూలు ఎక్కువ రోజులు తాజాగా వుండాలంటే నీళ్ళల్లో చిటికెడు వంటసోడా కలపాలి. * సాక్సుల దుర్వాసన దూరం చెయ్యాలంటే వంటసోడా కలిపిన నీటితో వాటిని నానబెటట్టి, వాటిని ఉతకాలి. * చెక్క ఫర్నిచర్ పై పడిన పదార్దాల మరకలు పోగొట్టాలంటే ... ఒక మగ్గు నీటిలో చెంచా వంటసోడా వేసి, మరకలు పడిన చోట ఈ నీటితో తుడిస్తే సరిపోతుంది. * చెమట వాసన దూరం కావాలంటే.. కొన్ని నీటిలో పావు చెంచా వంటసోడా కలిపి చల్లుకోండి. చెమట దుర్వాసన దూరమవుతుంది. * దంతాలు పచ్చగా ఉంటే టూత్ పేస్ట్ పై చిటికెడు వంటసోడా వేసుకుని తోముకోండి. దంతాలు మిలమిలా మెరుస్తాయి. * నోటి దుర్వాసన ఇబ్బంది పెడితే... గ్లాసు నీటిలో రెండు చెంచాల వంటసోడా కలిపి పుక్కిలించాలి. దీనివల్ల నోరు రోజంతా తాజాగా వుంటుంది. *వస్త్రాలను శుభ్రం చేయడానికి వంటసోడా బాగా ఉపయోగపడుతుంది. గ్రీజు మరకలైతే ఆ ప్రాంతంలో వంటసోడా చల్లి రుద్ది చూడండి. క్షణాల్లో మరక మాయం.